News


పెరిగిన టెల్కోల ఆదాయాలు

Thursday 22nd August 2019
Markets_main1566447037.png-27936

  •  అయిదేళ్ల వ్యవధిపై ట్రాయ్ నివేదిక

న్యూఢిల్లీ: గడిచిన అయిదేళ్లలో మొబైల్ డేటా చార్జీలు ఏకంగా 95 శాతం తగ్గాయి. జీబీకి రూ.11.78 స్థాయికి దిగివచ్చాయి. అయితే టెలికం ఆపరేటర్ల సంచిత ఆదాయం మాత్రం 2.5 రెట్లు పెరిగి రూ. 54,671 కోట్లకు చేరింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2014లో దేశీయంగా డేటా వినియోగం 828 మిలియన్ జీబీగా ఉండగా, 2018లో ఇది 56 రెట్లు పెరిగి 46,404 మిలియన్ జీబీకి పెరిగింది. అలాగే యూజర్లపరంగా సగటు డేటా వినియోగం 0.27 జీబీ నుంచి 7.6 జీబీ దాకా పెరిగింది. ఇక ప్రతి యూజరుపై సగటు ఆదాయం 2014లో రూ. 71.25గా ఉండగా 2018లో ఇది రూ. 90.02కి చేరింది. 2014లో వైర్‌లెస్‌ డేటా యూసేజి విభాగం ద్వారా మొత్తం ఆదాయం రూ. 22,265 కోట్లు రాగా.. గతేడాది రూ. 54,671 కోట్లకు చేరినట్లు ట్రాయ్ నివేదిక పేర్కొంది. మరోవైపు, యూజరుకు వైర్‌లెస్ డేటా ఖరీదు సగటున రూ. 269 (జీబీకి) నుంచి రూ. 11.78కి పడిపోయిందని వివరించింది. 4జీ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఇందుకు తోడ్పడింది. 



You may be interested

డీఎల్‌ఎఫ్‌ 13 శాతం క్రాష్‌

Thursday 22nd August 2019

హర్యానాలోని డీఎల్‌ఎఫ్‌కి చెందిన అతిపెద్ద లాండ్‌ బ్యాంక్‌పై నడుస్తున్న న్యాయసంబంధిత విషయాలను డీఎల్‌ఎఫ్‌ సంస్థ షేర్‌ హోల్డర్లకు తెలియకుండా దాచిందని సుప్రీంకోర్టు ఈ సంస్థకు నోటిసులను జారీ చేసింది. ఫలితంగా గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ కంపెనీ షేరు దారుణంగా పతనమయ్యింది. ఉదయం 9.35 సమయానికి డీఎల్‌ఎఫ్‌ షేరు విలువ 13.02 శాతం నష్టపోయి రూ. 149.25   వద్ద ట్రేడవుతోంది. కాగా ఈ షేరు గత సెషన్‌లో రూ.

వృద్ధి బలహీనతే... రేటు కోతకు కారణం

Thursday 22nd August 2019

- ఆగస్టు 7 విధాన ప్రకటనపై ఆర్‌బీఐ మినిట్స్‌ విడుదల ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు బలహీనత వల్లే ఆగస్టు 7 విధాన సమీక్ష సందర్భంగా 0.35 శాతం రేటు కోత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ఆగస్టు 7 పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో

Most from this category