News


ఖాసీం మృతి.. మార్కెట్‌పై ప్రభావమెంత?

Friday 3rd January 2020
news_main1578046531.png-30652

ఇరాన్‌కు చెందిన టాప్‌ మిలటరీ ఆఫీసర్‌ ఖాసీం సొలైమని అమెరికా వాయు దాడిలో మరణించడంతో మధ్యప్రాచ్యం సహా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లు ఈ పరిణామంతో ఒక్కమారుగా టెన్షన్‌ పడ్డాయి. తత్ఫలితంగా ఆసియా, యూరప్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలోకి మరలాయి. దేశీయ మార్కెట్లు కూడా ఈ ఘటన పట్ల నెగిటివ్‌గా స్పందించాయి. నిఫ్టీ ఒక దశలో కీలక 12200 పాయింట్ల దిగువకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఖాసీం మృతి కేవలం ఈక్విటీ మార్కెట్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రభుత్వ విత్త లక్ష్యాలను సైతం దెబ్బతీయగలదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సొలైమని మృతి వార్తతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర భగ్గుమంది. రూపీ మారకం విలువ పతనమైంది. ఇవన్నీ విత్తలోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశాలు. మరోవైపు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోయింది. దేశీయ చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులపై ఆధారపడ్డ నేపథ్యంలో తాజా ఘటన మనకు కొత్త తలనొప్పులు తెస్తుందని ఎకనమిస్టులు హెచ్చరిస్తున్నారు. ఖాసీం మృతికి బదులు తీర్చుకుంటామని ఇరాన్‌ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ కలిసి చమురు ధరను మరింత వేడెక్కించే ప్రమాదం పొంచిఉంది. 
మళ్లీ పెద్ద స్టాకులే దిక్కా?
తాజా ఘటనతో ఇన్వెస్టర్లు మరలా రక్షణాత్మక ధోరణిలోకి మారిపోతారని, చిన్నస్టాకులను వదిలి పెద్ద స్టాకుల్లో పెట్టుబడులకు మొగ్గుచూపుతారని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చమురు ధర పెరిగి క్యాడ్‌ మరింత విసృతమవుతుందన్న అంచనాలతో ఈక్విటీలు మరింత కుంగవచ్చంటున్నారు. తాజా దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ నేరుగా యుద్ధానికి దిగవచ్చని లేదా మధ్యప్రాచ్యంలోని చిన్నాచితక ప్రాంతాలపై దాడులు జరిపి యూఎస్‌, దాని మిత్రపక్షాలను చికాకు పెట్టవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా పర్షియన్‌ గల్ఫ్‌లో కీలక సరఫరా మార్గాలను దెబ్బతీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచ చమురు సరఫరా చిక్కుల్లో పడవచ్చు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు దేశీయ మార్కెట్‌ నుంచి వెనక్కు మరలిపోతే మరింత సంక్షోభం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎఫ్‌ఐఐల కదలికలను బాండ్‌ ఈల్డ్డ్స్‌ సూచిస్తుంటాయి. ఇవి పెరిగాయంటే ఎఫ్‌ఐఐలు వెనక్కు పోతున్నారని భావించవచ్చు. ఇరాన్‌లోని టాప్‌ 3 మిలటరీ లీడర్లలో ఒకరైన ఖాసీంను చంపడం ద్వారా ట్రంప్‌ దశాబ్దకాలంగా వేడెక్కి ఉన్న పరిస్థితిన మరింత ఉద్రిక్తపరిచారని నిపుణులు భావిస్తున్నారు. ఇది మరింత పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చంటున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే ఇరాన్‌ ప్రతిస్పందన కోసం వేచిచూడాల్సిఉంటుంది.You may be interested

కరిగిన రూపాయి - ఐటీ షేర్లకు లాభాలు

Friday 3rd January 2020

మార్కెట్‌ నష్టాల్లో ముగిసినప్పటికీ.. శుక్రవారం ఐటీ షేర్లు మాత్రం లాభాల బాట పట్టాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ నెల రోజుల కనిష్టానికి పతనం కావడం ఐటీ షేర్లకు కలిసొచ్చినట్లు విశ్లేషకులంటున్నారు. మధ్యప్రాచ్య దేశంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 3నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఫలితంగా ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ నెల రోజుల కనిష్టానికి దిగివచ్చింది. రూపాయి బలహీనతతో డాలర్ల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ఐటీ

2020లో ఐటీ స్టాక్స్‌ జోష్‌?

Friday 3rd January 2020

ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌ ఆకర్షణీయంకాదు బీమా రంగ కౌంటర్లు భేష్‌ కమోడిటీలకూ మంచి రోజులు? బడ్జెట్‌లో మరీ ప్రతికూలమైన అంశాలు లేకుంటే..  ఆర్థికంగా సైక్లికల్‌ రికవరీని ఆశించవచ్చునంటున్నారు టీసీజీ ఏంఎసీ సీఐవో, ఎండీ చక్రీ లోకప్రియ. రానున్న ఏడాది లేదా రెండేళ్ల కాలంలో మిడ్‌ క్యాప్స్‌ ర్యాలీ నిలబడాలంటే ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ట్రెండ్‌ మారుతోంది.. చార్టుల

Most from this category