News


అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి అంచనాలు భారీగా కుదింపు

Wednesday 2nd October 2019
news_main1569991742.png-28666

  • 2019కి 1.2 శాతానికి తగ్గించిన డబ్ల్యూటీవో

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భారీగా కుదించింది. 2019 సంవత్సరానికి 2.6 శాతం ఉంటుందని గత ఏప్రిల్‌లో ఈ సంస్థ అంచనా వేయగా, తాజాగా దీన్ని 1.2 శాతానికి కుదించింది. ఇది భారత్‌కు రుచించని విషయమే. ఎందుకంటే ఎగుమతులను పెంచుకునేందుకు మన దేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం గమనార్హం. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిదానిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు 2019, 2020 సంవత్సరాలకు వాణిజ్య వృద్ధి అంచనాలను కుదించడానికి కారణమని డబ్ల్యూటీవో తెలిపింది. 2020 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య వృద్ధి 2.7 శాతం ఉంటుందని అంచనా వేయడం కాస్త ఉపశమనం కల్పించేదే. గతంలో వేసిన 3 శాతంతో పోలిస్తే కాస్త తగ్గించింది. You may be interested

బ్యాంకింగ్‌ వ్యవస్థ భద్రంగానే ఉంది

Wednesday 2nd October 2019

భయపడాల్సిన అవసరం లేదు: ఆర్‌బీఐ ముంబై: దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితంగా, సుస్థిరంగానే ఉందని, వదంతుల ఆధారంగా భయపడిపోవాల్సిన పని లేదని దేశ ప్రజలకు భరోసానిస్తూ ఆర్‌బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకులో సంక్షోభంతోపాటు బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి ప్రతికూల వార్తలు చలామణీ అవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘కొన్ని బ్యాంకులు, కోపరేటివ్‌ బ్యాంకుల పట్ల వదంతులు చలామణీ అవుతున్నాయి.

రివర్స్‌ గేర్‌లో అటో విక్రయాలు

Wednesday 2nd October 2019

సెప్టెంబర్‌లో భారీ క్షీణత సగానికి తగ్గిన దిగ్గజ కంపెనీల అమ్మకాలు టాటా మోటార్స్‌ అమ్మకాల్లో 50 శాతం తగ్గుదల న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈసారి భారీ తగ్గుదలను నమోదుచేశాయి. సెప్టెంబర్‌లో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. అమ్మకాల డేటాను చూసి.. ఈ రంగంలోని మార్కెట్‌ లీడర్లు సైతం కంగుతింటోన్న పరిస్థితి నెలకొంది. ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాల్లో దిగ్గజ

Most from this category