STOCKS

News


పెట్టుబడులపై టాస్క్‌ఫోర్స్‌ దృష్టి

Wednesday 11th September 2019
Markets_main1568173177.png-28293

  • అనంతరం కేంద్రం నుంచి నిధులు
  • మరో ఒకటి రెండు ఉద్దీపన ప్రకటనలు
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

చెన్నై: మౌలికరంగ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌.. కేంద్రం నుంచి నిధుల సహకారం అవసరమైన రంగాలను గుర్తించే పనిలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తన వ్యయాలను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఇందులో మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడమే ఉత్తమమని చెప్పారు. ఇప్పటికే 100 లక్షల కోట్లను మౌలిక రంగంపై ఖర్చు చేయనున్నట్టు తాము ప్రకటించామని, దాన్ని వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టులను వేగంగా గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, దాంతో నిధులు వెచ్చించడం వీలు పడుతుందని వివరించారు. ‘‘ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ పని ఆరంభించింది. ప్రాజెక్టులను గుర్తించే పనిలో ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. నీతిఆయోగ్‌ సీఈవోతోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఇతర సీనియర్‌ అధికారులతో ప్రభుత్వం ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వం ఇప్పటికే రెండు భారీ నిర్ణయాలను (ప్రోత్సాహకాలు) ప్రకటించిందని, మరో ఒకటి రెండు నిర్ణయాలు ఉంటాయని తాను హామీనిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 
5 ట్రిలియన్‌ డాలర్లు సాధ్యమే...
5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీసుకెళ్లేందుకు... మౌలిక రంగంపై నిధులు ఖర్చు చేయడంతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ని ర్ణయాలు భాగమేనని మంత్రి తెలిపారు. దేశ జీడీపీ 5 శాతానికి జూన్‌ క్వార్టర్‌లో పడిపోయిన నేపథ్యంలో, 5 ట్రిలియన్‌ డాలర్లకు జీడీపీని తీసుకెళ్లడం సాధ్యమేనా? అ‍న్న మీడియా ప్రశ్నకు.. జీడీపీ పెరగడం, తగ్గడం మామూలేనని సులభంగా చెప్పారు. యూపీఏ హయాంలో 2012-13, 2014-15లోనూ ఇదే జరిగిందన్నారు. ‘‘గతంలో ఆహార ద్రవ్యోల్బణం 10 శాతాన్ని దాటిపోయింది. కానీ అది ఇప్పుడు 3.1 శాతంగానే ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు, 4 శాతాన్ని చేరలేదు. జీడీపీ గురించి ఆందోళన చెందే వారు ద్రవ్యోల్బణ రేటును కూడా చూడాలి’’అని మంత్రి వివరించారు. రానున్న త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిని పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. బంగారం ధరలు పెరగడానికి... వినియోగదారులు బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్నారని, చమురు ధరల పెరుగుదల, అమెరికా డాలర్‌ రేటులో మార్పులు కూడా కారణమేనన్నారు. దేశీయ అవసరాలను చేరుకునేందుకు బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. You may be interested

యాపిల్‌ ఐఫోన్‌ 11 వచ్చేసింది..

Wednesday 11th September 2019

ప్రారంభ ధర 699 డాలర్లు యాపిల్‌ టీవీ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రారంభం ఆర్కేడ్‌ పేరుతో వీడియో గేమింగ్‌ సర్వీస్‌  కూడా.. కాలిఫోర్నియా: ప్రపంచమంతా ఉత్కంఠతో  ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్‌లను యాపిల్‌ విడుదల చేసింది. ఐఫోన్‌ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియమ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో  ఆవిష్కరించారు. ఐఫోన్‌ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్,

ఈ ఏడాది ఐపీవో మార్కెట్లో విజయాలే ఎక్కువ

Tuesday 10th September 2019

ఈ ఏడాది సెకండరీ మార్కెట్లోకి వచ్చిన (ఐపీవో) కంపెనీల్లో చాలా వరకు ఇష్యూలు వాటి జారీ ధర కంటే ఎగువనే ట్రేడవుతున్నాయి. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక రంగం వృద్ధి బలహీనపడడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మార్కెట్లు తీవ్ర అస్థిరతలను చవిచూస్తున్నాయి. కానీ, ఐపీవో మార్కెట్‌కు ఇవేమీ పట్టలేదు.! ఎందుకంటే ఈ ఏడాది ఐపీవో

Most from this category