STOCKS

News


ఇథనాల్‌ ధర పెంపు

Wednesday 4th September 2019
Markets_main1567577184.png-28181

  • లీటరుకు రూ. 1.84 దాకా పెంపు
  • 1 బిలియన్ డాలర్ల మేర తగ్గనున్న
  • చమురు దిగుమతుల భారం

న్యూఢిల్లీ: చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ రేటును లీటరుకు రూ. 1.84 దాకా పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏటా 1 బిలియన్ డాలర్ల మేర చమురు దిగుమతుల భారం తగ్గుతుందని అంచనా. డిసెంబర్ 1 నుంచి చక్కెర మిల్లుల నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు కొత్త రేట్ల ప్రకారం కొనుగోళ్లు జరుపుతాయని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. 'సి గ్రేడు మొలాసిస్‌' నుంచి తీసిన ఇథనాల్ ధర లీటరుకు 29 పైసలు పెంచడంతో కొత్త ధర రూ. 43.75గా ఉండనుంది. ఇక 'బి గ్రేడు మొలాసిస్‌' నుంచి తీసే ఇథనాల్ రేటు రూ. 1.84 పెరిగి లీటరు ధర రూ. 54.27కి చేరుతుంది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమ పరిమాణం పెంచడం వల్ల ఏటా 2 మిలియన్ టన్నుల మేర చమురు వినియోగం, తద్వారా 1 బిలియన్ డాలర్ల దిగుమతుల భారం తగ్గుతుందని ప్రధాన్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమ పరిమాణం ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 7 శాతానికి, 2021-22 నాటికి 10 శాతానికి పెరగనున్నట్లు ఆయన వివరించారు. 2018-19లో 226 మిలియన్ టన్నుల చమురు దిగుమతులపై భారత్‌ 112 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మరోవైపు, మిగులు చెరకు/చక్కెరను ఇథనాల్ తయారీ వైపు మళ్లించేందుకు రేట్ల పెంపు తోడ్పడుతుందని చక్కెర మిల్లుల సమాఖ్య ఐఎస్‌ఎంఏ డైరెక్టర్ జనరల్ అబినాష్ వర్మ పేర్కొన్నారు.You may be interested

వోల్వో ఎక్స్‌సీ-90 @ రూ. 1.42 కోట్లు

Wednesday 4th September 2019

కేవలం 15 కార్లు మాత్రమే విక్రయం ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన ఆల్ట్రా-లగ్జరీ హైబ్రీడ్‌ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఎక్స్‌సీ-90’ పేరుతో విడుదలైన ఈ త్రీ-సీటర్‌ కారు ధర రూ. 1.42 కోట్లుగా ప్రకటించింది. వచ్చే ఏడాదికాలంలో కేవలం 15 కార్లను మాత్రమే ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నట్లు వోల్వో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చార్లెస్‌ ఫ్రంప్‌ వెల్లడించారు. ఎంపికచేసిన కస్టమర్లకు

ఐడీబీఐ బ్యాంక్‌కు రూ. 9,300 కోట్ల నిధులు

Wednesday 4th September 2019

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకును గాడిన పెట్టే దిశగా రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్‌ వెల్లడించారు. బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్‌ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్‌-టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో

Most from this category