News


అద్భుతమైన వాణిజ్య ఒప్పందం

Tuesday 25th February 2020
news_main1582598356.png-32053

  • అతి పెద్ద డీల్ అవుతుంది
  • ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

అహ్మదాబాద్‌: ఓ అద్భుతమైన, ఇప్పటి వరకు చరిత్రలో అతిపెద్దది అయిన వాణిజ్య ఒప్పందంపై భారత్‌, అమెరికా చర్చలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. భారత పర్యటనలో తొలి రోజు సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం నుంచి ఆయన ప్రసంగించారు. పెట్టుబడులకు అవరోధాలను తగ్గించే దిశగా అద్భుతమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని ప్రకటించారు. ‘‘నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ, నేను ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల విస్తృతికి చర్చించనున్నాం. చాలా చాలా పెద్దవి, ఇంతకుముందు ఎన్నడూ లేనంత భారీ ఒప్పందాలు చేసుకోనున్నాం. అద్భుతమైన ఒప్పందం దిశగా చర్చలు ఆరంభ దశలో ఉన్నాయి. ప్రధాని మోదీతో కలసి ఇరు దేశాలకూ మంచి చేసే గొప్ప అద్భుతమైన ఒప్పందానికి వస్తామన్న విశ్వాసం నాకుంది’’ అని ట్రంప్‌ వివరించారు. చర్చల విషయంలో మోదీ చాలా కఠినంగా ఉంటారని వ్యాఖ్యానించారు. రెండుదేశాల మధ్య వాణిజ్యం 40 శాతానికి పైగా పెరిగినట్టు చెప్పారు. అమెరికా ఉత్పత్తులకు భారత్‌ పెద్ద మార్కెట్‌ అని, అదే విధంగా భారత్‌కు అమెరికా పెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉన్నట్టు వివరించారు. 
అమెరికా బూమింగ్‌ ప్రపంచానికి ప్రయోజనం...
అమెరికా అభివృద్ధి చెందితే అది భారత్‌కు, ప్రపంచానికి మంచిదన్నారు ట్రంప్‌. అమెరికా చరిత్రలోనే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతోందని చెప్పేందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొ‍న్నారు. ఉద్యోగాలను ఆకర్షించడం, వ్యాపారాల్లో సమస్యలను తగ్గించడం, నూతన పెట్టుబడులకు అవరోధాల్లేకుండా చేయడం, అనవసర బ్యూరోక్రసీ, నియంత్రణలను తొలగించినట్టు ట్రంప్‌ వివరించారు.
వ్యాపార వాతావరణం మరింత మెరుగవ్వాలి...
ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే గణనీయమైన సంస్కరణలను చేపట్టారన్న ట్రంప్‌.. భారత్‌లో వ్యాపార వాతావరణం మరింత మెరుగవ్వాలని ప్రపంచం కోరుకుంటోందన్నారు. ఆయన (మోదీ) దీన్ని రికార్డు వేగంతో చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒప్పందం సాకారమవుతుందన్న అంచనాలకు వీలు కల్పించినట్టయింది. సున్నితమైన వ్యవసాయం, పాడి, డేటా పరిరక్షణ, డేటా స్థానికంగా నిల్వ చేయడం, ఈ కామర్స్‌ తదితర రంగాలపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరాల్సి ఉంది. ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుందని, భారత ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని ఓ అధికారి తెలిపారు. వాణిజ్య చర్చలు పురోగతి చెందితే అమెరికా మరిన్ని డిమాండ్లను ముందుకు తీసుకురావచ్చని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు భారత్‌తో 17 బిలియన్‌ డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు తమ దేశ పాడి, పౌల్ట్రీ, వైద్య పరికరాలకు మరిన్ని మార్కెట్‌ అవకాశాలు కల్పించాలన్నది అమెరికా డిమాండ్‌. భారత్‌ నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, వాణిజ్య పరంగా ప్రాధాన్య దేశం హోదా తిరిగి కల్పించాలని మన దేశం కోరుతోంది. You may be interested

టాప్‌ 3 ఎకానమీల్లోకి భారత్‌

Tuesday 25th February 2020

దశాబ్దకాలంలో సాధ్యమే డిజిటల్‌ సొసైటీగా ఎదుగుతాం టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుస్తుంది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడి న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచంలోని టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌..  కచ్చితంగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ డిజిటల్‌ సమాజంగా భారత్‌ రూపొందుతుందని ఆయన చెప్పారు. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ ఇందుకు ఊతంగా నిలుసుందన్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌

లిస్టింగ్‌తోనే దిగ్గజాలను వెనక్కి నెట్టనున్న ఎస్‌బీఐ కార్డ్స్‌

Tuesday 25th February 2020

ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీవో మార్చి 2న ప్రారంభం కానుండగా, 5న ముగియనుంది. అనంతరం అదే నెల 16న స్టాక్‌ ఎక్సేంజ్‌లలో లిస్ట్‌ అవనుంది. లిస్టింగ్‌తోనే ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ అప్పటికే నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని 16 కంపెనీలను మార్కెట్‌ విలువ పరంగా (గత శుక్రవారం నాటి గణాంకాల ఆధారంగా) వెనక్కి నెట్టేయనుంది. ఐపీవోలో ధరల శ్రేణి రూ.750-755గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వారం

Most from this category