News


యూఎస్‌- చైనా ట్రేడ్‌ డీల్‌కు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌

Friday 13th December 2019
news_main1576214166.png-30205

చైనా, అమెరికా మధ్య ఫేజ్‌ 1 ట్రేడ్‌డీల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 15న చైనాపై విధించాలిన్న కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావు. గురువారం ఈ ట్రేడ్‌ డీల్‌పై ట్రంప్‌ తన న్యాయ సలహాదారులతో చర్చించారు. యూఎస్‌ వ్యవసాయోత్పత్తులను చైనా మరింతగా కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని సదరు వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రతిగా చైనాపై ప్రస్తుతం విధించిన కొన్ని సుంకాలను తగ్గించాలని యూఎస్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. డీల్‌కు సంబంధించిన నిబంధనలపై అంగీకారం కుదిరిందని, ఇక దీనిని అధికారికంగా ప్రకటించే కసరత్తు జరుగుతోందని సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై వైట్‌హౌస్‌ గుట్టుగా ఉంది. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సలహాదారులతో సమావేశానికి ముందే ట్రంప్‌ డీల్‌పై పాజిటివ్‌ సంకేతాలు ఇచ్చారు.

ఒక అతిపెద్ద ట్రేడ్‌డీల్‌కు చాలా దగ్గరగా ఉన్నామని, డీల్‌ కుదుర్చుకుందామన్న చైనా కోరికను ఆమోదిస్తున్నామని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. దీంతో యూఎస్‌ ఈక్విటీలు ఒక్కమారుగా ర్యాలీ చేసి ఆల్‌టైమ్‌ హైని చేరాయి. ట్రేడ్‌డీల్‌ విషయమై అక్టోబర్‌లో ట్రంప్‌ ప్రకటన చేసినప్పటి నుంచి ఈక్విటీల్లో పాజిటివ్‌ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఈవారం మొదట్లో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అయోమయం సృష్టించాయి. ట్రేడ్‌డీల్‌ను 2020 ఎన్నికల తర్వాత కుదుర్చుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదన‍్న ట్రంప్‌ మాటలు డీల్‌పై నీలినీడలు కమ్మేలా చేశాయి. కానీ వెనువెంటనే డీల్‌ కుదురుతుందన్న సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లు ఊరడిల్లాయి. ఆదివారం రోజు చైనాపై కొత్త టారిఫ్‌ విధింపు గడువు ఉన్నందున ఈలోపు డీల్‌ కుదురుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా తాజాగా డీల్‌కు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈక్విటీలు ఊపిరి పీల్చుకున్నాయి. త్వరలో డీల్‌ నియమ నిబంధనలపై అధికారిక ప్రకటన రావచ్చని అంచనా. అయితే ట్రంప్‌ తాజా నిర్ణయంపై డెమోక్రాటిక్స్‌ నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదురైతున్నాయి. You may be interested

లాభాల్లో టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ షేర్లు

Friday 13th December 2019

6శాతం ర్యాలీ చేసిన టాటామోటర్స్‌  4శాతం పెరిగిన టాటాస్టీల్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ షేర్ల హావా కొనసాగుతుంది. టాటామోటర్స్‌ షేరు 6శాతం, టాటాస్టీల్‌ షేరు 4శాతం పెరిగాయి. బ్రిటన్‌లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకే మరోసారి ఓటర్లు పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ షేర్ల ర్యాలీకి కారణమవుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందకు (బ్రెగ్జిట్‌)కు అనుకూలం. టాటా స్టీల్‌,

ఈ సూచీలో గోల్డెన్‌ క్రాస్‌.. మన సూచీలకు పాజిటివ్‌!

Friday 13th December 2019

ఎంఎస్‌సీఐ వర్ధమాన మార్కెట్‌ సూచీ(ఎంఎస్‌సీఐ ఈఎం ఇండెక్స్‌)లో తాజాగా ఏర్పడిన గోల్డెన్‌ క్రాస్‌ దేశీయ ఈక్విటీలు మరింత పాజిటివ్‌గా ఉంటాయనేందుకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో రెండోసారీ ఈఎం ఇండెక్స్‌లో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడింది. స్వల్పకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖ కిందనుంచి పైకి దీర్ఘకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖను ఖండించడాన్ని గోల్డెన్‌ క్రాస్‌ అంటారు. టెక్నికల్‌గా 50 డీఎంఏ రేఖ దిగువనుంచి ఎగువకు 200 డీఎంఏ రేఖను ఖండిస్తే

Most from this category