News


పంతం నెరవేర్చుకున్న ట్రంప్‌

Friday 10th May 2019
news_main1557474011.png-25660

అమల్లోకి వచ్చిన చైనా దిగుమతులపై టారిఫ్‌లు పెంపు
ముందు చెప్పినట్లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం చైనా వస్తూత్పత్తులపై టారిఫ్‌లను పెంచారు. దాదాపు 20వేల కోట్ల డాలర్ల విలువైన చైనా వస్తూత్పత్తులపై టారిఫ్‌ను 25 శాతం మేర పెంచామని, శుక్రవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని యూఎస్‌ఏ ప్రకటించింది. అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన చైనా, ఇందుకు తగ్గట్లు ప్రతిచర్యలుంటాయని హెచ్చరించింది. దీంతో తాజాగా జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలం అయ్యే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోయినట్లేనని ఎకనమిస్టులు ఆందోళన చెందుతున్నారు. యూఎస్‌ నిర్ణయం పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చిన చైనా, ఇందుకు తగ్గట్లే తమ ప్రతిస్పందన ఉంటుందని ప్రకటించింది. గురువారం చైనా వైస్‌ ప్రీమియర్‌ లియుహి, యూఎస్‌ ట్రేడ్‌ సెక్రటరి స్టీవెన్‌ ముంచిన్‌ తదితరులు గురువారం దాదాపు 90 నిమిషాల పాటు వాణిజ్యచర్చలు జరిపారు. శుక్రవారం ఈ చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. చర్చలు కొనసాగుతుండగానే యూఎస్‌ టారిఫ్‌లను పెంచింది. అయితే చైనాతో చర్చలు ఫలప్రదం అవుతాయని భావిస్తున్నట్లు యూఎస్‌ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. 
నోటీస్‌ పిరియడ్‌ ఐదు రోజులే
గతంలో చైనా దిగుమతులపై టారిఫ్‌లు విధించిన సందర్భాల్లో కొంత గడువు ఇచ్చిన యూఎస్‌ ఈదఫా ఐదు రోజుల నోటీస్‌ పిరియడ్‌తో టారిఫ్‌లను పెంచేసింది. దీంతో గురువారం చైనా నుంచి యూఎస్‌కు బయలుదేరిన ఎగుమతులన్నింటిపై శుక్రవారం పెరిగిన టారిఫ్‌లు వర్తించనున్నాయి. ఇలాంటి చర్యలు చర్చలను దెబ్బతీస్తాయని గోల్డ్‌మన్‌సాక్స్‌ లాంటి బ్రోకింగ్‌ సంస్థలు విమర్శిస్తున్నాయి. చర్చలు సఫలం అయ్యే అవకాశాలకు నోటీస్‌ పిరియడ్‌ స్వల్పంగా ఉండడం గండి కొట్టవచ్చని అభిప్రాయపడ్డాయి. తాజా టారిఫ్‌ పెంపుతో చైనా మెషనరీ, టెక్నాలజీ రంగంపై ఎక్కువ భారం పడనుంది. యూఎస్‌ ప్రకటనతో శుక్రవారం లాభాలతో ఆరంభమైన స్టాక్‌మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి మరలాయి. యూఎస్‌ ఫ్యూచర్లు సైతం నెగిటివ్‌గా ట్రేడవుతున్నాయి. తాజా పెంపు ప్రభావం యూఎస్‌పైన కూడా ఉంటుందని, ఈ ప్రభావం కనిపించేందుకు కొంత కాలం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద మందగమన భయాలను తాజా టారిఫ్‌ పెంపు మరింత పెంచినట్లయింది. You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Friday 10th May 2019

పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 51 శాతం అప్‌ -ఒక్కో షేర్‌కు రూ.9 తుది డివిడెండ్‌  -రూ.1,000 కోట్లు దాటిన నికర లాభం  న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్‌లో 51 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.252 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.380 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది.

ఏప్రిల్‌లో 61% తగ్గిన ఈక్విటీ ఎంఎఫ్‌లు

Friday 10th May 2019

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో ఒడిదుడుకులు పెరిగిన కారణంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ప్రవేశించే పెట్టుబడులు మొత్తం ఏకంగా 61 శాతం తగ్గిపోయింది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. గతనెల్లో కేవలం రూ.4,609 కోట్లు మాత్రమే ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి ప్రవేశించగా, మార్చిలో ఈ మొత్తం రూ.11,756 కోట్లుగా ఉంది. ఫిక్సిడ్‌ మెచ్యూరిటీ ప్లాన్ల(ఎఫ్‌ఎంపీ) నుంచి రూ.17,644 కోట్లు, డెట్‌ ఓరియంటెడ్‌ స్కీంల

Most from this category