News


అమ్ముడుపోని 4 లక్షల ఫ్లాట్లు

Monday 19th August 2019
news_main1566193782.png-27853

  • 9 పట్టణాల్లో అందుబాటు ధరల గృహాల పరిస్థితి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9 పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల వద్ద అమ్ముడుకాని అందుబాటు ధరల ఫ్లాట్లు 4.12 లక్షలు ఉన్నట్టు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ తెలిపింది. ఇవన్నీ కూడా రూ.45 లక్షల ధరల్లోపువేనని పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచినందున, ఈ ఫ్లాట్లు ఇకమీదట వేగంగా అమ్ముడవుతాయని భావిస్తున్నట్టు ప్రాప్‌ టైగర్‌ సంస్థ సీఈవో ధ్రువ్‌ అగర్వాల్‌ అన్నారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌, ముంబై, కోల్‌కతా, నోయిడా, గుర్‌గ్రామ్‌లో అమ్ముడు కాకుండా డెవలపర్ల వద్ద మొత్తం 7,97,623 గృహ యూనిట్లు ఉన్నాయి. ఇందులో అందుబాటు ధరల్లోనివి (రూ.45 లక్షల్లోపు) 4,12,930. హైదరాబాద్‌లో అమ్ముడవకుండా ఉన్న అందుబాటు ధరల ఫ్లాట్లు 4,881. అత్యధికంగా ముంబైలో 1,39,984 యూనిట్లు ఉన్నాయి.



You may be interested

అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

Monday 19th August 2019

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో భారత పెట్టుబడులు ఇతోధికమవుతున్నాయి. జూన్‌ చివరికి 6 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 162.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అమెరికా ఖజానా విభాగం తాజా గణాంకాలను పరిశీలిస్తే... అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల పరంగా అగ్ర స్థానంలో జపాన్‌ ఉంది. ఆ దేశ పెట్టుబడులు 1.122 లక్ష కోట్ల (ట్రిలియన్‌) డాలర్లు మేర ఉండగా, ఆ తర్వాత చైనా 1.112 లక్షల కోట్ల డాలర్లతో

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 19th August 2019

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌         కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: రూ.752 టార్గెట్‌ ధర: రూ.1,057 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ టెక్స్‌టైల్స్‌ కంపెనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పుడు టెక్స్‌టైల్స్‌తో పాటు సిమెంట్‌, రసాయనాలు, వీఎస్‌ఎఫ్‌(విస్కోస్‌ స్టేపుల్‌ ఫైబర్‌-దుస్తుల తయారీలో ఉపయోగించే ఒక రకమైన ఫైబర్‌) విభాగాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లోనే అతిపెద్దదైన అల్ట్రాటెక్‌ సిమెంట్‌లో గ్రాసిమ్‌​ ఇండస్ట్రీస్‌కు 60.2 శాతం వాటా

Most from this category