News


జీవిత బీమా తప్పనిసరి!!

Wednesday 26th June 2019
news_main1561533383.png-26582

బజాజ్‌ అలియాంజ్‌ సర్వేలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీవిత బీమా కలిగి ఉండటమనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తమ అధ్యయనంలో తేలిందని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా లైఫ్‌ గోల్స్‌ పేరుతో పలు నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 1,681 మంది సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో 60 శాతం మంది జీవిత బీమాను అత్యంత ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎండీ తరుణ్‌ చుగ్‌ మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘‘సర్వే ప్రకారం.. పిల్లల విద్య, ప్రశాంత జీవనం, సొంత ఇల్లు కీలకంగా ఉన్నాయి. 10 శాతం మంది సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. పది మందిలో ఒకరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం లేదా ఉద్యోగంతోపాటు అదనపు సంపాదన కోసం చూస్తున్నారు. రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం గురించి అయిదుగురిలో ఇద్దరు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు’’ అని తరుణ్‌ చుగ్‌ వివరించారు. 
సోషల్‌ మీడియా ప్రభావం...
పలు విదేశీ పర్యాటక కేంద్రాలను చుట్టి రావాలని 28 శాతం మంది లక్ష్యంగా చేసుకున్నట్లు చుగ్‌ చెప్పారు. ‘‘దక్షిణాది వారిలో ఇది 35 శాతంగా ఉంది. ముగ్గురు మహిళల్లో ఒకరికి ట్రావెల్‌ గోల్స్‌ ఉన్నాయి. 40 శాతం మంది హెల్త్‌, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. సగం మంది బ్యాలెన్స్‌ లైఫ్‌ ఉండాలని కోరుకున్నారు. సామాజికంగా తాము ప్రభావం చూపాలని 10 శాతం మంది ఉత్సాహం కనబరుస్తున్నారు. జీవిత లక్ష్యాలు నిర్దేశించుకోవడంలో సోషల్‌ మీడియా ప్రభావం ఉందని అయిదుగురిలో ఒకరు తెలిపారు. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ సరిపడ చేయలేకపోయామని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. 62 శాతం మంది తమ లక్ష్యాలను చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు’’ అని వివరించారు. 



You may be interested

నేను చేసిన పెద్ద తప్పు అదే !

Wednesday 26th June 2019

ఆండ్రాయిడ్‌కు ధీటైన ఓఎస్ తేలేకపోయా  మైక్రోసాఫ్ట్‌ బిల్‌గేట్స్‌ వాషింగ్టన్‌: ఆండ్రాయిడ్‌ను అభివృద్ధి చేసే అవకాశం గూగుల్‌కు దక్కేలా చేయడం, ఆండ్రాయిడ్‌కు ధీటైన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారు చేసుకోలేకపోవడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. ఫలితంగా తమ కంపెనీకి 40,000 కోట్ల డాలర్ల నష్టం వచ్చిందని వివరించారు. ఆండ్రాయిడ్‌ను 5 కోట్ల డాలర్లకే ఎగరేసుకుపోయిన గూగుల్‌ నిజమైన విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. వెంచర్‌

31000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 26th June 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో 0.75శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,809.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రాంరంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 0.75శాతం (203 పాయింట్లు) పెరిగి 31,054.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,847.05)తో పోలిస్తే పావుశాతం(200.65 పాయింట్లు)

Most from this category