News


మందగమన భయాలు ముగిసినట్లే!

Monday 1st July 2019
news_main1561975104.png-26719

జేపీ మోర్గాన్‌ 
గత కొన్ని నెలలుగా ప్రపంచ ఎకానమీలన్నీ మందగమన భయాలను చవిచూశాయని, కానీ ఇకపై మందగమన భయం గత చరిత్రగా మారుతుందని జేపీ మోర్గాన్‌ సీనియర్‌ ఎకనమిస్టు జేమ్స్‌ గ్లాస్‌మన్‌ చెప్పారు. ఎకానమీలు మాంద్య భయాల నుంచి కోలుకుంటున్నాయన్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ద్వితీయార్ధంలో మంచి ప్రదర్శన చూపగలదని అంచనా వేశారు. యూఎస్‌, చైనా ట్రేడ్‌ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, మానిటరీ పాలసీ మరింత సడలించడంతో మార్కెట్లు గాడిన పడతాయన్నారు. భారత మార్కెట్‌పై తాను బాగా ఆశావహంగా ఉన్నానన్నారు. చైనా కరెన్సీ కారణంగా వర్దమాన మార్కెట్లు ముందుకు కదిలేందుకు మొరాయిస్తున్నాయని, ఒక్కసారి చైనా కరెన్సీ స్థిరపడితే ఈ మార్కెట్లు ముందంజ వేస్తాయని తెలిపారు. ట్రంప్‌, గ్జీజింగ్‌పింగ్‌ మధ్య చర్చలు జరగడం ఇరుపక్షాల సుముఖతకు నిదర్శనమన్నారు. అయితే ఇప్పటికిప్పుడు వెంటనే ట్రేడ్‌ వార్‌కు శాశ్వత పరిష్కారం దొరకదని, ఇందుకు సమయం పడుతుందని తెలిపారు. కానీ లీడర్ల మాటలు మాత్రం పాజిటివ్‌గా ఉన్నాయని చెప్పారు. చమురు ధరలు 60-65 డాలర్ల మధ్య తిరిగినంత కాలం ఇండియాకు పెద్ద సమస్య ఉండదన్నారు. చమురు ధరలను స్థిరీకరించేందుకు రష్యా, సౌదీలు ఉత్పత్తికోతల కొనసాగింపునకు నిర్ణయించుకున్నాయని ఆయన తెలిపారు. 



You may be interested

రాణిస్తున్న రియల్టీ షేర్లు

Monday 1st July 2019

లాభాల మార్కెట్లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ సోమవారం 2శాతం ర్యాలీ చేసింది. బడ్జెట్‌ రియల్టీ రంగానికి అనుకూలంగా ఉండవచ్చనే ఆశావహంతో వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ రంగ షేర్లు లాభాల బాటపట్టాయి. ఈ రంగంలో ప్రధాన షేర్లైన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఒబేరాయ్‌ రియల్టీ ఇండెక్స్‌ షేర్లు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.2100 కోట్ల సమీకరణ ప్రక్రియను పూర్తి

తయారి రంగంలో వృద్ధి అంతంతే

Monday 1st July 2019

ఆర్డర్లు, ఉత్పత్తి, ఉద్యోగాలలో వృద్ధి  కానీ దేశియంగా, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్‌ : పీఎమ్‌ఐ      ఆర్డర్లు, ఉత్పత్తి, ఉద్యోగాలలో వృద్ధి  ఉన్నప్పటికి భారత తయారిరంగ వృద్ధి జూన్‌ నెలలో అంతంత మాత్రంగానే నమోదయ్యింది. ఒక అంతర్జాతీయ సంస్థ సోమవారం విడుదల చేసిన పర్చేజింగ్‌ మానేజర్‌ ఇండెక్స్‌(పీఎంఐ) ప్రకారం తయారి రంగం పీఎంఐ జూన్‌ నెలలో 52.1 పాయింట్లగా ఉంది. కానీ మే లో నమోదు చేసిన 52.7 పాయింట్ల కంటే ఇది తక్కువ.

Most from this category