News


క్రూడాయిల్‌ ర్యాలీ కొనసాగదు!

Saturday 13th July 2019
news_main1563022988.png-27049

తాత్కాలిక పరిస్థితుల వల్ల తాజా పెరుగుదల 
దీర్ఘకాలానికి డౌన్‌ట్రెండే
అంతర్జాతీయ నిపుణుల అంచనా
చమురు మార్కెట్లో ప్రస్తుతం అప్‌మూవ్‌ కనిపిస్తోంది. గల్ఫ్‌ ఉద్రిక్తతలు, వెనుజులా, ఇరాన్‌ పరిణామాలు, ఒపెక్‌ ఉత్పత్తి కోతలు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఇతర దేశాల్లో ఉత్పత్తి క్షీణించడం.. లాంటివి చమురు డిమాండ్‌ను పెంచుతున్నాయి. అయితే ఈ అప్‌మూవ్‌కు జీవం చాలా తక్కువని, ర్యాలీ మరింత కాలం కొనసాగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ర్యాలీలో బ్రెంట్‌ మరోమారు 70 డాలర్లను దాటవచ్చని ఎస్‌అండ్‌ పీ అంచనా వేసింది. అయితే  ప్రస్తుత ధర పెరుగుదలకు కారణాలన్నీ స్వల్పకాలికమైనవేనని, ఈ కారణాలు సమసిపోతే చమురు డిమాండ్‌ మందగిస్తుందని నిపుణుల భావన.

చమరు ర్యాలీ సమసిపోయేందుకు పలు కీలక కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు...

= అమెరికా షెల్‌ ఉత్పత్తి నానాటికీ పెరిగిపోతోంది. దీనివల్ల డిమాండ్‌ పెరిగేంతవరకు ఒపెక్‌ ఉత్పత్తి కోతలను కొనసాగిస్తూ పోకతప్పదు. అయితే ఇందుకు ఒపెక్‌ దేశాలతో పాటు, రష్యా ఎంతవరకు అంగీకరిస్తాయో తెలియదు. ఒకవేళ రష్యా అంగీకరించకపోతే ఒపెక్‌ కోతల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
= చమురు డిమాండ్‌ ఈ ఏడాది  రోజుకు 11.4 కోట్ల బ్యారెళ్లు ఉంటుందని, ఇదే సమయంలో కేవలం ఒపెక్‌ ఏతర దేశాల చమురు ఉత్పత్తే రోజుకు 20.5 కోట్ల పీపాలకు చేరుతుందని ఒపెక్‌ తాజా సమావేశంలో పేర్కొంది. వచ్చే ఏడాది డిమాండ్‌ పెరగకపోయినా సప్లై మరింత ఉధృతమవుతుందని తెలిపింది. ఇందువల్ల ఒపెక్‌ దేశాలు మరింత కాలం ఉత్పత్తి కోతలను కొనసాగించాల్సిరావచ్చు.
= ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కొత్త పైప్‌లైన్లు ఏర్పాటవుతున్నాయి. కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. వీటివల్ల సరఫరా ఇబ్బందులు మరింత తగ్గిపోతాయి. దీంతో ధరలపై నెగిటివ్‌ ‍ప్రభావం ఉంటుంది. 
= ప్రపంచ ఎకానమీల్లో వ్యాపిస్తున్న మందగమనం త్వరలో సమసిపోయేలా కనిపించడం లేదు. ఎకానమీలపై ట్రేడ్‌వార్‌ ప్రభావం చాలా పెద్దగా ఉంటోంది. దీంతో కమోడిటీల ధరలు మరింత పతనమయ్యే ఛాన్సులున్నాయి.


ఈ కారణాల వల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది వరకు చమురు ధరల్లో పెద్దగా పెరుగుదల ఉండే అవకాశాలు కనిపించడం లేదని నిపుణుల భావన. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 66.72 డాలర్ల వద్ద ముగిసింది. గతవారంతో పోలిస్తే ఇది దాదాపు 4 శాతం అధికం.



You may be interested

మార్కెట్లు ఎటు...? ఇన్వెస్టర్ల మార్గం ఎటు?

Sunday 14th July 2019

అంతర్జాతీయంగా బలహీన వాతావరణం నడుమ కేంద్ర బడ్జెట్‌ ఆశించిన విధంగా లేకపోవడం, చైనా గణాంకాలు బలహీనంగా ఉండడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురికొల్పడంతో, గత వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బేర్స్‌ దెబ్బకు బుల్స్‌ వణికిపోయాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా రెండో వారంలో 1.97 శాతం, 2.18 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ల గమనం ఏ విధంగా ఉండనున్నది, ఇన్వెస్టర్లు అనుసరించతగిన విధానంపై మార్కెట్‌ నిపుణుల

బడ్జెట్‌ తెచ్చిన భయం కొనసాగేనా?

Saturday 13th July 2019

మార్కెట్‌ విశ్లేషణ దేశీయ మార్కెట్‌ ఈ వారాన్ని తీవ్ర నిరుత్సాహంతో ముగించింది. వారం ఆరంభంలో ఇటీవల కాలంలో అతిపెద్ద ఒకరోజు పతనం నమోదు చేసింది. కేంద్ర బడ్జెట్‌ మార్కెట్‌లో నిరాశ నింపిందని, అందువల్లే మార్కెట్లు తిరోగమనం చెందాయని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. అయితే అధిక వాల్యూషన్లే ఈ పతనానికి అసలు కారణమని, వాల్యూషన్ల కారణ కరెక‌్షన్‌కు బడ్జెట్‌ ఒక ప్రోత్సాహకంగా పనిచేసిందని సామ్‌కో సెక్యూరిటీస్‌ ప్రతినిధి జిమిత్‌ మోదీ చెప్పారు. ప్రస్తుతం

Most from this category