News


59 నిమిషాల్లోనే రుణ పథకానికి మెరుగులు

Wednesday 25th September 2019
Markets_main1569389777.png-28534

  • దిగుమతులను తగ్గించేందుకు విధాన రూపకల్పన
  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి కేవలం 59 నిమిషాల్లోనే రుణాలను పంపిణీ చేసే పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంస్‌ఎంఈ) మేలు చేసేందుకు గాను, టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించే విధానాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు. ఢిల్లీలో గురువారం జరిగిన సీఐఐ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రి గడ్కరీ మీడియాతో మాట్లాడారు. దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ విధానంలో టెక్నాలజీ వినియోగంతో దిగుమతులను తగ్గించనున్నట్టు తెలిపారు. ‘‘దీనిని ఆర్థిక శాఖకు పంపిస్తున్నాం. ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నా అభిప్రాయం. దిగుమతి చేసుకునే ప్రధాన సరుకులను స్థానికంగా ఉత్పత్తి చేసే ఎంస్‌ఎంఈలకు నూతన విధానం మద్దతుగా నిలుస్తుంది. దీంతో మనం దిగుమతిదారుగా కాకుండా ఎగుమతిదారుగా మారిపోతాం. ఎంఎస్‌ఎంఈలు మరింత బలోపేతం అవుతాయి’’ అని మంత్రి చెప్పారు. ఎంస్‌ఎంఈలకు 59 నిమిషాల్లోనే రుణం అందించే పథకాన్ని ప్రధాని మోదీ 2018 నవంబర్‌లో ప్రారంభించారు. ఆన్‌లైన్‌ విధానంలో రుణ పంపిణీ జరుగుతుంది. ఆరంభించిన నాలుగు నెలల్లోనే రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగింది. అయితే, 59 నిమిషాల్లోనే రుణ పథకం పట్ల చిన్న సంస్థలు ఆసక్తి చూపించడం లేదని బ్యాంకులు అంటున్నాయి. ఈ పథకం పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పథకాన్ని సమీక్షిస్తున్నట్టు మంత్రి చెప్పడం గమనార్హం. 



You may be interested

ఫోర్బ్స్‌ జాబితాలో 17 ఉత్తమ భారత కంపెనీలు

Wednesday 25th September 2019

3వ స్థానంలో ఇన్ఫోసిస్‌ న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి. ‘వరల్డ్‌ బెస్ట్‌ రిగార్డెడ్‌ కంపెనీస్‌’ పేరిట విడుదల చేసిన తాజా జాబితాలో దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఏకంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోల్చితే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇతర భారత కంపెనీల్లో టాటా స్టీల్ (105వ స్థానం), ఎల్‌

71.07 వద్ద ప్రారంభమైన రూపీ

Wednesday 25th September 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో 6 పైసలు బలహీనపడి 71.07 వద్ద ప్రారంభమైంది. కాగా విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగడంతోపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోవడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 7 పైసలు బలహీనపడి 71.01 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గడం, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలహీనపడడంతో రూపీ పతనం పరిమితమయ్యిందని పీటీటీ పేర్కొంది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ సెప్టెంబర్‌

Most from this category