News


కోటక్‌ బ్యాంక్‌ లాభం రూ. 1, 932 కోట్లు

Tuesday 23rd July 2019
Markets_main1563862992.png-27247

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,932 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ1లో వచ్చిన నికర లాభం(రూ.1,574 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. నికర లాభంలో 30 శాతం వాటా అనుబంధ కంపెనీల వల్లనే వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.9,904 కోట్ల నుంచి రూ.12,130 కోట్లకు చేరిందని పేర్కొంది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.1,052 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ. 1,360 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇక ఆదాయం రూ.6,644 కోట్ల నుంచి రూ.7,945 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

తగ్గిన కేటాయింపులు...
రుణ నాణ్యత తగిన స్థాయిలోనే ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ1లో 2.17 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 2.19 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు 0.86 శాతం నుంచి 0.73 శాతానికి తగ్గాయని పేర్కొంది. మొండి బకాయిలకు, అత్యవసరాలకు కేటాయింపులు రూ.499 కోట్ల నుంచి రూ.350 కోట్లకు తగ్గాయని తెలిపింది. 



You may be interested

మూతబడుతున్న పేమెంట్స్‌ బ్యాంకులు

Tuesday 23rd July 2019

ఆదిత్య బిర్లా పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేత నిర్ణయం ముందుగానే తప్పుకున్న మూడు సంస్థలు     ప్రజలందరికీ మరింతగా ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పేమెంట్స్‌ బ్యాంకుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారుతోంది. లా¿¶ సాటైన వ్యాపార విధానం లేకపోవడంతో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నాళ్లకే కొన్ని మూతబడగా, అసలు మొదలుపెట్టకుండానే మరికొన్ని వైదొలుగుతున్నాయి. వొడాఫోన్‌ ఎం–పెసా ఈ నెల తొలినాళ్లలోనే కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. తాజాగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌

డాలర్‌ రికవరీ: నష్టాల్లో పసిడి

Tuesday 23rd July 2019

ప్రపంచమార్కెట్లోని పసిడి ధర మంగళవారం 9డాలర్ల మేర నష్టపోయింది. డాలర్‌ బలపడటంతో పాటు ట్రేడర్ల లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,425.55డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ వరుసగా మూడోరోజూ రికవరీ కావడంతో పాటు వారం రోజుల గరిష్టాన్ని అందుకోవడంతో పసిడి ఫ్యూచర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల భారీ కోతను అరశాతంగా

Most from this category