News


వాల్‌స్ట్రీట్‌పై మెక్సికో పిడుగు!

Saturday 1st June 2019
news_main1559381879.png-26043

భారీగా పతనమైన యూఎస్‌ సూచీలు
శుక్రవారం యూఎస్‌ సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఎస్‌అండ్‌పీ 500 దశాబ్ద కాలంలో అధ్వాన్న నెలవారీ క్లోజింగ్‌ నమోదు చేసింది. మెక్సికోపై అనూహ్య టారిఫ్‌లను ట్రంప్‌ ప్రకటించడం మార్కెట్లో భయాన్ని రేకెత్తించింది. ట్రంప్‌ వైఖరి బహుముఖ వాణిజ్య యుద్ధాన్ని తీసుకువస్తుందని, దీంతో ఎకానమీలు మాంద్యంలోకి జారడం ఖాయమని మార్కెట్లు బెదిరిపోయాయి. జూన్‌నుంచి మెక్సికో దిగుమతులపై 5 శాతం టారిఫ్‌ వర్తిస్తుందని, ఈ మొత్తాన్ని క్రమంగా 25 శాతం వరకు పెంచుతామని, అక్రమ వలసలను మెక్సికో అరికట్టేవరకు ఇదే వైఖరి కొనసాగిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మెక్సికో ప్రెసిడెంట్‌ ఆండ్రస్‌ మాన్యుల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ యూఎస్‌ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు చైనాతో వాణిజ్య చర్చలు పెద్దగా పురోగతి సాధించలేకపోవడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకిత్తించింది. దీంతో పలువురు తమ పెట్టుబడులను బాండ్లవైపు మరలించారు. మేనెల్లో యూఎస్‌ సూచీల్లోని టెక్‌, ఎనర్జీ కంపెనీల షేర్లు భారీగా కుదేలయ్యాయి. బాండ్‌ చార్టుల్లో ఇన్వర్టెడ్‌ కర్వ్‌ మరింత గాఢంగా ఏర్పడింది. వచ్చే ఒకటి రెండేళ్లలో మాంద్యం తప్పదనేందుకు ఈ ఇన్వర్టెడ్‌ కర్వ్‌ నిదర్శనంగా కొందరు నిపుణులు భావిస్తున్నారు. యూఎస్‌ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా తాము ‘‘నమ్మదగినవి కాని’’ కొన్ని విదేశీ కంపెనీల పేర్లు ప్రకటిస్తామని బీజింగ్‌ హెచ్చరించింది. ఈ ప్రకటన ప్రభావం కూడా సూచీలను కుంగదీసింది. వాణిజ్య యుద్ధ ప్రభావం యూఎస్‌ ఎకానమీపై క్రమంగా కనిపిస్తోందని తాజాగా విడుదలైన స్థూల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో త్వరలో మాంద్యం గ్యారెంటీ అని భావించిన మదుపరులు అమ్మకాలకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డౌజోన్స్‌ సూచీ కీలక 25000 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. You may be interested

ఇన్వెస్ట్‌మెంట్‌కు తొందరగా ఉందా?

Saturday 1st June 2019

ఈ మూడు సూత్రాలు పాటించండి ఎన్నికలయి సుస్థిర ప్రభుత్వం రావడంతో ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న మదుపరులు పెట్టుబడులకు ఉత్సాహపడుతున్నారు. కొత్త ‍ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎకానమీ పరుగులు తీస్తుందన్న అంచనాలతో అటు ఈక్విటీల్లో, ఇటు ఇతర సాధనాల్లో పెట్టుబడులకు తొందరపడుతున్నారు. అయితే హడావుడి నిర్ణయాలు తీసుకుంటే అనర్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈక్విటీలతో సహా ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేముందు మూడు విషయాలను మనసులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. 1. ఎమోషన్స్‌ కంట్రోల్‌: భావోద్వేగాల ఆధారంగా పెట్టుబడి

ఉపశమన చర్యలు రికవరీ తెస్తాయా?

Saturday 1st June 2019

భారత జీడీపీ గత ఆర్థిక సంవత్సరం క్యు4లో ఐదేళ్ల కనిష్ఠాలకు పడిపోయింది. నిపుణులంతా జీడీపీ 6.3 శాతం వరకు ఉంటుందని అంచనా వేయగా కేవలం 5.8 శాతానికే పరిమితమై అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం సంవత్సరానికి సైతం జీడీపీ అంచనాల కన్నా తక్కువగా 6.8 శాతంగా నమోదయింది. 2018-19లో జీడీపీ 7.0 శాతం ఉంటుందని సీఎస్‌ఓ, 7.2 శాతం ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా జీడీపీ

Most from this category