News


బ్రెగ్జిట్‌ డీల్‌పై నేడు పార్లమెంట్‌లో ఓటింగ్‌

Saturday 19th October 2019
news_main1571479619.png-29009

  గత రెండెళ్లుగా బ్రిటన్‌ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేసిన బ్రెగ్జిట్‌ (బ్రిటన్‌ ఎగ్జిట్‌...యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) డీల్‌పై ..నేడు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఓటింగ్‌ జరగనున్నది.  ఇందుకు సంబంధించిన పార్లమెంటు సమావేశాలు భారత్‌ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాయి. ఓటింగ్‌ ఫలితంగా సాయంత్రం 6.30 గంటల తర్వాత వెలువడవచ్చన్నది అంచనా. 1982 తర్వాత మొదటి సారిగా హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌ శనివారం నాడు సమావేశం కానుంది. ఈయూ(యురోపియన్‌ యూనియన్‌), బ్రిటన్‌ మధ్య గురువారం బ్రెగ్జిట్‌ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం పార్లమెంట్‌ ఆమోదం పొంది, ఈ నెలైనా బ్రిటన్‌, ఈయూ నుంచి బయటకొచ్చేందుకు సహాయపడుతుందా? లేదా బ్రిటన్‌ కొత్తగా అనిశ్చితిలో చిక్కుకోడానికి కారణమవుతుందా? అనేది వేచి చూడాలి.
  ప్రతిపక్ష పార్టీలు, బోరిష్‌ జాన్సన్ సొంత నార్తర్న్ ఐరిష్ మిత్రదేశాలు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికి, ప్రధానమంత్రి, ఆయన అనుచరులు గత 48 గంటల పాటు ఎంపీల మద్దతును కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. రాజకీయంగా గందరళగోళంలో పడేసిన  బ్రెగ్జిట్‌ నుంచి బయటపడడానికి తన ఒప్పందం చాలా ఉత్తమమైనదని జాన్సన్‌ తెలిపారు. ‘నేను తీసుకొచ్చిన ఒప్పందం కంటే మంచి ఒప్పందం ఇంకొకటి లేదు’ అని శుక్రవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు.  ‘ఇది యుకేకు అద్భుతమైన ఒప్పందం’ అని అభిప్రాయపడ్డారు. ఒప్పం‍దాన్ని కాపాడుకోవడం, బోరిష్‌ జాన్సన్‌ వ్యక్తిగత విజయంగా చెప్పవచ్చు. కానీ పార్లమెంట్‌లానే, బ్రిటన్‌ ప్రజలు కూడా 46 ఏళ్లుగా కలిసివున్న ఇతర యురోపియన్‌ దేశాల నుంచి ఏ విధంగా వేరుపడతామని ఆలోచిస్తున్నారు. కాగా ఈ పార్లమెంట్‌లో ‘బ్రెగ్జిట్‌ను వెనక్కి తీసుకోవాలి’ అనే ఆప్షన్‌ను అందుబాటులో ఉంచి ‘ప్రజల ఓటు’ కోసం డిమాండ్‌ చేసే అవకాశం ఉంది.  ఒక వేళ ఒప్పందం ఆమోదం పొందకపోతే బ్రెగ్జిట్‌ కాల పరిమితిని పెంచమని ఈయూ నాయకులను జాన్సన్‌ కోరే అవకాశం ఉంది. ఈ అక్టోబర్‌ 31తో బ్రెగ్జిట్‌ జరగాల్సివుంది. అయితే 2020 జనవరి వరకూ పొడిగింపుకోరే విధంగా గత సెప్టెంబర్‌లోనే బ్రిటన్‌ పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది. 
  బ్రిటన్‌ మాజీ ప్రధాని థెరిస్సా మే బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని పార్లమెంట్లో ఆమోదించుకోవడంలో విఫలమయ్యారు. ఆమె తర్వాత బోరిష్‌ జాన్సన్‌ ప్రధానిగా బాధ్యతల తీసుకున్నారు. ఈ నెల చివరినాటికి బ్రెగ్జిట్‌ పూర్తవుతుందని, ఆర్థిక, రాజకీయలపై ఉన్న అనిశ్చితికి కూడా ముగింపు వస్తుందని జాన్సన్‌ అభిప్రాయపడ్డారు. ‘ఎటువంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బయటపడాలనే’ జాన్సన్‌ హెచ్చరికను వ్యతిరేకించిన 21 మంది తన స్వంత కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలను ఆయన బహిష్కరించారు. దీంతో ఆయన రాజకీయ పరిస్థితి, థెరిస్సా మే రాజకీయ పరిస్థితుల కంటే క్లిష్టంగా మారింది. వ్యాపారస్తులు, మార్కెట్లు హార్డ్‌ ఎగ్జిట్‌ ( ఈయూతో ఎటువంటి ఒప్పందం లేకుండా వైదొలగడం) జరుగుతుందని భయపడుతున్నారు. దీనిని తప్పించుకోడానికి ఈయూ నాయకులు బ్రెగ్జిట్‌ కాలవ్యవధిని ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే. 
    బ్రిటిష్‌ ప్రావిన్స్‌ కోసం ఏర్పాట్లు జరగుతుండడంతో , జాన్సన్  మైనారిటీ ప్రభుత్వానికి మద్ధతుగావున్న ఉత్తర ఐర్లాండ్ డెమోక్రటిక్ యూనియన్ పార్టీ ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. వీరితో పాటు ఈ సమయంలో బ్రెగ్జిట్ జరిగితే బ్రిటన్‌కు ఈయూకు మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఇది బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతియ్యడంతో పాటు పర్యావరణ, కార్మిక ప్రమాణాలను తగ్గిస్తుందని ప్రధాన ప్రతిపక్ష లేబర్ పార్టీ పేర్కొంది. దీంతో ఈ పార్టీ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. 
    ఈ ఒప్పందానికి  బ్రిటీష్‌ నాయకులు  మద్దతివ్వాలని, ఇరు వర్గాల మధ్య భవిష్యత్‌ సంబంధాలు ముందుకు వెళ్లేలాగా చర్చలు జరగాలని, ఈ వారం బ్రస్సెల్‌లో జరిగిన సమావేశంలో ఈయూ లీడర్లు బ్రిటీష్‌ నాయకులను కోరారు. ‘ఈ ఒప్పందం జరిగితే ఎలాంటి పొడిగింపు అవసరం లేదు’ అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జుంకర్ అన్నారు. ఈ డీల్‌ ఆమోదం పొందకపోతే తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తెలిపారు. ఈయూ పౌరుల హక్కులను రక్షించడానికి, బ్రిటన్‌ ఆర్థిక పరిష్కారాలకు, బ్రెగ్జిట్‌ అనంతరం ఈయూకు, బ్రిటన్‌కు మధ్య కొత్త వాణిజ్య అవకాశాలకు అనుగుణంగా ఈ ఒప్పందం ఉంది. కాగా ఈయూ సభ్య దేశమయిన ఐర్లాండ్‌కు బ్రిటన్‌ ఉత్తర ఐర్లాండ్‌ మధ్య సరిహద్దును తెరిచే ఉంచాలనే అంశం తీవ్ర వివాదస్పదంగా మారింది. 



You may be interested

క్వాలిటీ స్టాకులు.. కనిపెట్టడమే కష్టం!

Saturday 19th October 2019

రామ్‌దేవ్‌ అగర్వాల్‌ ప్రతిఒక్కరూ మార్కెట్లో నాణ్యమైన స్టాకుల్లో పెట్టుబడులు పెట్టాలని సలహా ఇస్తుంటారు. అయితే నాణ్యమైనవి అనుకున్న చాలా షేర్లు చాలా సందర్భాల్లో ఇన్వెస్టర్ల చేతులు కాల్చిన సంఘటనలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఇన్వెస్టర్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘నాణ్యత అంటే ఎంటో మార్కెట్లో అందరికీ నిర్వచనం తెలిసిపోయింది, కానీ కేవలం నాణ్యమైన స్టాకులను ఎంచుకొని పోర్టుఫోలియో నిర్మించడమే అసలు సవాలు.’’ అని అగర్వాల్‌ వ్యాఖ్యానించారు. చాలా సార్లు

ఎర్నింగ్స్‌ వేళ ఏంచేయాలి?

Saturday 19th October 2019

మార్కెట్‌ నిపుణుల సలహాలు కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు కంపెనీలు మిశ్రమ ఫలితాలు ప్రకటించాయి. ఈనేపథ్యంలో ఫలితాల సీజన్‌లో మార్కెట్‌లో ఎలా ప్రవర్తించాలో నిపుణులు సలహా ఇస్తున్నారు. ఫలితాలకు ముందు అంచనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దని, త్రైమాసిక ఫలితాలు స్వల్పకాలిక ట్రెండ్‌ను మాత్రమే ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.  - మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టరైతే ఫలితాలకు ముందు ఒకస్టాకులో ప్రవేశించకుండా ఉండడం మంచిది. ఎర్నింగ్స్‌ ఎలా ఉంటాయో తెలియదు

Most from this category