News


దుమ్ములేపిన మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఫేస్‌బుక్ షేర్లు

Wednesday 31st July 2019
news_main1564570564.png-27451

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ భయాలు ఈ ఏడాది మే లో పెరగడంతో అప్పుడు యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత యుఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఈ ఇండెక్స్‌ బాగా రాణించింది. ఇప్పుడీ ఇండెక్స్‌ 3,000 స్థాయికి పైన కొత్త రికార్డులను సృష్ఠిస్తోంది. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 శాతానికి పైగా వృద్ధి సాధించింది. ఈ ఇండెక్స్‌ ఈ ఏడాదిలో (ఈ ఏడాది ఇప్పటి వరకు) 4.2 ట్రిలియన్‌ డాలర్లను పొందిందని ఎస్ అండ్‌ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డేటా పేర్కొంది. 2019లో ఈ ఇండెక్స్‌ ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొని వృద్ధి సాధిస్తుండడానికి ప్రధానంగా రెండు రంగాల పాత్ర కీలకంగా ఉంది. అవి ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాగా రెండవది కమ్యూనికేషన్ సర్వీసెస్.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) సెక్టార్‌:  ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ వృద్ధి చెందడంలో, ఐటీ సెక్టార్‌ ముఖ్యమైన ఎక్సెంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌) ‘టెక్నాలజీ సెలెక్ట్ సెక్టార్ ఎస్‌పీడీఆర్‌ ఫండ్‌’ పాత్ర కీలకంగా ఉంది. ఈ ఏడాది ఇది 33 శాతం వృద్ధి సాధించింది. ఇది ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ వృద్ధి కన్నా అధికం కావడం గమనర్హం. ఈ ఇండెక్స్‌ రాబడులలో 25 శాతం ఈ ఫండ్‌ నుంచే వచ్చాయి. ఇందులో  ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పటి వరకు బాగా రాణించాయి. ఈ ఫండ్‌లోని కొన్ని ముఖ్యమైన కంపెనీలు..
    మైక్రోసాఫ్ట్, 2019లో ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ ర్యాలీకి బాగా సహాయపడింది. ఈ కంపెనీ షేర్లు  38 శాతం (ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు) పెరిగాయి. ఎస్‌ అండ్‌ పీ 500 మొత్తం లాభంలో  7 శాతం ఈ కంపెనీ వలనే రావడం గమనర్హం.  ఈ ఏడాది(2019 లో ఇప్పటివరకు) మైక్రోసాఫ్ట్ 292 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ను పొందింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్ 1.07 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
  టెక్‌ షేర్లలో ఆపిల్ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ ర్యాలీకి దోహదపడింది. ఈ ఇండెక్స్‌ వృద్ధిలో ఈ కంపెనీ వాటా 5 శాతం ఉండడం గమనర్హం. ఆపిల్‌ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 33 శాతం వృద్ధి సాధించాయి. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌కు అదనంగా ఈ ఏడాది 204 బిలియన్‌ డాలర్ల విలువ చేరింది. మొత్తంగా ఈ కంపెనీ మార్కెట్‌​ క్యాప్‌ 960.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 
   టెక్‌ రంగం నుంని  ఇంకో రెండు కంపెనీలు ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ లాభాలలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. వీసా సంస్థ స్టాక్ విలువ ఈ ఏడాది (ఇప్పటి వరకు) 38 శాతం పెరిగింది. ఎస్‌ అండ్‌ పీ 500 లాభాలలో 3 శాతం వాటా ఈ కంపెనీ కలిగి ఉంది. ఈ ఏడాది ఈ కంపెనీ 107 బిలియన్ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ను పొందింది. మొత్తంగా ఈ కంపెనీ మార్కెట్‌ విలువ 394.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
    ఈ కంపెనీతో పాటు మాస్టర్ కార్డ్ కూడా ఈ ఏడాది బాగా రాణించింది. ఈ కంపెనీ స్టాక్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు 47 వృద్ధి సాధించింది. ఈ కంపెనీ ఈ ఏడాది  92 బిలియన్‌ డాలర్ల అదనపు మార్కెట్‌ క్యాప్‌ను పొందగలిగింది. మొత్తంగా ఈ కంపెనీ మార్కెట్‌ విలువ 280.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ మొత్తం లాభాలలో ఈ కంపెనీ 2.5 శాతం వాటా కలిగివుంది. 

కమ్యూనికేషన్ సేవలు: కమ్యూనికేషన్ సర్వీసెస్ రంగంలో, ముఖ్యమైన ఈటీఎప్‌ ‘కమ్యూనికేషన్ సర్వీసెస్ సెలెక్ట్ సెక్టార్ ఎస్‌పీడీఆర్‌ ఫండ్’ ఈ ఏడాది ఇప్పటి వరకు 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎస్ అండ్‌ పి 500 లాభాలలో ఫేస్‌బుక్‌ వాటా కీలకంగా ఉంది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 50 శాతం వృద్ధి సాధించాయి. అంతేకాకుండా ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌ మొత్తం లాభాలలో ఈ కంపెనీ వాటా 5 శాతంగా ఉంది. గోప్యత, నియంత్రణ ఆందోళనలు ఉన్నప్పటికీ ప్రకటనదారులు ఈ సైట్‌ వైపు క్యూ కట్టడం విశేషం. ఫేస్‌బుక్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 562 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 

   వాల్ట్ డిస్నీ , ఎస్‌ అండ్‌ పీ 500 లాభాలలో 3 శాతం వాటా కలిగి ఉంది. కమ్యూనికేషన్ సర్వీసెస్ సెక్టార్‌లో రెండ అతిపెద్ద సంస్థగా నిలిచింది.  ఈ మీడియా దిగ్గజం స్టాక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 33 శాతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 260.8 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనర్హం.

గూగుల్‌కు చెందిన  ఆల్ఫాబెట్  ఈ ఏడాది మార్కెట్ లాభాలలో గణనీయమైన పాత్రను కలిగి ఉంది.  ఈ కంపెనీ షేరు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 18 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఈ కంపెనీ విలువ 63 బిలియన్ డాలర్లు పెరిగి 850.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతేకాకుండా ఎస్ అండ్‌ పి 500 లాభాలలో 2 శాతం వాటాను కలిగి ఉంది.



You may be interested

ఈ స్థాయిల్లోనూ పెట్టుబడులకు సౌకర్యమే...: విలియం ఓనీల్‌

Thursday 1st August 2019

బ్రోడర్‌ మార్కెట్‌ను పరిశీలిస్తే ప్రస్తుతానికి నిఫ్టీలో 19 కంపెనీలు 200డీఎంఏకు పైన ట్రేడ్‌ అవుతుంటే... నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 కంపెనీల్లో 35 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 కంపెనీల్లో 27 శాతం వాటి 200 డీఎంఏకు దిగువన ట్రేడ్‌ అవుతున్నాయని విలియం ఓ నీల్‌ ఇండియా రీసెర్చ్‌ డైరెక్టర్‌ విపిన్‌ ఖరే తెలిపారు. కేవలం కొన్ని స్టాక్స్‌ మాత్రమే మార్కెట్ల మొత్తం వ్యాల్యూషన్‌ను నడిపిస్తున్న దానికి ఇది సంకేతమన్నారు. మార్కెట్‌

ఆటో స్టాకులను ఏం చేద్దాం?

Wednesday 31st July 2019

ఏడాదిలో భారీగా పతనమైన పలు షేర్లు అమ్మకాల్లో క్షీణతే అసలు కారణం ఏడాది కాలంగా దేశీయ ఆటో రంగాల షేర్లు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. లిక్విడిటీ కొరత కారణంగా అమ్మకాలపై నెగిటివ్‌ ప్రభావం పడడం ఆటో షేర్లను కుంగదీస్తోంది. దీనికితోడు నియంత్రణా పరమైన నిబంధనల మార్పులు, రిజిస్ట్రేషన్‌ ధరల పెరుగుదల, మందగమనంలాంటివి ఆటో కంపెనీలను ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో ఏడాదిలో మొత్తం 16 ఆటో, ఆటో అనుబంధ రంగాల కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో

Most from this category