ఎగుమతుల వృద్ధికి సీఐఐ కీలక సూచనలు
By Sakshi

న్యూఢిల్లీ: మహిళల వస్త్రాలు, ఔషధాలు, సైక్లిక్ హైడ్రోకార్బన్లు తదితర 31 ఉత్పత్తులు ఎగుమతుల పరంగా ఎక్కువ వృద్ధి అవకాశాలున్నట్టు పారిశ్రామిక సమాఖ్య సీఐఐ ఓ నివేదికలో తెలియజేసింది. ఎనిమిది నెలల తర్వాత దేశ ఎగుమతులు జూన్ మాసంలో ప్రతికూల జోన్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. జూన్లో ఎగుమతులు 9.71 శాతం తగ్గి 25 బిలియన్ డాలర్లకు పరిమితమైన నేపథ్యంలో సీఐఐ ఈ కీలక సూచనలు చేసింది. మన ఉత్పత్తులను వినియోగించే దేశాలతో సుంకాలు కాకుండా ఇతర అడ్డంకులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని పరిష్కరించుకోవాలని కోరింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్లలో సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ‘‘వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ వాణిజ్య దృశ్యం, నూతన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఎగుమతుల వ్యూహం అన్నది ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. భారత్ అంతర్జాతీయంగా కీలక ఎగుమతిదారుగా అవతరించతగిన ఉత్పత్తుల జాబితాను సీఐఐ గుర్తించి, వీటి ఎగుమతుల వృద్ధికి సూచనలు చేస్తోంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
You may be interested
ఐదు రేటింగ్ ఏజెన్సీల పాత్రపైనా సెబీ దర్యాప్తు
Monday 22nd July 2019న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ గ్రూపు కంపెనీలకు మంచి రేటింగ్లు ఇచ్చిన విషయంలో రేటింగ్ ఏజెన్సీల పాత్రపై సెబీ తన దర్యాప్తును విస్తృతం చేయనుంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ కంపెనీలకు మంచి రేటింగ్లు ఇచ్చిన ఐదు కంపెనీల్లో... ఇప్పటికే రెండు రేటింగ్ ఏజెన్సీల సీఈవోలను సెబీ సూచన మేరకు బలవంతంగా సెలవుపై పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదు రేటింగ్ ఏజెన్సీలకు సంబంధించి తీవ్రమైన లోపాలు ఏవైనా
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభంలో 18 శాతం వృద్ధి
Monday 22nd July 2019రూ.5,676 కోట్ల కన్సాలిడేటెల్ లాభం నమోదు స్టాండలోన్ లాభంలో 21 శాతం వృద్ధి ఒక్కో షేరుకు రూ.5 ప్రత్యేక డివిడెండ్ న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు జూన్ త్రైమాసికానికి ఎప్పటి మాదిరే మంచి ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.4,808 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగి రూ.5,676 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.28,000 కోట్లతో పోలిస్తే 19