News


ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలు!

Tuesday 20th August 2019
news_main1566279449.png-27888

విస్తరిస్తున్న ఈక్విటీ, బాండ్‌ఈల్డ్స్‌ అంతరాలు
ప్రపంచంలోని ధనిక దేశాల్లో బాండ్‌ ఈల్డ్స్‌ అంతరం విస్తరిస్తున్న క్రమం ఆందోళన కలిగిస్తోందని ఎకనమిస్టులు చెబుతున్నారు. త్వరలో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఈక్విటీలు అల్లకల్లోలమవుతాయని హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో పూర్తి మాంద్యం వచ్చేందుకు అవకాశాలు మూడింట ఒకవంతుకు పెరిగాయని, గతేడాదితో పోలిస్తే మాంద్య భయాలు ఐదు రెట్లు అధికమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బాండ్స్‌ రాబడులకు, స్టాక్స్‌ రాబడులకు మధ్య అంతరం అస్థిర స్థాయిలకు చేరింది. ఇది మార్కెట్లలో తప్పని పతనాన్ని సూచిస్తోంది. ఎర్నింగ్స్‌ అనూహ్యంగా మెరుగుపడితే తప్ప స్టాక్స్‌ నుంచి ఇన్వెస్టర్లు వైదొలగి సురక్షిత సాధనాల వైపు మరలడం తప్పదని ఎక్కువమంది అంచనా.

ప్రస్తుతం దాదాపు 16 లక్షల కోట్ల డాలర్ల గ్లోబల్‌ బాండ్‌ ఈల్డ్స్‌ నెగిటివ్‌గా ఉన్నాయి. యూఎస్‌, యూకే కాకుండా యూరప్‌లోని ధనిక దేశాలు, జపాన్‌ దేశ బాండ్స్‌  నెగిటివ్‌ రిటర్న్స్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. ఇదే సమయంలో పలు దేశాల ఈక్విటీలు పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఈ దేశాల్లో పదేళ్ల బాండ్స్‌ ఈల్డ్‌కు, స్టాక్‌ డివిడెండ్‌ ఈల్డ్‌కు మధ్య వ్యత్యాసాలు విస్తరిస్తున్నాయి. ఇదే కొనసాగితే క్రమంగా ఈక్విటీల్లో క్రాష్‌ తప్పకపోవచ్చని అనలిస్టుల విశ్లేషణ. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌ క్యాప్‌ 76 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రస్తుతం పలు దేశాల కేంద్ర బ్యాంకులు సడలీకరణ విధానాలు పాటిస్తున్నందున మరికొంత మేర ఈక్విటీలకు లిక్విడిటీ అందవచ్చు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం ఆరంభమైతే మాత్రం ఈక్విటీలు గట్టి దెబ్బతినవచ్చు. ఇటీవలే యూఎస్‌లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక బాండ్‌ ఈల్డ్స్‌ మధ్య వ్యత్యాసం నెగిటివ్‌గా మారింది. ఇలాంటి ఈల్డ్‌ ఇన్వర్షన్‌ను మాంద్యానికి తప్పనిసరి సూచికగా భావిస్తారు. వచ్చే ఏడాదిలో మాంద్యం వచ్చే ఛాన్సులు 31 శాతానికి పెరిగాయని న్యూయార్క్‌ ఫెడ్‌ అంచనా వేస్తోంది. 



You may be interested

నిరాశపరిచిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ షేర్ల లిస్టింగ్‌

Tuesday 20th August 2019

10శాతం డిస్కౌంట్‌తో లిస్టింగ్‌  రెండువారాల కిందట ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ షేర్ల లిస్టింగ్‌  నిరాశపరించింది. ఇటీవల మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ఐపీఓకు అనుకున్నంత స్థాయిలో సబ్‌స్క్రైబ్‌ కాకపోవడం లిస్టింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా మంగళవారం బీఎస్‌ఈలో ఐపీఓ ఇష్యూ ధర(రూ.780.00)తో పోలిస్తే షేర్లు 10.50శాతం డిస్కౌంట్‌తో రూ.700.00 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఇంట్రాడేలో ఒకదశలో 11.50శాతం వరకు పతనమైన

తగ్గిన చమురు ధరలు

Tuesday 20th August 2019

ముడి చమురు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతోంది. కానీ యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో ఈ నష్టాలు పరిమితంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రెంట్‌ క్రూడ్‌ మంగళవారం 0.05 శాతం తగ్గి బ్యారెల్‌ 59.71 డాలర్లకు చేరుకుంది. కాగా గత సెషన్లో బ్రెంట్‌ క్రూడ్‌ 1.88 శాతం పెరిగింది. అదే విధంగా గత సెషన్లో 2.44 శాతం లాభపడిన డబ్యూటీఐ క్రూడ్‌ మంగళవారం 0.3 శాతం తగ్గి

Most from this category