News


పీఎన్‌బీకి మరో షాక్‌!!

Monday 8th July 2019
Markets_main1562562657.png-26885

  • రూ. 3,805 కోట్లు మోసం చేసిన భూషణ్ పవర్‌ అండ్ స్టీల్‌

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ ఫ్రాడ్ నుంచి తేరుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి మరో షాక్ తగిలింది. తాజాగా దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ (బీపీఎస్‌ఎల్‌) సంస్థ దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. ఖాతాల్లో అంకెల గారడీతో బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందిన బీపీఎస్‌ఎల్‌.. ఆ నిధులను దుర్వినియోగం చేసిందని ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైనట్లు పీఎన్‌బీ పేర్కొంది. "ఫోరెన్సిక్ ఆడిట్‌ విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన నిధుల మళ్లింపు అభియోగాలతో బీపీఎస్‌ఎల్‌, దాని డైరెక్టర్లపై సీబీఐ సుమోటో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్‌కు కూడా నివేదించాం" అని పేర్కొంది. అయితే, ఈ ఖాతాకు సంబంధించి నిబంధనల ప్రకారం ఇప్పటికే రూ. 1,932 కోట్ల మేర కేటాయింపులు జరిపినట్లు పీఎన్‌బీ తెలిపింది. బీపీఎస్‌ఎల్‌ దేశీయంగా చండీగఢ్‌లోని పీఎన్‌బీ కార్పొరేట్ బ్రాంచ్ నుంచి రూ. 3,192 కోట్లు, విదేశీ శాఖల (దుబాయ్‌, హాంకాంగ్‌) నుంచి సుమారు రూ. 614 కోట్లు రుణాలుగా తీసుకుంది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్‌ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్‌బీ వివరించింది. వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్‌ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు పీఎన్‌బీని దాదాపు రూ. 13,500 కోట్ల మేర మోసగించిన సంగతి తెలిసిందే. You may be interested

నేడు ఆర్‌బీఐ బోర్డు సభ్యులతో సీతారామన్‌ భేటీ

Monday 8th July 2019

బడ్జెట్‌లో చర్యలపై చర్చ... న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం(నేడు) రిజర్వ్‌ బ్యాంక్‌ కేంద్ర బోర్డు సభ్యులతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక అంశాలను ఈ సందర్భంగా ఆమె ఆర్‌బీఐకి వివరించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యం ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. ఈ ఏడాది(2019-20) ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.4 శాతం నుంచి 3.3 శాతానికి తాజా పూర్తిస్థాయి బడ్జెట్‌లో తగ్గించిన సంగతి తెలిసిందే. మధ్యంతర

పన్నులతో అదనంగా రూ. 30వేల కోట్ల ఆదాయం

Monday 8th July 2019

సంపన్నులపై పన్నులు చైనా కన్నా తక్కువే రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్ పాండే వెల్లడి న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో చేసిన తాజా పన్ను ప్రతిపాదనలతో ఖజానాకు అదనంగా రూ. 30,000 కోట్ల మేర ఆదాయం సమకూరనుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. అత్యంత సంపన్నుల ఆదాయాలపై సర్‌చార్జీల విధింపు, పెట్రోల్‌..డీజిల్‌పై అధిక సుంకాలు వడ్డనతో పాటు బంగారం.. విలువైన లోహాలపై పెంచిన కస్టమ్స్

Most from this category