News


నేటి నుంచే దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు

Monday 20th January 2020
news_main1579489149.png-31033

  • పాల్గొననున్న 100కు పైగా భారత సీఈవోలు

దావోస్‌: నటి దీపిక పదుకునే, సద్గురు జగ్గీ వాస్‌దేవ్‌, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమారమంగళం బిర్లా, రాహుల్‌ బజాజ్‌, సంజీవ్‌ బజాజ్‌, ఎన్‌ చంద్రశేఖరన్‌, ఆనంద్‌ మహీంద్రా, సునీల్‌ మిట్టల్‌, నందన్‌ నీలేకని, అజయ్‌ పిరమల్‌ సహా 100కు పైగా భారత సీఈవోలు సోమవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, బ్రిటన్‌ ప్రిన్స్‌ చార్లెస్‌, జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ తదితర దేశాధినేతలు కూడా హాజరవుతున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆదాయ అసమానతలు, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ వైపరీత్యాల విషయంలో దేశాల భిన్న ధోరణులు తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. వ్యాపారాలు తమ వాటాదారులకే కాకుండా, సామాజిక ప్రయోజనాల కోసం కూడా పనిచేయాలన్న విధానాన్ని 1973 నాటి దావోస్‌ మేనిఫెస్టో పేర్కొనగా, దీని ప్రగతిపై ఈ సదస్సులో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రానున్న దశాబ్దంలో లక్ష కోట్ల మొక్కలను నాటాలని, నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం 100 కోట్ల మందికి అవసరమైన నైపుణ్యాలు కల్పించాలన్నది సదస్సు లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సదస్సులో మానసిక ఆరోగ్యంపై నటి దీపిక పదుకొణె ప్రసంగం ఇవ్వనున్నారు. సగ్గురు ప్రాణాయామ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 
జీరో ఎమిషన్స్‌ లక్ష్యానికి కట్టుబడాలి...
2050 లేదా అంతకుముందుగానే కార్బన్‌ ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించేందుకు(జీరో కార్బన్‌ ఎమిషన్స్‌) సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాస్‌ష్వాబ్‌ కోరారు. ఇందుకోసం నిర్మాణాత్మక చర్యలను ఆచరణలో పెట్టాలని కోరుతూ సభ్య దేశాలను ఓ లేఖ రూపంలో ఆయన కోరారు. కాగా, ప్రకృతిపై వ్యాపార ధోరణి పెరిగిపోతున్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక పేర్కొంది. ప్రకృతిపై పెట్టుబడులు 44 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటాయని, ప్రపంచ జీడీపీలో ఇది సగానికి సమానమని వార్షిక సదస్సుకు ముందుగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూటీఎఫ్‌ తెలిపింది. చైనా, ఈయూ, అమెరికాలు ప్రకృతిపై ఎక్కువ పెట్టుబడులను కలిగిన దేశాలుగా ప్రస్తావించింది. You may be interested

వేలంలో ఇల్లు.. కొనేటప్పుడు బీ కేర్‌ఫుల్లు!!

Monday 20th January 2020

ఆదరాబాదరాగా కొని సమస్యల పాలు కావద్దు.. ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడం కీలకం బ్యాంకులపై ఆ బాధ్యత ఉండదు ఉన్నది ఉన్నట్టుగానే అనే షరతుతో వేలం సమస్యలు ఎదురైతే కొనుగోలుదారునిదే బాధ్యత అన్ని షరతులు, నిబంధనలను ముందే తెలుసుకోవాలి న్యాయ నిపుణుల సూచనల మేరకు నడచుకోవాలి కారు చౌకగా వస్తుందనో... ఎవరో చెప్పారనో... మంచి ఏరియాలో ఉందనో ఇలా కారణాలేవైతేనేం బ్యాంకులు వేలం వేసే ఇళ్లవైపు మొగ్గుచూపేవారు చాలామందే ఉంటారు. అయితే, ఇలా కొనేటప్పుడు నిబంధనలు... చట్టపరమైన అంశాలన్నింటినీ కూలంకషంగా

బడ్జెట్‌ పరిభాషకు 'అర్థ్‌శాస్త్రి'

Monday 20th January 2020

సోషల్ మీడియాలో ప్రచారానికి కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: బడ్జెట్‌ పరిభాషపై సామాన్యులు, విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. జనవరి 22 నుంచి సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనుంది. '#అర్థ్‌శాస్త్రి' (#ArthShastri) పేరిట నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో.. పలు సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను ఆసక్తికరమైన యానిమేటెడ్ వీడియోల రూపంలో వివరించనుంది. బడ్జెట్ ప్రక్రియ గురించి సరళమైన విధానంలో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని అధికారవర్గాలు తెలిపాయి.

Most from this category