News


వడ్డీ రేటు పెంచి మరో తప్పు చేయొద్దు

Wednesday 19th December 2018
news_main1545194266.png-23068

వాషింగ్టన్‌: వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్‌ను (ఫెడ్‌) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ హెచ్చరించారు. రేట్లను పెంచడం ద్వారా 'మరో తప్పు' చేయవద్దని స్పష్టంచేశారు. "వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసిన ఎడిటోరియల్ చూసైనా వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్ పునరాలోచన చేయాలి. మరో తప్పిదం చేయకూడదు. ఇప్పటికే లిక్విడిటీ తగ్గిపోయిన మార్కెట్‌ను మరింతగా కుంగదీయొద్దు. అర్థంపర్థం లేని గణాంకాలను పట్టుకుని కూర్చోకుండా.. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోండి. గుడ్‌ లక్‌!!" అని మైక్రో బ్లాగింగ్ సైటు ‍ట్విటర్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఆఖరుసారిగా మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల ఫెడరల్‌ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ‍ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ ఏడాది నాలుగోసారి ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్నప్పటికీ.. తాత్కాలికంగా విరామం ప్రకటించాలని వాల్‌స్ట్రీట్ జర్నల్ సంపాదకీయంలో పేర్కొంది. ఇటీవలి కాలంలో ట్రంప్ వీలు చిక్కినప్పుడల్లా ఫెడరల్ రిజర్వ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. గాడి తప్పిన వ్యవస్థని, తింగరిదని, చైనాను మించిన పెద్ద ఆర్థిక ముప్పు అని ఫెడరల్ రిజర్వ్‌ను అనేక సార్లు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో... ఫెడరల్ రిజర్వ్‌కి చిరాకెత్తి.. ఒకవేళ వడ్డీ రేట్ల పెంపును తాత్కాలికంగా ఆపుదామనుకున్నా, ట్రంప్ వ్యాఖ్యల కారణంగా కావాలనే పెంచినా పెంచొచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.



You may be interested

ఫండ్ వ్యాపారానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్ గుడ్‌బై

Wednesday 19th December 2018

ముంబై: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా అసెట్ మేనేజర్స్‌ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు గృహ రుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్ఎల్‌) వెల్లడించింది. జాయింట్ వెంచర్‌లో తమకున్న మొత్తం వాటాలను భాగస్వామి ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌కు విక్రయిస్తున్నామని, డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా ట్రస్టీస్ నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నామని పేర్కొంది. 2015లో ఫండ్ వ్యాపారంలో 50 శాతం వాటాలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలు చేసింది. ఇందులో 17.12 శాతం వాటాలు నేరుగా, 32.88

మాల్యా దివాలా కేసు ఇక బ్రిటన్‌ హైకోర్టులో

Wednesday 19th December 2018

లండన్‌: మాజీ లిక్కర్‌ వ్యాపారి, బ్యాంకులకు భారీగా బకాయి పడిన విజయ్‌ మాల్యా బ్రిటన్‌ హైకోర్టులో వచ్చే ఏడాది దివాలా పిటిషన్‌పై విచారణను ఎదుర్కోనున్నారు. మాల్యా సుమారు రూ.9,000 కోట్లకు పైగా భారత బ్యాంకులకు బకాయి పడిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 13 బ్యాంకుల కమిటీ ఇప్పటికే మాల్యాకు సంబంధించి ఆస్తుల జప్తు కేసును నెగ్గింది. బ్రిటన్‌కు చెందిన టీఎల్‌టీ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ కేసు వ్యవహారాలు చూసింది.

Most from this category