News


కొత్త గరిష్టం సమీపంలో అమెరికా మార్కెట్‌!

Saturday 26th October 2019
news_main1572070228.png-29161

   మూడవ త్రైమాసికానికి సంబంధించి యుఎస్‌ కార్పోరేట్‌ ఫలితాలు బాగుండడంతోపాటు, యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఫేజ్‌1 ఖరారు కానుందనే అంచనాల నేపథ్యంలో గత సెషన్లో యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ జులై 26, 2019 ట్రేడింగ్‌లో ఏర్పరిచిన రికార్డు గరిష్ఠాం 3,027.98 స్థాయికి దగ్గరగా వచ్చి తిరిగి వెనుతిరిగింది. కానీ అప్పటి ట్రేడింగ్‌లో ముగిసిన 3,025.86 స్థాయిని దాటడం గమనార్హం. గత సెషన్లో 3,002.7 వద్ద ప్రారంభమైన ఈ ఇండెక్స్‌, 3,027.39 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో గరిష్ఠ స్థాయి నుంచి పడిపోయి చివరికి 0.41 శాతం లాభంతో 3,022.55 వద్ద క్లోజయ్యింది. అంతేకాకుండా నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌ కూడా 0.78 శాతం లాభపడి  8,029.22 వద్ద రికార్డు గరిష్ఠాన్ని ఏర్పరిచింది.
    యుఎస్‌-చైనా దేశాలకు చెందిన సంధానకర్తలు ఒప్పందంలోని కీలకమైన అంశాల గురించి ఫోన్లో మాట్లాడుకున్నారని సీఎన్‌బీసీ తెలిపింది. యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చైనా, యుఎస్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచనుండగా, యుఎస్‌, చైనాపై విధించిన అదనపు సుంకాల అమలును నిలిపివేసింది. దీనితో పాటు మూడవ త్రైమాసికానికి సంబంధించి యుఎస్‌ కార్పోరేట్‌ లాభాలు పెరగడంతో కూడా ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ వరుస ఏడు వారాలలో ఈ వారం రికార్డు గరిష్ఠాన్ని చేరింది. దీనితోపాటు నాస్‌డాక్‌ ఇండెక్స్‌ గత ఎనిమిది వారాలలో గరిష్ఠ స్థాయిని ఈ వారం చేరుకుంది. 
  ఇంటెల్‌ కార్పోరేషన్‌ షేరు గత ఏడాది జనవరి తర్వాత ఒకే రోజులో అత్యధికంగా (8 శాతం) లాభపడింది. ఈ షేరు భారీగా ర్యాలీ చేయడంతో ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్, ఎస్‌ అండ్‌ పీ 500 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజి ఇండెక్స్‌ భారీగా లాభపడ్డాయి. అంతేకాకుండా ముఖ్యమైన మూడు ప్రధాన ఇండెక్స్‌లలో ఈ షేరు టాప్‌ గెయినర్‌గా ఉంది. కానీ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈ షేరు విలువ 1.3 శాతం నష్టపోయింది. ఫలితంగా ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌లోని 11 ప్రధాన సెక్టార్లలో, వినియోగ రంగం సూచీ అధికంగా నష్టపోయింది. యుఎస్‌ డోజోన్స్‌ 153 పాయింట్లు లేదా 0.6 శాతం లాభపడి 26,958.06 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌ 0.70శాతం లాభపడి 8,243.12 పాయింట్ల వద్ద ముగిశాయి.



You may be interested

ఆ కంపెనీల షేర్లపై డేగకన్ను!

Saturday 26th October 2019

ప్రమోటర్లు భారీగా తమవాటా షేర్లను తనఖా పెట్టిన కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్టాక్‌ఎక్చేంజ్‌లు నిర్ణయించాయి. ఇలాంటి కంపెనీల షేర్లలో చోటుచేసుకుంటున్న తీవ్ర ఒడిదుడుకులకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్చేంజ్‌లు ఈ నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా వెయ్యికోట్ల రూపాయల మార్కెట్‌ క్యాప్‌ ఉండి, మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 25 శాతానికి మించి ప్రమోటర్లు తనఖా పెట్టిఉన్న కంపెనీల స్టాకులపై 35 శాతం కనిష్ఠ మార్జిన్‌ నిబంధన విధించాలని నిర్ణయించాయి. అదేవిధంగా

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 55 పాయింట్లు అప్‌

Saturday 26th October 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం భారీ లాభంతో ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11609తో పోలిస్తే 55 పాయింట్లు లాభంతో ఉంది. నిన్న ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి దాదాపు ఫ్లాట్‌ ముగిశాయి. సెన్సెక్స్‌ 37.67 పాయింట్ల లాభంతో 39,058.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1.30 పాయింట్ల లాభంతో 11,583.90 వద్ద ముగిసింది. ఈ వారం మొత్తం మీద

Most from this category