News


రేట్ల కోత వరుసలో ఆంధ్రాబ్యాంక్‌,, కెనరా బ్యాంక్‌

Saturday 10th August 2019
Markets_main1565415718.png-27680

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా 35 బేసిస్‌ పాయింట్ల రెపో కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.40) నేపథ్యంలో తమ రుణాలపై వడ్డీరేటు తగ్గిస్తున్న బ్యాంకుల వరుసలో తాజాగా ఆంధ్రాబ్యాంక్‌, కెనరా బ్యాంక్‌లు చేరాయి. ఆర్‌బీఐ వరుసగా నాలుగు ద్వైమాసిక కాలాల్లో 1.1 శాతం రేటు తగ్గించిన సంగతి తెలిసిందే. 

పావుశాతం వరకూ ఆంధ్రాబ్యాంక్‌
ఓవర్‌నైట్‌, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది రేట్లను ఆంధ్రాబ్యాంక్‌ 25 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించింది. దీనితో బెంచ్‌మార్క్‌ ఎంసీఎల్‌ఆర్‌ 8.20 శాతం నుంచి 7.95 శాతానికి దిగింది. 

కెనరా బ్యాంక్‌ 10 బేసిస్‌ పాయింట్లు
అన్ని కాలపరిమితుల రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గింది. ఆగస్టు 7వ తేదీ నుంచీ తగ్గిన రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌- నిధుల సమీకరణ వ్యయ ఆధారిత-ఎంసీఎల్‌ఆర్‌) అమల్లోకి వస్తుందని తెలిపింది. గడచిన ఆరు నెలల కాలంలో బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ 20 బేసిస్‌ పాయింట్లు తగ్గింది.  ఈ కాల వ్యవధిలో ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.70 నుంచి 8.50 శాతానికి తగ్గింది. వాహన, గృహ, వ్యక్తిగత రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌ ప్రామాణికంగా ఉంటున్న సంగతి తెలిసిందే.



You may be interested

ఆటోమొబైల్‌లో ఉత్పత్తికి కోతలు

Saturday 10th August 2019

తగ్గిన డిమాండ్‌కు అనుగుణంగా మార్పులు టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా నిర్ణయాలు న్యూఢిల్లీ: మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఆటోమొబైల్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని సవరించుకుంటున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో 8 నుంచి 14 రోజుల వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా శుక్రవారం ప్రకటించింది. టాటా మోటార్స్‌ సైతం తగ్గుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సవరించనున్నట్టు ధ్రువీకరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) పలు ప్లాంట్లలో 8-14 రోజుల

డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ సంస్థలకు చుక్కెదురు

Saturday 10th August 2019

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థకు ఆడిటింగ్‌ సేవలు అందించిన డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌(కేపీఎంజీ సంస్థ)కు ఎన్‌సీఎల్‌టీ షాకిచ్చింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో లోపాలపై ముందుగానే హెచ్చరించడంలో ఇవి విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించాలంటూ కేంద్ర కార్పొరేట్‌ శాఖ లోగడ పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, తమపై నిషేధం విధించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయించే విషయంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అధికార పరిధిని ప్రశ్నిస్తూ

Most from this category