News


టెస్లా.. వాల్‌స్ట్రీట్‌ నయా బుల్‌!

Thursday 20th February 2020
news_main1582176600.png-31955

రెండు నెలల్లో దాదాపు 100 శాతం ర్యాలీ
వెయ్యిడాలర్లకు చేరుతుందని నిపుణుల అంచనాలు
17000 కోట్ల డాలర్లకు చేరువలో మార్కెట్‌ క్యాప్‌
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా యూఎస్‌ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా టెస్లా షేరు బుధవారం రికార్డు ర్యాలీ జరిపి నూతన గరిష్ఠాలను తాకింది. మంగళవారం 858.40 డాలర్ల వద్ద ముగిసిన టెస్లా షేరు బుధవారం 923.50 డాలర్ల వద్ద ఆరంభమై 944.78 డాలర్ల ఆల్‌టైమ్‌హైని తాకింది. చివరకు 6.88 శాతం లాభంతో 917.42 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో ముగింపు ధర వద్ద కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 16854 కోట్ల డాలర్లుగా నమోదయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటికి షేరు ధర దాదాపు రెట్టింపయింది. 2019లో షేరు దాదాపు 30 శాతం ర్యాలీ జరిపింది. షేరుపై ప్రముఖ అనలిస్టు పైపర్‌ సాండ్లర్‌ బుల్లిష్‌ అంచనా వెలిబుచ్చి టార్గెట్‌ధరను 928 డాలర్లుగా ప్రకటించడంతో బుధవారం షేరు కౌంటర్లో జోరు పెరిగింది. సాండ్లర్‌ ప్రకటించిన ఏడాది టార్గెట్‌ను షేరు బుధవారం ఒక్కరోజులోనే అధిగమించింది. నాస్‌డాక్‌లో టెస్లాకు దాదాపు 1.9 శాతం వెయిటేజ్‌ ఉంది. 

షేరు బంపర్‌ ర్యాలీ ఇన్వెస్టర్లలో ఆనందాన్ని కలిగిస్తూనే తదుపరి భవితవ్యంపై స్వల్ప ఆందోళనతో కూడిన ఆసక్తిని పెంచుతోంది. గతనెల కంపెనీ ప్రకటించిన బలమైన ఫలితాలు, తాజాగా కంపెనీ పూర్తి చేసిన నిధుల సమీకరణ, కంపెనీ సౌర ఉత్పత్తులపై ఎక్కువ ఫోకస్‌ చేయడం, షేరు ఈక్విటీ తక్కువగా ఉండడంతో ఇన్వెస్టర్ల మధ్య పోటీ... తదితర కారణాలు షేరులో జోరు తెస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది బబుల్‌ర్యాలీ కావచ్చని, షార్ట్‌కవరింగ్‌ వలన ఏర్పడుతున్న పరుగేకానీ, బలమైన ఫండమెంటల్స్‌ కారణంగా వచ్చిన ఉషారు కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వాల్‌స్ట్రీట్‌లోని 31 మంది అనలిస్టుల్లో 45 శాతం మంది షేరుకు సెల్‌ రేటింగ్‌ ఇచ్చారు. కేవలం 6మంది మాత్రమే కొనొచ్చు రేటింగ్‌ ఇవ్వగా మిగిలిన వారు న్యూట్రల్‌గా ఉన్నారు. తాజా ర్యాలీ షేరులో ప్రాఫిట్‌బుకింగ్‌కు ఛాన్సని, షేరు ధర దిగివచ్చినప్పుడు మరలా కొనుగోలు చేయవచ్చని ప్రముఖ అనలిస్టు జిమ్‌ క్రామర్‌ సూచించారు. 
లక్ష కోట్ల డాలర్ల దిశగా...
ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ జనరల్‌ మోటర్స్‌, హోండా, డైమ్లర్‌ కంపెనీల వైయుక్తిక మార్కెట్‌క్యాప్‌ కన్నా దాదాపు మూడురెట్లు, ఫోర్ట్‌మోటర్స్‌ కన్నా దాదాపు నాలుగు రెట్లు అధికం. టయోటా(దాదాపు 22500 కోట్ల డాలర్లు) తర్వాత ఆటో కంపెనీల్లో మార్కెట్‌ క్యాప్‌ పరంగా టెస్లా రెండో స్థానంలో ఉంది. చైనాలో కంపెనీ ఉత్పత్తి ప్లాంటు పునఃప్రారంభం కావడం, కొత్త మోడళ్ల లాంచింగ్‌లు కూడా కంపెనీపై పాజిటివ్‌ అంచనాలను పెంచాయి. ఇటీవల ప్రకటించి 200 కోట్ల డాలర్ల నిధుల సమీకరణను విజయవంతంగా పూర్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. స్టాక్‌ఆఫరింగ్‌ ద్వారా సుమారు 231 కోట్ల డాలర్లు సమీకరించామని, ఆఫరింగ్‌లో ఒక్కో షేరును 767 డాలర్లకు విక్రయించామని తెలిపింది. కంపెనీ గతేడాది చైనాలో చేపట్టిన నిధుల సమీకరణపై యూఎస్‌ సెక్‌ విచారణ ఆరంభించిందన్న వార్తలు సైతం కంపెనీ షేరుపై ఎలాంటి నెగిటివ్‌ ప్రభావం చూపలేకపోయాయి. చైనా లోకల్‌ బ్యాంకుల నుంచి దాదాపు 160 కోట్ల డాలర్లు సమీకరించినట్లు టెస్లా గతేడాది ప్రకటించింది. చాలామంది కంపెనీ కేవలం ఎలక్ట్రిక్‌ కార్లను మాత్రమే తయారు చేస్తుందనుకుంటారు కానీ కంపెనీ సోలార్‌ పవర్‌ బ్యాటరీల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. సోలార్‌ వ్యాపారంపై నమ్మకమే షేరులో పరుగులకు కారణమవుతోందని కొందరు అనలిస్టులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రపంచ ఆటో పరిశ్రమ మందగమనంలో ఉండగా, టెస్లా మాత్రం తన వైవిధ్యభరిత ఉత్పత్తుల కారణంగా జోరు చూపుతోంది. దీంతో షేరు త్వరలో 1000 డాలర్లను అవలీలగా చేరవచ్చని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే  మరికొన్ని సంవత్సరాల్లోనే టెస్లా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా ఎదగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. You may be interested

52 వారాల కనిష్టానికి 65 షేర్లు

Thursday 20th February 2020

గురువారం 65 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో ఆగ్రో ఫోస్‌ ఇండియా, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కీస్‌, ఆర్కోటెక్‌, అట్లాంటా, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌,బిర్లా టైర్స్‌, సీ అండ్‌ సీ కనస్ట్రక‌్షన్స్‌, సెలస్ట్రియల్‌ బయోల్యాబ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, సీఎల్‌ ఎడ్యూకేట్‌, సీఎంఐ, సీఐఎల్‌ నోవా పెట్రోకెమికల్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, కేంబ్రిడ్జ్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్‌, డీప్‌ ఇండస్ట్రీస్‌, డీపీఎస్‌సీ,

వొడాఫోన్‌ ఐడియా..అదుర్స్‌

Thursday 20th February 2020

రెండో రోజూ షేరు హైజంప్‌ మంగళవారం కనిష్టం నుంచి 68 శాతం అప్‌ డెలివరీ ఆధారిత కొనుగోళ్లు పెరిగాయ్‌ మొబైల్‌ సేవల కంపెనీ వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఉదయం 10.30 ప్రాంతంలో 14 శాతం జంప్‌చేసి రూ. 4.80 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4.85 వరకూ ఎగసింది. బుధవారం సైతం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో 38 శాతం దూసుకెళ్లి రూ.

Most from this category