News


విస్తరణ బాటలో ‘రెడ్ చీఫ్’

Tuesday 27th August 2019
Markets_main1566878872.png-28038

  • గురుగ్రామ్‌లో నూతన స్టోర్‌ ఏర్పాటు

ప్రముఖ లెదర్‌ బ్రాండ్‌ ‘రెడ్ చీఫ్’ తన విస్తరణ ప్రణాళికను వేగవంతం చేసింది. తాజాగా గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 14లో ఎక్స్‌క్లూజీవ్‌ ప్రీమియం బ్రాండ్‌ స్టోర్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ మనోజ్ జ్ఞాన్‌చాందని మాట్లాడుతూ.. ‘మా బ్రాండ్‌కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా షోరూంల సంఖ్యను పెంచుతున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 30 స్టోర్లను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ శరదృతువులో అనేక ఆఫర్లను అందిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంస్థకు 160 సొంత స్టోర్లు ఉండగా.. 24 రాష్ట్రాల్లో 3,000 మల్టీబ్రాండ్‌ అవుట్‌లెట్స్‌ ద్వారా విస్తరించింది. 



You may be interested

పెరిగిన చమురు ధరలు

Tuesday 27th August 2019

యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఎదురుచూస్తున్నానని అనడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒత్తిడి కొం‍త సరళతరం అయ్యింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బారెల్‌ 58.97 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బారెల్‌ 53.87 డాలర్లకు చేరుకున్నాయి. కాగా ఈ ట్రేడ్‌ వార్‌ తీవ్రతరం అవ్వడంతో గత సెషన్‌లో బ్రెంట్‌

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Tuesday 27th August 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు కేంద్రానికి ఆర్‌బీఐ భారీ నిధుల బదిలీకి జలాన్‌ కమిటీ సిఫార్సుచేయడంతో మంగళవారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 165 పాయింట్లు జంప్‌ చేసి 37,658 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,106 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

Most from this category