News


మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ ఎక్స్‌7’

Friday 26th July 2019
Markets_main1564133869.png-27336

  •  ప్రారంభ ధర రూ.98.9 లక్షలు
  •  6.1 సెకన్లలో సున్నా నుంచి 100కి.మీ వేగం

గురుగ్రామ్‌: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ఫ్లాగ్‌షిప్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ) ‘ఎక్స్‌7’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.98.9 లక్షలు (ఎక్స్‌-షోరూం). పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో ఈ నూతన ఎస్‌యూవీ లభిస్తుండగా.. పెట్రోల్‌ వేరియంట్‌ కేవలం 6.1 సెకన్ల సమయంలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డీజిల్‌ వేరియంట్‌ ఏడు సెకన్ల వ్యవధిలో వంద కి.మీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది. ఎయిర్ సస్పెన్షన్‌లో మార్పులు చేయడం ద్వారా కారు ఎత్తును పెంచడం, తగ్గించడం.. ఫైవ్‌ జోన్‌ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వంటి అధునాతన సౌకర్యాలు ఈ ఎస్‌యూవీలో ప్రత్యేకతలుగా వివరించింది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా ప్రెసిడెంట్‌ హాన్స్‌ క్రిస్టియన్‌ బార్ట్‌లెస్‌ మాట్లాడుతూ.. ‘విలాసవంతమైన డ్రైవింగ్ అనుభూతిలో ఈకారు ప్రతి క్షణం కొత్త ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.

ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ధర రూ.2.42 కోట్లు
ఎక్స్‌7తో పాటుగా.. బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ సెడాన్‌ కారును ఇక్కడి మార్కెట్లోకి కంపెనీ విడుదలచేసింది. ఈ మోడల్‌లో ధరల శ్రేణి రూ.1.22 కోట్ల నుంచి రూ.1.34 కోట్లుగా ప్రకటించింది. ఇదే సమయంలో.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ 7 సిరీస్‌ సెడాన్‌ కారును ప్రవేశపెట్టింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.1.65 కోట్లు కాగా, డీజిల్‌ ఇండిన్‌ ధర రూ.2.42 కోట్లుగా వెల్లడించింది. 

బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ కారు..!
రానున్నకాలంలో మరో ఐదు ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు హాన్స్‌ క్రిస్టియన్‌ ప్రకటించారు. ఇదే క్రమంలో ఇక్కడి వాతావరణానికి సరిపడే విధంగా ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.



You may be interested

టాటా మోటార్స్‌ నష్టాలు రూ.3,679 కోట్లు

Friday 26th July 2019

8 శాతం తగ్గి రూ.61,467 కోట్లకు ఆదాయం  నాలుగు రెట్లు పెరిగిన వడ్దీ వ్యయాలు  మళ్లీ లాభాల్లోకి వస్తాం  4.5 శాతం నష్టపోయిన టాటా మోటార్స్‌ షేర్‌  న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.1,863 కోట్లుగా ఉన్న నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై రూ.3,680 కోట్లకు పెరిగాయి. చైనాతో పాటు భారత్‌లో కూడా

మెసేజ్‌ పంపినంత సులువుగా నగదు బదలీ..!

Friday 26th July 2019

పూర్తి స్థాయిలో అందుబాటులోకి మెసేజీ పంపినంత సులువుగా నగదు బదిలీ న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ఈ ఏడాది ఆఖరు నాటికల్లా నగదు చెల్లింపుల సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ గ్లోబల్ హెడ్ విల్‌ కాథ్‌కార్ట్‌ వెల్లడించారు. మెసేజి పంపినంత సులువుగా నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. "యూపీఐ ప్రాతిపదికన భారతీయ బ్యాంకులతో కలిసి పేమెంట్స్ వ్యవస్థను రూపొందించాం. దీన్ని సరిగ్గా

Most from this category