చమురు ఉత్పత్తి కోత కొనసాగింపు!
By Sakshi

సౌదీతో రష్యా ఒప్పందం ఒపెక్‌తో కుదుర్చుకున్న చమురు ఉత్పత్తి తగ్గింపు ఒప్పంద కాల పరిమితిని 6 నుంచి 9 నెలల వరకు పెంచాలనే నిర్ణయాన్ని రష్యా-సౌది అరేబియా ఇరుదేశాలు అంగీకరించాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం తెలిపారు. ప్రస్తుత ఒప్పందం ఇప్పుడున్న పద్ధతిలోనే, అంతే పరిమాణంలో కొనసాగుతుందని పుతిన్ సౌది అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో భేటి అనంతరం ప్రకటించారు. రోజుకు 12 లక్షల బ్యారెల్ చమురు ఉత్పత్తి తగ్గింపు ఒప్పందం జూన్ 30తో ముగియనుండడంతో చమురు ఎగుమతి దేశాల సమాహారం(ఒపెక్), రష్యా దాని కూటమి దేశాలు(ఒపెక్ ప్లస్) ఈ విషయంపై చర్చించడానికి జులై 1-2న సమావేశం కానున్నాయి.
‘మేము ఈ కాలపరిమితి పెరుగుదలను సౌది అరేబియాతో పాటు కలిసి అంగీకరిస్తున్నాం. ఈ పెరుగుదల 9 నెలలుగా ఉండవచ్చు’ అని పుతిన్ అన్నారు. ఒక వేళ కాలపరిమితి 9 నెలలు పెరిగితే ఈ ఒప్పందం మార్చి 2020 వరకు ఉండనుంది. 2017లో ఏర్పడిన ఒపెక్ రష్యా డీల్ ఇప్పటికే రష్యా బడ్జెట్ ఆదాయాన్ని 7ట్రిలియన్(110 బిలియన్ డాలర్లు) పెంచిందని ఒపెక్-రష్యా డీల్ వ్యూహకర్త, రష్యాన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చీఫ్ ఎక్సిక్యూటివ్ కిరిల్ ద్విమిత్రివ్ అన్నారు.
‘ఒపెక్ ప్లస్ దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యం వలన చమురు ఉత్పత్తిని తగ్గించడం లేదా పెంచడం అనేది మార్కెట్ డిమాండ్ ఆధారంగా జరుగుతుంది. ఈ రంగంలో పెట్టుబడుల వృద్ధిని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది’ అని ఆయన అన్నారు. అంతర్జాతీయ మందగమనం, అమెరికా చమురు నిల్వల వలన చమురు డిమాండ్ తగ్గింది.
You may be interested
క్రూడ్ ధరలో పతనమా? పరుగులా?
Saturday 29th June 2019రెండు సమావేశాలు నిర్ధారిస్తాయి గత రెండు వారాలుగా క్రూడాయిల్ ధరలు స్వల్పరేంజ్‌లో తిరుగుతున్నాయి. చైనాతో వాణిజ్య చర్చలు పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా జీ 20 సదస్సులో ప్రకటించింది. ఈ ప్రకటన సక్రమ కార్యరూపం దాల్చకపోతే మిడ్‌టర్మ్‌లో ముడిచమురు ధరలు భారీగా పతనమైతాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. జపాన్ మీటింగ్‌లో ట్రంప్, గ్సిపింగ్ మధ్య అర్ధవంతమైన చర్చలు జరగాలని, వాణిజ్య యుద్ధం నిలిపివేసే దిశగా కచ్చితమైన చర్యలు ప్రకటించాలని ఇన్వెస్టర్లు కోరుకుంఉటన్నారు. కేవలం
ప్రజారంజకంగానే బడ్జెట్ : మార్కెట్ విశ్లేషకులు
Saturday 29th June 2019నిఫ్టీ ఆల్‌టైం హైని అందుకోవడం కష్టమే.. వచ్చేవారంలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రజారంజకంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, రైతులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారీ ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఇదే ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ మార్కెట్ వర్గాలను మెప్పించకపోవడంతో ఈసారి బడ్జెట్‌పై సాధారణ ప్రజలు బడ్జెట్‌పై బారీగా ఆశలు పెట్టుకున్నారు. జూన్ 05న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశీయ ఆర్థిక వ్యవస్థకు