News


వరుణ దేవుడా... క్రికెట్‌ మ్యాచ్‌లకు అడ్డురాకు...!

Monday 24th June 2019
news_main1561357267.png-26521

  • బీమా కంపెనీల ప్రార్థన
  • వర్షంతో మ్యాచులు రద్దయితే రూ.100 కోట్ల భారం

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్‌ సందర్భంగా... భారత మ్యాచులకు అడ్డు పడొద్దు వరుణుడా..!? అని సగటు అభిమానులు ప్రార్థించడం సర్వ సాధారణం. కానీ, బీమా కంపెనీలు కూడా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే వర్షం కారణంగా భారత మ్యాచులు రద్దయితే బీమా కంపెనీలు పరిహారం రూపంలో రూ.100 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. సెమీ ఫైనల్స్‌కు ముందు భారత్‌ మరో నాలుగు మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఈ నాలుగు కూడా వర్షం కారణంగా రద్దు కావన్న ఆశలతో బీమా కంపెనీలు ఉన్నాయి. తొలి దశలో ఇప్పటికే భారత్‌, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను వర్షం కారణంగా కోల్పోవాల్సి వచ్చిన విషయం గమనార్హం. ప్రస్తుత ఐసీఐసీఐ ప్రపంచ కప్‌లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లకు వర్షం అడ్డుతగిలింది. క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించి మన దేశంలో రూ.150 కోట్ల బీమా మార్కెట్‌ ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. న్యూ ఇండియా అష్యూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సాధారణంగా ఈ తరహా బీమా పాలసీలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. క్లెయిమ్స్‌ ఎదురైతే వీటిపైనే ఎక్కువ భారం పడుతుంది. 
భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు రూ.50కోట్లు...
భారీగా వెచ్చించి ఐసీఐసీఐ క్రికెట్‌ మ్యాచుల ప్రసార హక్కులను కొనుగోలు చేసిన ప్రసార మాధ్యమాలు సాధారణంగా క్రికెట్‌ మ్యాచులు రద్దయితే తలెత్తే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ పాలసీలను తీసుకుంటుంటాయి. దీంతో వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయినా, వర్షం కారణంగా అవరోధం ఏ‍ర్పడి మ్యాచ్‌ను కుదించడం వల్ల ప్రకటనల ఆదాయం నష్టపోవడం జరిగినా పరిహారం పొందొచ్చు. మ్యాచ్‌ యథావిధిగా జరిగితే బీమా కంపెనీలు ఊపిరిపీల్చుకున్నట్టే. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌పై ఏకంగా రూ.50 కోట్ల బీమా తీసుకోవడం దీనికున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం మేరకు... ఒక్కో మ్యాచ్‌ ప్రసార సమయంలో ప్రకటనలపై రూ.5-50 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. అదే ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌ వంఇ ప్రత్యేక మ్యాచుల్లో ఈ ఆదాయం రూ.70-80 కోట్ల వరకు ఉంటుంది. 



You may be interested

మిడ్‌క్యాప్స్‌లో లాభాల కోసం...

Monday 24th June 2019

డీఎస్‌పీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ బాగా చౌక విలువల వద్ద అందుబాటులో ఉన్న మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు ఆశించాలనుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో డీఎస్‌పీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ ఒకటి. మోస్తరు రిస్క్‌ తీసుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.  రాబడులు ఈ పథకం దీర్ఘకాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీకి మించి రాబడులను ఇచ్చింది. ఏడాది కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100లో నికర నష్టాలు 6.3 శాతంగా ఉంటే,

ప్రభుత్వ మైనింగ్‌ కంపెనీలను ప్రైవేట్‌ పరం చేయండి

Monday 24th June 2019

బ్యాంక్‌లకు, పీఎస్‌యూలకు మరింత స్వయంప్రతిపత్తి  ప్రధానికి వేదాంత అనిల్‌ అగర్వాల్‌ సూచన  న్యూఢిల్లీ: ఎన్‌ఎమ్‌డీసీతో సహా మరో ఐదు ప్రభుత్వ రంగ మైనింగ్‌ కంపెనీలను ప్రైవేట్‌పరం చేయాలని వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. హిందుస్తాన్‌ జింక్‌, హిందుస్తాన్‌ కాపర్‌, కోలార్‌ గోల్డ్‌, యురేనియమ్‌ -కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీల్లో వాటాలను కేంద్రం పూర్తిగా విక్రయించాలని పేర్కొన్నారు. ముందస్తు బడ్జెట్‌ సమావేశంలో భాగంగా శనివారం ప్రధానితో

Most from this category