News


ఆల్ఫాబెట్‌ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌!

Wednesday 4th December 2019
news_main1575435404.png-30046

గూగుల్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుందర్‌ పిచాయ్‌, త్వరలో గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆల్ఫాబెట్‌ నాయకత్వ సీటు నుంచి తప్పుకుంటామని గూగుల్‌ వ్యవస్థాపకులు లారీపేజ్‌, సెర్గీబ్రిన్‌ ప్రకటించారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు వారు లేఖ రాశారు. గూగుల్‌తో పాటు ఆల్ఫాబెట్‌కు చెందిన ఇతర సంస్థలు మంచి ప్రదర్శన చూపుతున్నాయన్నారు. ఇకపై తాము మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను అట్టిపెట్టుకొని వేలాడాలనుకోవడం లేదన్నారు. ఇకపై గూగుల్‌, ఆల్ఫాబెట్‌కు ఇద్దరు సీఈఓలు అవసరం లేదని, అందువల్ల పిచాయ్‌నే మాతృసంస్థ సీఈఓగా ప్రమోట్‌ చేస్తున్నామని వివరించారు. తాము నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నా, బోర్డు మెంబర్లుగా చురుగ్గా వ్యవహరిస్తూ కంపెనీని కాపాడతామన్నారు. ఇదే లేఖలో సుందర్‌ కూడా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ నాయకత్వ మార్పు కంపెనీ పనితీరు, నిర్మాణంపై ఎలాంటి నెగిటివ్‌ ప్రభావం చూపదన్నారు. గూగుల్‌పై తాను ఎప్పటిలాగే ప్రత్యేక శ్రద్ధ కొనసాగిస్తానన్నారు. ఇదే సమయంలో ఆల్ఫాబెట్‌ సీఈఓగా దీర్ఘకాలిక లక్ష్యాలపై పనిచేస్తానన్నారు. సుందర్‌ తమతో దాదాపు 15ఏళ్లు పనిచేశారని, కంపెనీ ప్రతి అడుగులో తన ప్రమేయం ఉందని పేజ్‌, బ్రిన్‌ చెప్పారు. గూగుల్‌, ఆల్ఫాబెట్‌ను భవిష్యత్‌లోకి నడిపించేందుకు సుందర్‌ను మించిన వ్యక్తి ఎవరూ తమకు కనిపించలేదని ప్రశంసించారు. You may be interested

కొత్త ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Wednesday 4th December 2019

ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు బుధవారం ఉదయం సెషన్‌లో కొత్త జీవికాల గరిష్టాన్ని నమోదు చేసింది. బ్రోకరేజ్‌ సంస్థలు షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను పొడిగించడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.510.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. భవిష్యత్తులో బలమైన ఆదాయాలను ఆర్జించవచ్చనే అంచనాలతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఈ షేరుపై గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను మరో 12నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మంగళవారం బ్రోకరేజ్‌ సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా

భారత్‌ రేటింగ్‌ యథాతధం!

Wednesday 4th December 2019

ఎస్‌అండ్‌పీ రేటింగ్‌ ఏజన్సీ భారత సావరిన్‌ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఎస్‌ అండ్‌ పీ తెలిపిందని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతను చక్రవర్తి చెప్పారు. ఇటీవలే మూడీస్‌ సంస్థ భారత అవుట్‌లుక్‌ను స్టేబుల్‌ నుంచి నెగిటివ్‌కు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్‌అండ్‌పీ మాత్రం భారత్‌కు ఇచ్చిన బీబీబీమైనస్‌ రేటింగ్‌ను స్థిర అవుట్‌లుక్‌తో కొనసాగిస్తున్నట్లు తెలిపిందని చక్రవర్తి చెప్పారు. భారత్‌ దీర్ఘకాలిక వృద్ధిని సాధించగలదని ఎస్‌అండ్‌బీ

Most from this category