News


కశ్మీర్‌ ఇష్యూతో పాక్‌ స్టాక్‌ మార్కెట్‌ కకావికలం!

Friday 9th August 2019
news_main1565343016.png-27670

భారత్‌తో వాణిజ్య సంబంధాల రద్దుతో వెల్లువెత్తిన అమ్మకాలు
ఐదేళ్ల కనిష్ఠాలకు సూచీలు
వరుసగా ఆరోరోజు కూడా పాకిస్థాన్‌ స్టాక్‌ మార్కెట్లో భారీ పతనం నమోదయింది. దీంతో పాక్‌ స్టాక్‌ ఇండెక్స్‌ కేఎస్‌ఈ 100 ఐదేళ్ల కనిష్ఠస్థాయికి చేరింది. ఒకదశలో ఇంట్రాడేలో 29400 పాయింట్ల కనిష్ఠాలను తాకిన కేఎస్‌ఈ చివరకు 29800 పాయింట్ల వద్ద సెటిలైంది. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల రద్దు ప్రకటన తర్వాత పాక్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మందగమన ప్రభావంతో స్టాక్స్‌ పడిపోతున్నాయని ఆ దేశ ఎకనమిస్టులు పైకి చెబుతున్నా, ప్రధానంగా ఇండియాతో సంబధాలు తెంచుకోవడమే తాజా పతనానికి ప్రధాన కారణమని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కశ్మీర్‌కు సంబంధించి 370 ఆర్టికిల్‌ను భారత్‌ సుషుప్తావస్థలో పెట్టడంతో ఆ దేశంతో అన్నిరకాల ద్వైపాక్షిక సంబంధాలు తెంచుకోవాలని పాక్‌ నిర్ణయించుకుంది. అయితే అసలే నానా అగచాట్లు పడుతున్న పాక్‌ ఎకానమీపై తాజా నిర్ణయం మరింత నెగిటివ్‌ ప్రభావం చూపుతుందన్న భయాలు పెరిగి స్టాక్స్‌లో అమ్మకాలు ఎక్కువయ్యాయి. కశ్మీర్‌ అంశం, సంబంధాల రద్దుతో విత్తలోటు తగ్గిందన్న పాజిటివ్‌ వార్తను కూడా ఇన్వెస్టర్లు పట్టించుకోలేదని పాక్‌ ఎకనమిస్టు అహసన్‌ మెహంతి వాపోయారు. అసలే పాక్‌ స్థూల ఆర్థిక గణాంకాలు చాలా వరెస్ట్‌గా తయారవడంతో అక్కడ ఎంఎఫ్‌లు విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నాయి. ఇదే సమయంలో తాజా నిర్ణయం ఈ అమ్మకాలను మరింత ఉధృతం చేసింది. గురువారానికి పాక్‌ కేఎస్‌ఈ100 సూచీ 29737 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరు రోజుల్లో ఈ సూచీ దాదాపు 7 శాతం పతనమైంది. 



You may be interested

రెండో రోజూ లాభాలే..!

Friday 9th August 2019

11100పైన ముగిసిన నిఫ్టీ 254 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు అదనపు పన్ను మినహాయింపవచ్చనే అంచనాలతో మార్కెట్‌ రెండోరోజూ లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణం కూడా మన ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్‌ 254.55 పాయింట్ల లాభంతో 37,581.91 వద్ద, నిఫ్టీ 77.20 పాయింట్లు పెరిగి 11,109.65 వద్ద ముగిశాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ రియల్టీ రంగ షేర్లకు

నిరాశ ఫలితాలు..14% పతనమైన ఎన్‌బీసీసీ

Friday 9th August 2019

నేషనల్‌ బుల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పోరేషన్‌ (ఎన్‌బీసీసీ) ఇండియా క్యూ1 ఫలితాలు మార్కెట్లను నిరాశపరచడంతో ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో శుక్రవారం మధ్యాహ్నం 2.25 సమయానికి 14.09 శాతం నష్టపోయి ఐదేళ్ల కనిష్టానికి సమీపంలో (రూ. 34.15 వద్ద) ట్రేడవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ విభాగంలో మందగమనం వలన, ఆర్థిక సంవత్సరం 2019 క్యూ1 త్రైమాసికంలో ఎన్‌బీసీసీ నికర లాభం 38 శాతం తగ్గి, రూ. 51 కోట్లుగా నమోదైంది. కాగా గత

Most from this category