News


యూరప్‌ దేశాలకు నో ఎంట్రీ..ట్రంప్‌!

Thursday 12th March 2020
news_main1583987563.png-32421

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యూరప్‌ దేశాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణీకులపై నిషేధం విధించారు. చైనాలో పుట్టిన కోవిడ్‌-19(కరోనా వైరస్‌) చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తుండడం, అమెరికాలో వేగంగా విస్తరిస్తుండండంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం రాత్రి అమెరికా దేశ ప్రజలనుద్దేశించి టీవీలో మాట్లాడిన సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌  వెల్లడించారు. మరో నెలరోజులవరకు(30 రోజులు) యూరప్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అమెరికాలోకి అనుమతించరు. అయితే ఈ నిషేధం వాణిజ్యానికి వర్తించదని ట్రంప్‌ పేర్కొన్నారు. తాము అమెరికా ప్రజలను రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, మా ప్రభుత్వం దేశ ప్రజలకు పూర్తి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. కాగ ఈ నిషేధం యూకే, ఐర్లాండ్‌ వంటి దేశాలు మినహాయించి, మిగతా 26 యూరప్‌ దేశాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ జాబితాలో ఆస్ట్రియా, బెల్జియం, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, ఇస్టోనియా, ఫిన్‌లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌, హంగేరి, ఐస్‌లాండ్‌, ఇటలీ, లతీవియా, లిచెట్టిన్‌స్టీన్‌, లితువేనియా, లక్సెంబర్గ్‌, మాల్టా, నెదర్‌లాండ్స్‌, నార్వే, పోలండ్‌, పోర్చుగల్‌, స్లొవేకియా, స్లోవేనియా, స్పెయిన్‌, స్వీడన్‌, స్విట్జర్‌లాండ్‌లు ఉన్నాయి. కాగా  అమెరికాలో లీగల్‌గా శాశ్వత నివాసులుగా ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ నిషేధం వర్తించదు. మార్చి 13(శుక్రవారం) నుంచి  నిషేధం అమల్లోకి రానుంది.



You may be interested

చమురు ధరలకూ కరోనా కాటు

Thursday 12th March 2020

ప్రస్తుతం 5 శాతం పతనం యూరప్‌ దేశాల ప్రయాణాలపై అమెరికా నిషేధం కరోనాను ప్రపంచ మహమ్మారిగా పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో ఉత్పత్తి, విక్రయాలను పెంచనున్న యూఏఈ రెండు రోజుల మహా పతనం నుంచి కోలుకున్న ఒక్క రోజులోనే తిరిగి ముడిచమురు ధరలకు షాక్‌ తగిలింది. చైనాలో పుట్టి మొత్తం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇందుకు కారణంకావడం గమనార్హం. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 5 శాతం(1.8 డాలర్లు) దిగజారి 34 డాలర్ల దిగువకు

సెన్సెక్స్‌ 1739 పాయింట్లు , నిఫ్టీ 510 పాయింట్లు క్రాష్‌..!

Thursday 12th March 2020

10వేల మార్కును కోల్పోయిన నిఫ్టీ   34వేల దిగువన ప్రారంభమైన సెన్సెక్స్‌ 5-7శాతం నష్టపోయిన ప్రధాన ఇండెక్స్‌లు  కరోనా వైరస్‌ వ్యాధి భయాలు మరోసారి భారత స్టాక్‌ మార్కెట్‌ను ముంచేశాయి. ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్‌ గురువారం ఏకంగా 5శాతం నష్టంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 34వేల మార్కును, నిఫ్టీ 10వేల మార్కును కోల్పోయాయి. సూచీలైన సెన్సెక్స్‌ 1739 పాయింట్ల నష్టంతో 33958 వద్ద, నిఫ్టీ 510 పాయింట్లను కోల్పోయి 9, 948

Most from this category