News


తగ్గింపునకు తొందరలేదు!

Wednesday 26th June 2019
news_main1561532118.png-26579

వడ్డీరేట్లపై పావెల్‌ వ్యాఖ్య
నీరసించిన మార్కెట్లు
వడ్డీరేట్ల తగ్గింపు అంశంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తామని యూఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. యూఎస్‌ విదేశీ వ్యవహారాల కౌన్సిల్‌ ముందు పావెల్‌ ప్రసంగించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు, ట్రేడ్‌వార్‌ తదితర అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. విధాన నిర్ణయాల్లో మార్పు తీసుకురావాలా? వద్దా? అనే విషయమై ఏడాది ఆరంభం నుంచి తాము ఓపిగ్గా వేచిచూసే ధోరణిలోనే ఉన్నామని చెప్పారు. ఎకనమిక్‌ అవుట్‌లుక్‌కు సంబంధించి వస్తున్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, తదనుగుణంగా నిర్ణయాలుంటాయని చెప్పారు. బలమైన లేబర్‌ మార్కెట్‌, ద్రవ్యోల్బణం తన లక్ష్యానికి దగ్గరగా ఉండడమనే రెండు అంశాల ప్రాతిపదికగా నిర్ణయాలుంటాయన్నారు. స్వల్పకాలిక రాజకీయ వత్తిళ్లకు ఫెడ్‌ తలొగ్గదన్నారు. ఇది తమ స్వీయప్రతిపత్తి అన్నారు. ఇటీవల కాలంలో ట్రంప్‌ పలుమార్లు ఫెడ్‌ నిర్ణయాలపై విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా పావెల్‌ కామెంట్లు రేట్ల తగ్గింపుపై ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గమని చెప్పినట్లున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పావెల్‌ తాజా వ్యాఖ్యలతో గతరాత్రి యూఎస్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. బుధవారం ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. దేశీయ మార్కెట్లు స్వల్ప లాభంతో కొనసాగుతున్నాయి. 



You may be interested

పాత కారు.. యమా జోరు!!

Wednesday 26th June 2019

 ఏడాదిలో చేతులు మారినవి 40 లక్షలు కొత్త వాటిని మించిన ప్రీ ఓన్డ్‌ విక్రయాలు తక్కువ ధరకే అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం దేశంలో మారుతున్న కస్టమర్ల ధోరణి ఏటా 6-7 శాతం వృద్ధితో పురోగతి మరింత ఫోకస్‌ పెడుతున్న తయారీ కంపెనీలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ల కంటే పాత వాటికే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2018-19లో 33.7 లక్షల కొత్త కార్లు రోడ్డెక్కగా... అదే సమయంలో ఏకంగా 40 లక్షల పాత

ఐసీఐసీఐ బ్యాంక్‌ రికార్డు

Wednesday 26th June 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సం‍స్థ ఐసీఐసీఐ బ్యాంకు షేరు బుధవారం ఏడాది గరిష్టాన్ని తాకింది. నేడు ఈ షేరు బీఎస్‌లో రూ.432.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా ఈ షేరు 1.25శాతం లాభపడి రూ.438.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర .438.90 ఏడాది గరిష్టస్థాయి కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో రిటైల్‌

Most from this category