News


వాణిజ్యపోరులో మరీ దూరం వెళ్లొద్దు

Monday 20th May 2019
news_main1558343016.png-25844

  • అమెరికాకు చైనా స్పష్టీకరణ

బీజింగ్‌: ఇరుదేశాల వాణిజ్యానికి సంబంధించి చైనాకు వ్యతిరేకంగా నష్టం కలిగించే చర్యల విషయంలో మరీ దూరం వెళ్లిపోవద్దని, పరస్పర సహకారం ద్వారానే ఇరు దేశాలూ ప్రయోజనం పొందగలవని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌పాంపియోకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ హితవు పలికారు. శనివారం పాంపియోతో టెలిఫోన్‌లో మాట్లాడారు. అమెరికన్‌ కంపెనీలు విదేశీ తయారీ టెలికం ఎక్విప్‌మెంట్‌ను వినియోగించొద్దని, వీటివల్ల దేశ భద్రతకు ముప్పు అంటూ నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌ గత వారమే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాంగ్‌ నుంచి ఈ సూచన వెలువడడం గమనార్హం. చైనాకు చెందిన హువావేను లక్ష్యంగా చేసుకునే ట్రంప్‌ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వాంగ్‌ మాట్లాడుతూ.. అమెరికా ఇటీవల తీసుకున్న చర్యలు, చేసిన వ్యాఖ్యలు ఎన్నో విభాగాల్లో చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేవని, చైనా కంపెనీల కార్యకలాపాలను కూల్చే విధంగా ఉన్నాయన్నారు. మరింత ముందుకు వెళ్లొద్దని అమెరికాను కోరుతున్నట్టు చెప్పారు. వివాదాల వల్ల నష్టపోయాయని, పరస్పర సహకారంతో అమెరికా, చైనాలు లబ్ధి పొందినట్టు చరిత్ర, వాస్తవాలు తెలియజేస్తున్నాయని వాంగ్‌ గుర్తు చేశారు. పరస్పర గౌరవం, ఇరు దేశాల ప్రయోజనాల కోణంలో సహకార విస్తృతి ఆధారంగా విభేదాలను పరిష్కరించుకోవాలన్న ఇరు దేశాధినేతలు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని రెండు దేశాలూ అనుసరించాలని కోరారు. You may be interested

కార్వీ నుంచి స్ట్రాంగ్‌ బెట్స్‌

Monday 20th May 2019

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలతో మరోమారు సుస్థిర ప్రభుత్వమే వస్తుందన్న నమ్మకం మార్కెట్లో బలంగా పెరిగింది. దీంతో సూచీలు సోమవారం చెలరేగాయి. నిఫ్టీ దాదాపు  420 పాయింట్లు, సెన్సెక్స్‌ దాదాపు 1400పాయింట్లు, బ్యాంకు నిఫ్టీ దాదాపు 1300 పాయింట్లు పెరిగాయి. నిఫ్టీ తన ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చాలా దగ్గరైంది. ఈ నేపథ్యంలో స్థిరమైన ప్రదర్శన జరిపే స్టాకులను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని కార్వీ బ్రోకింగ్‌ సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు స్టాకులను

ఇప్పుడే ఉద్యోగం.. అప్పుడే పొదుపా ?

Monday 20th May 2019

ప్ర: నేను కొంత కాలంగా ఎల్‌ అండ్‌టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇతర మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్‌ పనితీరు ఏమంత బాగా లేదు. అదే మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పర్వాలేదనే స్థాయిలో ఉంది. ఈ ఫండ్‌లో సిప్‌లను కొనసాగించమంటారా? ఆపేసి, వేరే మిడ్‌క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ మొదలు పెట్టమంటారా ? -రాకేశ్‌,

Most from this category