News


టాప్‌ స్పీడుమీదున్న ‘ఆల్టో’

Saturday 23rd March 2019
Markets_main1553323040.png-24759

- ఫిబ్రవరిలో బెస్ట్‌ సెల్లింగ్‌ పీవీ ఇదే

న్యూఢిల్లీ: మారుతి సుజుకి ‘ఆల్టో’ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెస్ట్‌ సెల్లింగ్‌ ప్యాసింజర్‌ వాహనం(పీవీ)గా ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌(సియామ్‌)విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 24,751 యూనిట్ల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదేకాలంలో కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా నిలవగా.. ఈసారి ఆస్థానానికి ఆల్టో దూసుకొచ్చింది. డిజైర్‌ 15,915 యూనిట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. 18,224 యూనిట్ల విక్రయాలతో స్విఫ్ట్‌ రెండో స్థానానికి, 17,944 యూనిట్ల అమ్మకాలతో బాలెనో మూడో స్థానానికి చేరాయి. వ్యాగన్‌ఆర్‌ 15,661 యూనిట్లతో 5వ స్థానంలో నిలిచింది. విటారా బ్రెజా 11,613 యూనిట్ల అమ్మకాలతో 6వ స్థానానికి చేరింది. తొలి ఆరు స్థానాల్లో మారుతీ సుజుకి వాహనాలే ఉండగా.. హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ20 ఏడవ స్థానంలోనూ, క్రెటా ఎనిమిదో స్థానంలో, గ్రాండ్‌ ఐ10 తొమ్మిదో స్థానంలో నిలిచాయి. టాటా మోటార్స్‌ టియాగో 10వ స్థానానికి చేరుకుంది.



You may be interested

వృద్ధి వేగం... అయినా 6.8 శాతమే!

Saturday 23rd March 2019

 భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌, ఫిచ్‌ నివేదికలు ప్రపంచంలోనే వేగవంతమైన  వృద్ధి అన్న ఐఎంఎఫ్‌ అయినా.. మందగమనమేనన్న ఫిచ్‌! వాషింగ్టన్‌: ప్రపంచంలోనే భారత్‌ వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది.  అయితే వేగవంతమైన వృద్ధే అయినప్పటికీ, అంత భారీగా ఏమీ లేదని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2019-1920 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఊహించినదానికన్నా బలహీనమైన ఆర్థిక

మార్కెట్లోకి ‘ట్రెండ్‌ ఈ’ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Saturday 23rd March 2019

ధరల శ్రేణి రూ.56,900– రూ.81,269 న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ అవన్‌ మోటార్స్‌.. ‘ట్రెండ్‌ ఈ’ పేరుతో నూతన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్‌ బ్యాటరీ కలిగిన స్కూటర్‌ ధర రూ.56,900 కాగా, డబుల్‌ బ్యాటరీ స్కూటర్‌ ధర రూ.81,269. రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జయ్యే విధమైన లిథియం-అయాన్ బ్యాటరీని ఈ స్కూటర్లలో అమర్చినట్లు తెలిపింది. సింగిల్‌ బ్యాటరీ స్కూటర్‌ గంటలకు 45 నుంచి

Most from this category