అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల మోత
By Sakshi

బీజింగ్: అమెరికాకు దీటుగా చైనా స్పందించింది. అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. చైనాకు చెందిన మరో 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లను 10 శాతం మేర అదనంగా పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. చైనాకు చెందిన ఉత్పత్తులపై అమెరికా నూతనంగా పెంచిన టారిఫ్‌లకు స్పందనగా... అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల దిగుమతులపై అదనపు టారిఫ్‌లను బీజింగ్ అమలు చేస్తుందని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ ప్రకటించింది. అలాగే, డిసెంబర్ 15 నుంచి అమెరికన్ తయారీ వాహనాలు, ఆటో విడిభాగాలపై అదనంగా 25 శాతం లేదా 5 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు మరో ప్రకటన కూడా వెలువరించింది. చైనా ఉత్పత్తులపై సెప్టెంబర్ 1, డిసెంబర్ 15 నుంచి రెండు విడతల్లో టారిఫ్‌ల పెంపును అమలు చేయనున్నట్టు అమెరికా ప్రకటించిన విషయం గమనార్హం.
You may be interested
హైదరాబాద్ వద్ద ఎన్సీఎల్ మరో ప్లాంటు
Saturday 24th August 2019ప్రీ-ఇంజనీర్డ్ స్టీల్ స్ట్రక్చర్స్ తయారీ చైనా కంపెనీ సిండావోతో జేవీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- సిమెంటు, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ రంగంలో ఉన్న ఎన్సీఎల్ ఇండస్ట్రీస్.. ప్రీ-ఇంజనీర్డ్ స్టీల్ స్ట్రక్చర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని మల్కాపూర్ వద్ద ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. చైనాకు చెందిన సిండావో జింగ్‌జాంగ్ స్టీల్ స్ట్రక్చర్స్‌తో కలిసి ఈ యూనిట్‌ను స్థాపిస్తున్నారు. జేవీలో ఎన్‌సీఎల్‌కు 70 శాతం, సిండావోకు 30 శాతం వాటా
డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు
Saturday 24th August 2019వివిధ కాలపరిమితులపై అరశాతం వరకూ కోత న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. దీనితో డిపాజిట్‌దారులకు తక్కువ రిటర్న్ ్స మాత్రమే చేతికి అందుతాయన్నమాట. ఆగస్టు 26వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ ప్రకటన తెలిపింది. ముఖ్యాంశాలు చూస్తే... - వివిధ కాలపరిమితుల డిపాజిట్లపై రేట్లు