STOCKS

News


‘జీ’ హుజూర్‌..మోకరిల్లిన ట్రంప్‌

Thursday 15th August 2019
news_main1565855316.png-27788

బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...చైనా అధ్యక్షుడి ముందు దాదాపు మోకరిల్లినంత పనిచేశారు. రెండెళ్లు, పదేళ్ల యుఎస్‌ ట్రెజరీ ఈల్డ్‌ల మధ్య ఇన్వర్షన్‌ జరగడంతో (పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ని రెండేళ్ల బాండ్‌ ఈల్డ్‌ మిం‍చిపోవడం) గత సెషన్‌లో యుఎస్‌ డోజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ సూచీ 800 పాయింట్లు కుప్పకూలింది. ఇలా ఇన్వెర్షన్‌ జరగడం సమీప భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం కమ్మేస్తుందనడానికి సంకేతం. 2007 మహా మాంద్యం తర్వాత...ఇలా ఈల్డ్‌ కన్వర్డ్‌కావడం ఇదే తొలిసారి. దాంతో ఒక్కసారిగా వాణిజ్యయుద్ధ పరిష్కారానికి, స్టాక్‌ మార్కెట్ల కదలికలను శాంతపరచడానికి, యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రయత్నాలను మొదలు పెట్టారు. ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ‘ఒక గొప్ప నాయకుడు’, ‘మంచి వ్యక్తి’ అంటూ.. తన వరుస ట్వీట్లలలో పొగిడారు. ఇరు నాయకుల మధ్య ఒక సమావేశం ఉంటుందో లేదో చెప్పకుండానే, తన పోస్టులలో ‘వ్యక్తిగత సమావేశం?’ అంటూ ముగించారు. ప్రస్తుతం ట్రంప్‌ చర్యలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఎలా స్పందిస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. 
   వాణజ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా, చైనాపై ఒత్తిడిని తీసుకొస్తునే ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ గత ఏడాదిన్నర కాలం నుంచి కఠినసమయాన్ని ఎదుర్కొంటుంది. ఆర్థిక సంక్షోభం పెరిగి అన్ని రకాల రుణ సమస్యలను  చైనా ఎదుర్కోవలసి వచ్చింది. గత ఏడాది చైనా స్టాకు మార్కెట్లు భారీగా పతనం కావడంతో చైనా నియంత్రణ సంస్థలు మార్జిన్‌ ఫైనాన్సింగ్‌ రూల్స్‌ను మార్చవలసి వచ్చింది. స్వల్పకాలిక బ్యాంక్ ఫైనాన్సింగ్ కోసం షేర్లను తాకట్టు పెట్టిన మార్కెట్‌ లిస్టెడ్ కంపెనీల నుంచి ఈ క్షీణత కొంతవరకు ఏర్పడింది. వీటితో పాటు గత సీజన్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, రెండు దశాబ్దాలలో మొదటిసారిగా వాణిజ్య బ్యాంకును స్వాధీనం చేసుకోవలసి వచ్చింది. అంతేకాకుండా ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో వచ్చే గందరగోళాలను శాంతపరచవలసి వచ్చింది. సంస్థల రుణ సంక్షోభాలను, రాష్ట్ర-అనుబంధ సంస్థల బాండ్ డిఫాల్ట్‌లను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇదాంతా అద్వాన్నంగా అనిపించవచ్చు. కానీ ఈ అంశాలే ఇప్పుడు చైనాకు సహాయపడుతున్నాయి. చైనా ఇటువంటి పరిస్థితులకు అలవాటు పడడంతో సరియైన నిర్ణయాలను కఠినసమయాలలో తీసుకోగలుగుతుంది.
   కానీ యు.ఎస్ పరిస్థితిని గురించి వివరించడం కష్టం. యుఎస్‌ దీర్ఘకాలిక సావరిన్‌ బాండ్ రాబడులలో తగ్గుదల.. ఇన్వెస్టర్లు కోపంగా ఉన్నారనే విషయాన్ని తెలుపుతోంది. రెండు వారాల క్రితం, ఫెడరల్ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమ్ పావెల్ యు.ఎస్. రేటు తగ్గింపును ‘మిడ్-సైకిల్ సర్దుబాటు’ గా అభివర్ణించడంతో, రెండేళ్లు, పదేళ్ల బాండ్ రాబడుల మధ్య అంతరం(ప్రస్తుతం వరకు)  21 బేసిస్ పాయింట్లుకు పెరిగింది. ఈ బాండ్‌ ఈల్డ్‌ మొత్తంగా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిని, వ్యాపారస్తుల దృక్పథాన్ని వివరిస్తాయని విశ్లేషకులు తెలిపారు. 
   చైనా పారిశ్రామిక ఉత్పాదక వృద్ధి 2002 నుంచి బలహీనంగా ఉంది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందనే విషయం ఖచ్చితంగా అర్థమవుతోంది. కానీ చైనా ఆర్థిక డేటాను లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వం కొంత నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చైనా పారిశ్రామిక ఉత్పాదకతను మెరుగుపరుచుకోవాలంటే లిక్విడిటి అందుబాటును తిరిగి పెంచవలసి ఉంటుంది. కాగా పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(పీబీఓసీ) భయపడిన సంకేతాలు గురువారం కనిపించలేదు. ఈ బ్యాంక్‌ 383 బిలియన్‌ యువాన్‌ల మధ్యస్థ కాల రుణలపై వడ్డీ రేట్లను మార్చలేదు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద సెంట్రల్‌ బ్యాంక్‌(ఫెడరల్‌ రిజర్వ్‌) సున్నా వడ్డీ రేట్ల వైపు అడుగులేస్తుంటే పీబీఓసీ మాత్రం ఎటువంటి రేట్ల కోత విధించకపోవడం గమనార్హం. ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే చైనా వ్యవస్థకు దాని ప్రయోజనాలు ఉన్నాయి. వారి పాలసీల ప్రతిస్పందనలను సమన్వయం చేయగలిగే మంత్రిత్వ శాఖలు ఉండడంతో ఆధునిక ద్రవ్య సిద్ధాంతాన్ని చైనా ఆచరించ గలుగుతోంది. బహుశా యుఎస్‌కు కూడా తమ ఈల్డ్‌ కర్వ్‌లను పునరుద్ధరించుకోడానికి ఇలాంటి చర్యలనే తీసుకోవలసిన అవసరం ఉండవచ్చు. యుఎస్‌, చైనాను ఒత్తిడిలోకి నెట్టింది అనుకోకండి. గత ఏడాది అధ్వాన్న పరిస్థితిని ఎదుర్కొన్న జిన్‌పింగ్‌ ఈసారి ఎదురు చూడడానికి వెనకాడకపోవచ్చు. You may be interested

4శాతం నష్టపోయిన ఏడీఆర్‌లు

Thursday 15th August 2019

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు  ఏడాదిలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఏడీఆర్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 4శాతం వరకు నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్‌ ఏడీఆర్‌ 4శాతం నష్టపోయింది. అలాగే విప్రో ఏడీఆర్‌ 3.50శాతం,

కోలుకున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 15th August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గురువారం నాటకీయంగా భారీ నష్టాల నుంచి కోలుకుంది. గత రాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనమైన నేపథ్యంలో  గురువారం ఉదయం 10,900 పాయింట్ల దిగువకు 10,894 పాయింట్ల వద్దకు పడిపోయిన ఈ సూచీ....తాజాగా ఆసియా మార్కెట్లు కూడా నష్టాల నుంచి రికవరీ అవుతున్న కారణంగా కనిష్టస్థాయి నుంచి బాగా కోలుకుంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 12.30 గంటల సమయంలో

Most from this category