News


పదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడ్‌

Thursday 1st August 2019
news_main1564633902.png-27460

దశాబ్దకాలం తర్వాత యుఎస్‌ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు, యుఎస్‌ ద్య్రవ్యోల్బణం తగ్గడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఫెడ్‌ తెలిపింది. కానీ మరింత రేట్ల కోత ఉండదనే సంకేతాన్ని ఇచ్చింది. అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ భయాలు, తగ్గుతున్న యుఎస్‌ ద్రవ్యోల్బణం దృష్ఠ్యా 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని తన తాజా రెండు రోజుల విధాన సమావేశం ముగింపులో ఫెడ్‌ పేర్కొంది. కాగా ఈ తగ్గింపు 50 బేసిస్‌ పాయంట్లవరకు ఉంటుందని చాలా వరకు విశ్లేషకులు అంచనా వేశారు. ఈ చర్య వలన ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటామని ఫెడ్‌ తెలిపింది. యు.ఎస్. ఆర్థిక విస్తరణకు ఈ చర్య ‘తగినదిగా’ అభిప్రాయపడింది. ఫెడ్‌ సమావేశం తర్వాత బెంచ్ మార్క్ ఎస్ అండ్‌ పి 500 ఇండెక్స్ నష్టపోయింది. బాండ్ల ధరలు పడిపోవడంతో యు.ఎస్. ట్రెజరీ సెక్యూరిటీలపై ఈల్డ్‌లు పెరిగాయి. పదేళ్ల నోటు ఈల్డ్‌లు సుమారు 2.04 శాతం ఉండగా, ఫెడ్ పాలసీ రేట్ల కోత వలన 2 ఏళ్ల నోట్ల ఈల్డ్‌లు 1.86 శాతానికి పెరిగాయి. యు.ఎస్. డాలర్ సూచి రెండేళ్ళలో అత్యధికంగా 0.20 శాతం పెరిగింది. 



You may be interested

40 పైసలు బలహీనపడిన రూపీ

Thursday 1st August 2019

 రేట్ల కోత కోత మరింతగా ఉండదనే సంకేతాన్ని ఫెడ్‌ ఇవ్వడంతో డాలర్‌ రెండేళ్లలో గరిష్ఠంగా బలపడింది. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో 40 పైసలు బలహీనపడి 69.20 వద్ద గురువారం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఉండడంతో పాటు, యుఎస్‌ ద్రవ్యోల్బణం తగ్గడంతో ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించింది. కానీ మరింతగా రేట్ల కోత ఉండదనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. గత సెషన్‌లో రూపీ డాలర్‌

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 1st August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు:- సవరించిన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) నేటి(ఆగస్ట్‌ 01) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సారి ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 10 బేసిస్‌పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. సన్‌ ఫార్మా:- జపాన్‌ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ అయినట్లు తెలిపింది. విప్రో:- షేర్ల బై బ్యాక్‌ను సెబీ ఆమోదం తెలిపింది. బై బ్యాక్‌ ఇష్యూ ఆగస్ట్‌ 14న ప్రారంభమై,

Most from this category