News


తెలంగాణలో బ్యాటరీ తయారీ కంపెనీలు

Thursday 18th July 2019
Markets_main1563430362.png-27145

మొత్తం రూ.6,000 కోట్ల పెట్టుబడులు
15 నెలల్లో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ ప్లాంట్లు తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ వద్ద రానున్న ఈ కేంద్రాల్లో తొలి దశలో రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఒక గిగావాట్‌తో ప్రారంభమై మూడు దశల్లో 10 గిగావాట్‌ సామర్థ్యానికి చేరుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి తెలిపారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బుధవారమిక్కడ నిర్వహించిన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ సమ్మిట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మూడు సంస్థల ద్వారా రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. నెల రోజుల్లో ఫ్యాక్టరీల నిర్మాణం ప్రారంభమై, 9-15 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం 200 ఎకరాల పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిని 900 ఎకరాల స్థాయికి చేరుస్తామని వివరించారు. 
భాగ్యనగరిలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్లు...
హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్లు తిరిగే విషయమై పోలీసు శాఖతో చర్చిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తెలిపారు. నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, దీనిని తగ్గించడంలో భాగంగా కాలం చెల్లిన పాత త్రీవీలర్ల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలతో రీప్లేస్‌ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, బ్యాటరీల తయారీలో వాడే లిథియం నిక్షేపాలున్న బొలీవియాలో మైనింగ్‌ కోసం భారత కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే తమ దేశంతో చర్చలు జరుపుతున్నాయని భారత్‌లో బొలీవియా రాయబారి జె.జె.కార్టెజ్‌ తెలిపారు. You may be interested

దివాలా కంపెనీలకు 330 రోజుల్లో పరిష్కారం

Thursday 18th July 2019

సత్వర పరిష్కారం దిశగా చర్యలు ఐబీసీ చట్టంలో సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం న్యూఢిల్లీ: దివాలా చట్టంలో ఏడు రకాల కీలక సవరణలు చేసేందుకు ఉద్దేశించిన ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (సవరణ) బిల్లు, 2019కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కార్పొరేట్‌ పరిష్కార ప్రక్రియకు 330 రోజుల గడువును నిర్ణయించడం ఇందులో ప్రధాన సవరణ. ప్రస్తుతానికి ఈ గడువు 270 రోజులే ఉన్పపటికీ చాలా కేసుల్లో ఎక్కువ సమయమే తీసుకుంటోంది. దరఖాస్తులను

‘ఇంటెల్లిజెంట్‌ వెహికిల్స్‌’ వస్తున్నాయ్‌

Thursday 18th July 2019

డ్రైవర్‌ వాహనాన్ని నడుపుతున్న తీరు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు హెచ్చరించడం.. అలాగే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అలర్ట్‌ చేయడమేగాక, స్పందించే వ్యవస్థ వెహికిల్‌లో ఉంటే! ఇంకేముంది.. ఎంచక్కా నిశ్చింతగా ప్రయాణించొచ్చు. ఆటోమోటివ్‌ రిసర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) ఈ పనిలో నిమగ్నమవడమేగాక అందుకు తగ్గ వ్యవస్థను అభివృద్ధి చేసింది కూడా. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి భారత్‌లోని పలు వాహన తయారీ కంపెనీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఏఆర్‌ఏఐ డైరెక్టర్‌ రశ్మి

Most from this category