News


జనవరి కల్లా ఇన్‌-ఫ్లయిట్ డేటా సేవలు

Friday 29th November 2019
news_main1574998079.png-29937

  • నెల్కో వెల్లడి

న్యూఢిల్లీ: విమాన ప్రయాణీకులకు ఇంటర్నెట్ సర్వీసులు అందించే దిశగా ఇన్‌-ఫ్లయిట్ డేటా కనెక్టివిటీ సేవలను జనవరి కల్లా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని టాటా గ్రూప్ సంస్థ నెల్కో ఎండీ పి.జె. నాథ్  తెలిపారు. అయితే, ఇందుకోసం ఏ విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదీ, టారిఫ్‌లు ఎంత ఉండబోతున్నదీ వెల్లడించలేదు. పలు ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యాలు ఉంటాయని మాత్రం చెప్పారు. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన ఇండియా శాట్‌కామ్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ఇన్‌-ఫ్లయిట్‌, మేరీటైమ్ కనెక్టివిటీ (ఐఎఫ్‌ఎంసీ) సేవలు అందించేందుకు నెల్కో ఈ ఏడాది మార్చిలో టెలికం శాఖ నుంచి లైసెన్సు పొందింది. సెప్టెంబర్‌లోనే నౌకల్లో డేటా సేవలు ప్రారంభించింది. పదేళ్ల వ్యవధి ఉండే ఐఎఫ్‌ఎంసీ లైసెన్సుకు వార్షికంగా రూ.1 ఫీజు కట్టాల్సి ఉంటుంది. సదరు సేవల ద్వారా ఆర్జించే ఆదాయం బట్టి లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 



You may be interested

ఏటా 200 కొత్త శాఖలు:ముత్తూట్‌

Friday 29th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ముత్తూట్‌ ఫిన్‌కార్‌‍్ప దేశవ్యాప్తంగా ఏటా 200 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం సంస్థకు 3,600 సెంటర్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 265, ఆంధ్రప్రదేశ్‌లో 317 నెలకొన్నాయని ముత్తూట్‌ ఫిన్‌కార్‌‍్ప చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వాసుదేవన్‌ రామస్వామి తెలిపారు. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోల వినోద్‌ కుమార్‌తో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో

రిలయన్స్‌ @ రూ.10 లక్షల కోట్లు

Friday 29th November 2019

ఈ స్థాయి విలువ సాధించిన తొలి కంపెనీ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన షేరు  జియో, రిటైల్‌ విభాగాల జోరు  (అప్‌డేట్‌...) న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ చివరకు 0.6

Most from this category