News


యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం!

Saturday 12th October 2019
news_main1570861731.png-28841

దీర్ఘకాలంగా కొనసాగిన యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌కి పాక్షీక సంధి కుదిరింది. యుఎస్‌-చైనా ప్రతినిధులు మధ్య ప్రారంభమైన వాణిజ్య చర్చలు శుక్రవారం నాడు ఓ కొలిక్కి వచ్చాయి. ఇరు దేశాల మధ్య పరిమితితో కూడిన వాణిజ్య ఒప్పందమైన స్వల్పకాలంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
పాక్షిక ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు..
  ఈ పాక్షిక ఒప్పందం, యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందంలో కీలకమైనదని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా చైనా, యుస్‌ నుంచి 40-50 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి కొన్ని మేథోసంపత్తి సంబంధించిన అంశాలలో అదనపు నిబంధనలతో పాటు చైనా తన కరెన్సీ నిర్వహణలో పారదర్శకత కోసం కొన్ని మార్గదర్శకాలను అంగీకరించింది. వీటికి బదులుగా యుఎస్‌, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 250 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై 25 శాతం నుంచి 30 శాతానికి పెంచాలనుకున్న టారీఫ్‌ల అమలును నిలిపివేయనుంది. కాగా ఇరు దేశాల వాణిజ్య చర్చల తర్వాత యుఎస్‌ ట్రెజరీ సెక్రటరీ  మున్చిన్‌ ఈ అంశాలను దృవీకరించారు. ఈ ఒప్పందంలో మొదటి భాగాన్ని కొన్ని వారాల్లో లిఖితపూర్వకంగా ఖరారు చేస్తామని, రెండవ భాగం వెనువెంటనే ఉంటుందని ట్రంప్‌ తెలిపారు. ఈ పాక్షిక ఒప్పందం పూర్తిగా ఖరారు కావడానికి ఇంకో మూడు నుంచి ఐదు వారాల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఒప్పందం పూర్తవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇరు దేశాలు ఒప్పుకున్న వాణిజ్య అంశాలు ఈ సమయం కంటే ముందే వీగిపోయాయని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికి ఈ ఒప్పందం వలన సమీప కాలం వరకు అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడయ్యే అవకాశం ఉంది.
యుఎస్‌ మార్కెట్ల జోరు..
దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుఎస్‌-చైనా వాణిజ్య యుధ్దానికి పాక్షీకంగా సంధి కుదరడంతో యుఎస్‌ మార్కెట్లు శుక్రవారం సెషన్‌లో లాభాల బాట పట్టాయి. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 1.1 శాతం లాభపడగా, డోజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.2 శాతం లాభపడింది.  You may be interested

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ...బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు డౌన్‌

Saturday 12th October 2019

శనివారం ఉదయం ట్రేడింగ్‌లో సింగపూర్‌ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల్లో ట్రేడవుతోంది. శుక్రవారం నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపు 11318 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల నష్టంతో 11287 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఒకదశలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11359 పాయింట్ల గరిష్ఠాలను చేరినా అక్కడ నిలబడలేకపోయింది. శుక్రవారం ట్రేడ్‌ డీల్‌ వార్తలతో ప్రపంచ మార్కెట్లన్నీ కదం తొక్కాయి. దీంతో సోమవారం దేశీయ సూచీలు పాజిటివ్‌గా ఉంటాయని చాలామంది అంచనా వేశారు. కానీ ఎస్‌జీఎక్స్‌

వ్యూహాత్మక వాటాల అమ్మకానికి మోగిన గంట

Saturday 12th October 2019

అడ్వైజర్ల నుంచి బిడ్లను ఆహ్వానించిన ప్రభుత్వం కాంకర్‌, నీప్కో, టీహెచ్‌డీసీల్లో వాటాల విక్రయం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం సలహాదారులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. కంటెయినర్‌ కార్పొరేషన్‌ (కాంకర్‌), నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (నీప్కో), టీహెచ్‌డీసీ ఇండియాల్లో వాటాల అమ్మకానికి సంబంధించి అడ్వైజర్ల (లావాదేవీ సలహాదారు/న్యాయ సలహాదారు/ఆస్తుల విలువ మదింపుదారు) నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) నోటిఫికేషన్‌ విడుదల

Most from this category