News


ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్లు, యాప్స్‌

Saturday 10th August 2019
Markets_main1565417098.png-27683

  • ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇండిగో వ్యూహం

కోల్‌కతా: చిన్న పట్టణాల్లోని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్స్‌, యాప్స్‌ను ప్రవేశపెట్టడంపై ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ ఇండిగో కసరత్తు చేస్తోంది. హిందీ, బెంగాలీతో పాటు ఎనిమిది భారతీయ భాషల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు డిజిటల్ సక్సెస్ సదస్సు - 2019లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్ (డిజిటల్‌) నితిన్ సేఠి చెప్పారు."మాకు డిజిటల్ మాధ్యమం చాలా ముఖ్యం. మరింత మంది ప్రయాణికులకు చేరువయ్యేందుకు ప్రాంతీయ భాషలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. వచ్చే త్రైమాసికం నాటికి హిందీ వెబ్‌సైట్ ప్రారంభిస్తాం. ఆ తర్వాత యాప్‌ కూడా ప్రవేశపెట్టనున్నాం" అని ఆయన వివరించారు. తమ ప్రయాణికుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి ప్రయాణించే వారి వాటా 25-30 శాతం దాకా ఉంటుందని సేఠి తెలిపారు. వ్యాపార వృద్ధికి సంబంధించి మొట్టమొదటిసారిగా విమానంలో ప్రయాణించే వారు చాలా కీలకమని చెప్పారు. ప్రతి నెలా 65 లక్షల మంది పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నామని, 2019 జూన్ ఆఖరు నాటికి తమ మార్కెట్ వాటా 48.1 శాతంగా ఉందని సేఠి వివరించారు. 



You may be interested

1500డాలర్ల పైన ముగిసిన పసిడి ఫ్యూచర్స్‌

Saturday 10th August 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం 1500 డాలర్ల పైన ముగిసింది. అమెరికా మార్కెట్లో నిన్న రాత్రి ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,508.50 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా 3.5శాతం ర్యాలీ చేసిన పసిడి ఫ్యూచర్లు బుధవారం రోజున 1,522.35 వద్ద ఆరేళ్ల గరిష్టస్థాయిని అందుకుంది. వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా డాలర్‌ మారకంలో తన దేశపు కరెన్సీ యువాన్‌ను

తయారీ, మైనింగ్‌ పేలవం

Saturday 10th August 2019

జూన్‌ పారిశ్రామిక ఉత్పత్తిపై ఎఫెక్ట్‌ వృద్ధి కేవలం 2 శాతం నాలుగు నెలల కనిష్ట స్థాయి న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మెరుగుపడ్డం లేదు. జూన్‌లో కేవలం 2 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూన్‌తో (అప్పట్లో వృద్ధి రేటు 7 శాతం) పోల్చితే 2019 జూన్‌లో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువస్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. శుక్రవారం కేంద్రం

Most from this category