News


కోలుకున్న యూఎస్‌ మార్కెట్!

Saturday 11th May 2019
news_main1557574281.png-25688

ట్రంప్‌ ట్రేడ్‌ దెబ్బకు కకావికలమైన అమెరికా స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కాస్త కోలుకుంది. నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ చెప్పి లాభాల్లో ముగిసింది. చైనాతో వాణిజ్య చర్చలు నిర్మాణాత్మకంగా జరుగుతున్నాయని యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్యుచిన్‌, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో ఒకదశలో 1.5 శాతం మేర పతనమైన సూచీలు క్రమంగా కోలుకొన్నాయి. అయితే తాజా చర్చల అనంతరం కొత్త చర్చలకు ఎలాంటి ప్రణాళిక అనుకోలేదన్న మ్యుచిన్‌ మాటలతో గరిష్ఠాల నుంచి దిగివచ్చి చివరకు సుమారు అర శాతం లాభంలో ముగిశాయి. శుక్రవారం ఆఖరుకు ఎస్‌అండ్‌పీ500, 10.68 పాయింట్ల లాభంతో, డౌజోన్స్‌ 114 పాయింట్ల లాభంతో ముగిశాయి. వారం మొత్తానికి డౌ 2.12 శాతం, ఎస్‌అండ్‌పీ 2.17 శాతం, నాస్‌డాక్‌ 3 శాతం నష్టపోయాయి. చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతామన్న ట్రంప్‌ ప్రకటనతో ఈ వారం ఆరంభం నుంచి సూచీలు నేల చూపులు ఆరంభించాయి. శుక్రవారం ట్రంప్‌ పంతం నెగ్గించుకున్నారు. తాను ప్రకటించిన టారిఫ్‌ పెంపును అమల్లోకి తెచ్చారు. దీంతో మందగమన భయాలతో ఉన్న ప్రపంచ ఎకానమీ మరింత కుంగిపోతుందన్న భయాలు పెరిగి ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతనమయ్యాయి. చైనాను చక్రబంధం చేసి తనకనుకూల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్‌ అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం చివరకు ఎలా ముగుస్తుందోనని మార్కెట్‌ నిపుణులు ఎదురుచూస్తున్నారు. You may be interested

బంగారంపై బుల్లిష్‌!

Saturday 11th May 2019

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్యయుద్ధం సమసేలా కనిపించడం లేదు. దీంతో మదుపరులు క్రమంగా రిస్కు ఎక్కువున్న అసెట్స్‌ నుంచి రిస్కు తక్కువుండే బంగారం లాంటి ఆస్తుల వైపు మరలుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో రికవరీ ఆరంభమైంది. మరోవైపు యూఎస్‌ వాణిజ్యలోటు మార్చిలో స్వల్పంగా పెరిగింది. యూఎస్‌ దిగుమతుల్లో 1.1 శాతం పెరుగుదల ట్రేడ్‌లోటుకు కారణమయింది. ఇంకోవైపు యూరోపియన్‌ కమీషన్‌ తన వృద్ధి అంచనాలను తగ్గించింది. జర్మనీ ప్రగతి అంచనాలను

ఐదు సెషన్‌లో రూ.లక్షకోట్ల ఆవిరి

Saturday 11th May 2019

ముంబై : ప్రైవేట్‌ రంగ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఐదు సెషన్లలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటిలైజేషన్‌ తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్లో నెలకొన్న అస్థిరతకు తోడు, ఇటీవల కంపెనీ షేరుకు ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బేరిష్‌’’ రేటింగ్‌ కేటాయింపు ఇందుకు కారణమైంది. రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హరించుకోవడంతో ‘‘అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కలిగిన కంపెనీ’’ అనే పేరును కోల్పోయింది. ఇప్పుడు ఈ స్థానాన్ని ఐటీ సేవల దిగ్గజ కంపెనీ

Most from this category