News


హెచ్‌1పై ఆంక్షలు అమెరికాకే ప్రతికూలం

Friday 21st June 2019
news_main1561097623.png-26465

  • అక్కడి సంస్థలకు నిపుణులు దొరకరు
  •  భారత ఐటీ పరిశ్రమకూ ఇబ్బందే
  • నాస్కామ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: టెక్నాలజీ నిపుణులకు వీసాలివ్వటంపై మరిన్ని పరిమితులు విధిస్తే అమెరికన్ కంపెనీలకే ప్రతికూలమవుతుందని దేశీ ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. ఈ వీసాలపై విదేశీ నిపుణులను నియమించుకునే అమెరికన్ కంపెనీలు సరైన వారు దొరక్క బలహీనంగా మారతాయని, ఉద్యోగాలకు ముప్పు తప్పదని పేర్కొంది. వివాదాస్పద హెచ్‌-1బీ వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కుతుండటం వారి ప్రతిభకు తార్కాణమని, వీటిలో చాలా మటుకు వీసాలను అంతర్జాతీయ, అమెరికన్ బహుళజాతి దిగ్గజాలు స్పాన్సర్‌ చేస్తున్నాయని నాస్కామ్‌ తెలియజేసింది. విదేశీ కంపెనీలు డేటాను తమ దేశంలోనే భద్రపర్చాలంటూ ఒత్తిడి చేసే దేశాలకు ఇచ్చే హెచ్‌-1బీ వీసాలపై 10-15 శాతం మేర పరిమితి విధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో నాస్కామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
ఈ అంశంపై ఇప్పటిదాకా అమెరికా ప్రభుత్వం నుంచి అధికారికంగా ధృవీకరణ ఏదీ రాలేదని, అధికారులిచ్చే స్పష్టమైన వివరణ కోసం ఎదురు చూస్తున్నామని నాస్కామ్ తెలిపింది. ఒకవేళ ఇలాంటిదేమైనా అమలు చేసిన పక్షంలో ప్రధానంగా ఉత్తర అమెరికా మార్కెట్‌ నుంచే భారీగా ఆదాయాలు పొందుతున్న 150 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది. సాధారణంగా భారతీయ ఐటీ సంస్థలు అత్యధికంగా హెచ్‌-1బీ వీసాలపైనే తమ ఉద్యోగులను అమెరికాలోని క్లయింట్ లొకేషన్స్‌కు పంపిస్తుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో వీసాల పరిశీలన చాలా కఠినతరంగా మారడంతో దేశీ ఐటీ సంస్థలు అమెరికాలోని స్థానికులనే ఎక్కువగా రిక్రూట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. "ఒకవేళ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడాన్ని అమెరికా విధానాలు కఠినతరం చేసిన పక్షంలో దాని వల్ల.. వారిపై ఆధారపడి ఉన్న అమెరికా కంపెనీలే బలహీనపడతాయి. ఆయా సర్వీసులను మళ్లీ విదేశాల నుంచి పొందాల్సి వస్తుంది" అని నాస్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. 
పరిమితులపై ఇంకా సమాచారం రాలేదు: కేంద్ర వాణిజ్య శాఖ
డేటా లోకలైజేషన్ నిబంధనలు అమలు చేసే దేశాలకిచ్చే హెచ్‌-1బీ వీసాలపై పరిమితులు విధించే విషయంపై అమెరికా నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. చెల్లింపుల సేవలు అందించే పేమెంట్ సర్వీసుల సంస్థలు భారతీయ వినియోగదారుల డేటాను భారత్‌లోనే ఉంచాలంటూ కేంద్రం గతేడాది ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నిబంధనలనే వ్యతిరేకిస్తూ.. తాజాగా హెచ్‌-1బీ వీసాల విషయంలో భారత్‌ లాంటి దేశాలను అమెరికా టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 



You may be interested

కొత్తగా 2.76 లక్షల కొలువులు

Friday 21st June 2019

ఈ ఏడాది ప్రథమార్ధంలో రావచ్చని అంచనా ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగాల్లోనే అత్యధికం టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదికలో వెల్లడి ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోని తొలి ఆరు నెలల్లో రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌) రంగాల్లో అత్యధికంగా 2.76 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. విదేశీ రిటైల్ దిగ్గజాలు ఆయా రంగాల్లోకి పెద్ద యెత్తున విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. ఏప్రిల్‌-సెప్టెంబర్ 2019-20 కాలానికి సంబంధించి ఉద్యోగాల అంచనాల నివేదికలో టీమ్‌లీజ్ సర్వీసెస్

జెట్‌ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు

Friday 21st June 2019

దేశ ప్రయోజనాల దృష్ట్యా వేగంగా పరిష్కరించాలి పరిష్కార నిపుణుడిని కోరిన ఎన్‌సీఎల్‌టీ ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌కు వ్యతిరేకంగా దివాలా పరిష్కారం కోసం ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నమోదు చేసుకుంది. గ్రాంట్‌ థార్న్‌టన్‌కు చెందిన ఆశిష్‌ చౌచారియాను పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఈ అంశం జాతీయ ప్రాధాన్యం గలది కాబట్టి చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ, మూడు

Most from this category