News


7% కాదు... 6.1 శాతమే!

Wednesday 16th October 2019
Markets_main1571198368.png-28911

  • 2019 భారత్‌ వృద్ధిరేటుకు ఐఎంఎఫ్‌ కోత
  • ఆటోమొబైల్‌, రియల్టీసహా 
  • పలు రంగాలు ప్రతికూలం
  • నాన్‌-బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ 
  • కంపెనీల పరిస్థితీ అనిశ్చితే!

వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను తగ్గిస్తున్న పలు సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా చేరింది. 2019లో వృద్ధి కేవలం 6.1 శాతంగానే నమోదవుతుందని తన వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఏప్రిల్‌ అంచనా (7.3 శాతం)తో పోల్చితే తాజా అంచనా ఏకంగా 1.2 శాతం తక్కువ. నిజానికి ఏప్రిల్‌లో 7.3 శాతం అంచనావేసిన మూడు నెలల తర్వాత ఈ రేటును 7 శాతానికి ఐఎంఎఫ్‌ కుదించింది. తాజాగా ఈ అంచనాను మరింత తగ్గించింది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా అంచనాలకు సరిసమానంగా ఐఎంఎఫ్‌ అంచనా ఉండడం గమనార్హం. 2018లో భారత్‌ వృద్ధి రేటు 6.8 శాతం. తాజా అంచనాల కుదింపునకు పలు కారణాలను ఐఎంఎఫ్‌ పేర్కొంది. అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
- ఆటోమొబైల్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. ఇక కీలకమైన నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగంలో కూడా అనిశ్చితి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. దీనికితోడు దేశీయంగా బలహీన డిమాండ్‌ పరిస్థితుల ప్రభావం ఊహించినదానికన్నా ఎక్కువగా ఉంది. 
- అయితే 2020లో వృద్ధి రేటు 7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ అంచనా కూడా గతంలో 7.5 శాతంగా ఉంది. 
- రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సరళతర ద్రవ్య, పరపతి విధానాలు, కార్పొరేట్‌ ఆదాయ పన్ను రేట్లు తగ్గింపు, కార్పొరేట్‌ రెగ్యులేటరీ వ్యవస్థల్లో అవకతవకల తగ్గింపునకు తీసుకుంటున్న చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు 2020లో వృద్ధికి దోహదపడే అంశాలు.
- ఇక చైనాలో 2018లో జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతం ఉంటే, 2019లో 6.1 శాతంగా ఉంటుంది. ఇది భారత్‌ సాధించే వృద్ధి రేటు అంచనాలకు సరిసమానం కావడం గమనార్హం. 2020లో చైనా వృద్ధిరేటు మరింత తగ్గి 5.8 శాతానికి దిగే అవకాశం ఉంది. 
- ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేసారి మందగమనంలోకి జారుతున్నాయి. ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు 2019లో 3.2 శాతం, 2020లో 3.4 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 16th October 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ఫలితంగా బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 125 పాయింట్ల లాభంతో 38,637 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్ల పెరుగుదలతో 11,465 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. బీపీసీఎల్‌ 5 శాతం గ్యాప్‌అప్‌తో ట్రేడింగ్‌ను ఆరంభించగా, జీ టెలి, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1-2 శాతం మధ్య లాభపడగా, వేదాంత, ఐషర్‌ మోటార్స్‌,

స్వదేశీ బ్రాండ్లకే మనోళ్లు మొగ్గు..!

Wednesday 16th October 2019

స్వదేశీ బ్రాండ్లకే భారత వినియోగదారుల మొగ్గు  బీసీజీ సంస్థ సర్వేలో వెల్లడి  ముంబై: భారత వినియోగదారుల్లో దాదాపు సగం మంది విదేశీ బ్రాండ్ల కంటే స్వదేశీ బ్రాండ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ, బీసీజీ వెల్లడించింది. భారత వినియోగదారులు ఆహారం, వ్యక్తిగత సంరక్షణ కేటగిరీల్లో స్వదేశీ బ్రాండ్లకే మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని బీసీజీ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాజకీయంగా జాతీయత వాదం బలం పుంజుకుంటున్న వేళ, దేశీ వస్తువులనే కొనుగోలు

Most from this category