News


ఇండిగోతో లావాదేవీలన్ని సరైనవే

Thursday 11th July 2019
Markets_main1562822590.png-26972

  • గంగ్వాల్ ఆరోపణలపై భాటియా గ్రూప్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగోలో అవకతవకలు జరుగుతున్నాయంటూ సహ ప్రమోటరు రాజేష్‌ గంగ్వాల్ చేసిన ఆరోపణలపై మరో వ్యవస్థాపక ప్రమోటరు రాహుల్ భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్ స్పందించింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌తో తమ గ్రూప్ సంస్థల లావాదేవీలన్నీ సక్రమమైనవేనని పేర్కొంది. అనుబంధ పార్టీల మధ్య లావాదేవీలన్నీ సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగానే, సహేతుక రీతిలోనే జరిగాయని ఐజీఈ గ్రూప్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌తో (ఐజీఏఎల్‌) నాలుగు విభాగాల్లో లావాదేవీలు ఉన్నట్లు వివరించింది. ఐజీఏఎల్‌కు లీజుకు ఇచ్చిన రియల్ ఎస్టేట్‌, సిమ్యులేటర్‌ శిక్షణా కేంద్రం, నిర్దిష్ట విదేశీ మార్కెట్లకు సంబంధించి ఒప్పందాలు, ఎకార్ హోటల్స్‌లో సిబ్బందికి బస సదుపాయం కల్పించడం మొదలైనవి ఇందులో ఉన్నట్లు పేర్కొంది. ఆడిట్‌ కాని లెక్కల ప్రకారం ఈ లావాదేవీలన్నింటి పరిమాణం దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని తెలిపింది. ఐజీఏఎల్‌లో గంగ్వాల్‌, ఆయన సంస్థలకు 37 శాతం, భాటియా.. ఆయన గ్రూప్‌ సంస్థలకు 38 శాతం వాటాలున్నాయి.



You may be interested

బుక్‌-మైషోలో వాటా కోసం దిగ్గజాల క్యూ

Thursday 11th July 2019

 కంపెనీ విలువ విలువ వంద కోట్ల డాలర్లపైనే!! ముంబై: ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంస్థ బుక్‌-మైషోలో వాటా కొనుగోలు కోసం పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బుక్‌-మైషోలో 10-12 శాతం వాటా కొనుగోలు కోసం ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం జనరల్‌ అట్లాంటిక్‌, సింగపూర్‌ సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ టెమసెక్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వాటా కొనుగోళ్లకు

మహిళా ఉద్యోగులు డబుల్‌!!

Thursday 11th July 2019

అయిదేళ్లలో ఫేస్‌బుక్ ప్రణాళిక శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వచ్చే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. అలాగే నల్లజాతి వారు, లాటిన్ అమెరికన్ ఉద్యోగుల సంఖ్యను సైతం రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. సిబ్బందిలో వైవిధ్యాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఈ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు సంస్థ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ మాక్సిన్ విలియమ్స్ తెలిపారు. 2024 నాటికి తమ సిబ్బందిలో సగభాగం ఉద్యోగుల్లో మహిళలు,

Most from this category