News


చమురు ఉత్పత్తి కోతలకే ఒపెక్‌ నిర్ణయం?!

Saturday 22nd June 2019
news_main1561217914.png-26505

యూఎస్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా యూఎస్‌ డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడం, ప్రతిగా యూఎస్‌ ఒకదశలో వైమానికదాడులకు సిద్ధం కావడం, ఆఖరు నిమిషంలో ట్రంప్‌ యద్ధాన్ని వద్దనుకోవడం.. లాంటి పరిణామాలు మరింత టెన్షన్‌ పెంచుతున్నాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలు కూడా క్రూడాయిల్‌ ధరలు పెరిగేందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వియన్నాలో జరిగే ఒపెక్‌ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. జూలై1-2ల్లో ఈ సమావేశం జరగనుంది. ఈయూ, మెక్సికో, చైనాలతో ట్రంప్‌ వాణిజ్య ఘర్షణలు ఈ ఏడాదిలో క్రూడాయిల్‌ ధరలు పతనమయ్యేందుకు దోహదం చేసాయి. కానీ ప్రస్తుత మధ్యాసియా పరిస్థితులు క్రూడ్‌ ధరలు కోలుకునేలా చేస్తున్నాయి. పతనమైతున్న క్రూడ్‌ ధరలను అదుపు చేసేందుకు ఉత్పత్తిలో కోత విధించాలని గతంలో ఒపెక్‌ నిర్ణయించింది.

ఈ ఏడాది అంతర్జాతీయ చమురు డిమాండ్‌ గత అంచనాల కన్నా తక్కువగా ఉంటుందని ఒపెక్‌ భావిస్తోంది. ఐఈఏ సైతం తన డిమాండ్‌ వృద్ధి అంచనాలను తగ్గించింది. పెట్రోకెమికల్‌ పరిశ్రమ యూరప్‌వ్యాప్తంగా మందగమనం ఎదుర్కొంటోంది. ఉత్తరార్ధంలో ఉష్ణోగ్రతలు అనుకున్నదానికన్నా తక్కువగా నమోదుకావడం, యూఎస్‌లో ఎనర్జీ డిమాండ్‌ను క్షీణింపజేస్తోంది. మరోవైపు యూఎస్‌ క్రూడ్‌ ఉత్పత్తి వేగంగా పెరుగుతోంది. అందువల్ల మిడ్‌టర్మ్‌లో క్రూడ్‌ ధరలు మరింత తగ్గుతాయన్న అంచనాలున్నాయి. ఐఈఏ సైతం బ్రెంట్‌ ధర అంచనాలను తగ్గించింది. అందువల్ల తాత్కాలిక రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా క్రూడ్‌ ధర పెరుగుతున్నా, అంతర్లీనంగా బేరిష్‌గానే ఉంటుందని నిపుణుల భావన. ఈ నేపథ్యంలో ఒపెక్‌ తన ఉత్పత్తికోతలను కొనసాగించాలని నిర్ణయించుకునేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌ 30న గత కోతల గడువు ముగుస్తుంది. ఆయిల్‌ మార్కెట్లో స్థిరత్వం వచ్చేవరకు తాము తగిన చర్యలు తీసుకుంటామని సౌదీ చెబుతోంది. అందువల్ల ఈ ఏడాది చివర వరకు చమురు ఉత్పత్తి కోతలు కొనసాగవచ్చని ఎక్కువమంది నిపుణుల అంచనా. సభ్యదేశాల మధ్య కోతల కొనసాగింపునకు సంబంధించి అసంతృప్తి ఉన్నా, చివరకు అందుకు అంగీకరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. You may be interested

భిన్న దారుల్లో బంగారం-మెటల్స్‌

Sunday 23rd June 2019

బంగారం కూడా బేస్‌మెటల్స్‌లో ఒకటి. మరి  మిగిలిన లోహాల ధరలు కరెక్షన్‌లోనే ఉండగా, బంగారం మాత్రం నూతన గరిష్టాల దిశగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఎందువల్ల...? దీనిపై మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ అర్పన్‌ షా తన అభిప్రాయాలను తెలియజేశారు.   ‘‘నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2018 జనవరిలో 4,200 స్థాయిల్లో గరిష్టాన్ని నమోదు చేసింది. అప్పటి నుంచి ఏడాదిన్నరగా దిద్దుబాటు క్రమంలో ఉంది. గరిష్ట స్థాయిలను నమోదు చేసిన తర్వాత ఈ

వచ్చే వారం కీలకం!

Saturday 22nd June 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా గతంలో భావించినట్లే దేశీయ మార్కెట్లు ఈ వారం కూడా భారీ ర్యాలీకి పెద్దగా మొగ్గు చూపలేదు. పరిమిత శ్రేణిలో కదలాడుతున్న నిఫ్టీ ఎప్పటిలాగే 11840- 11880 పాయింట్ల వద్దకు రాగానే వెనక్కు మరలింది. దీంతో ఈ జోన్‌లో డబుల్‌టాప్‌ ఏర్పడినట్లయింది. నిఫ్టీ వారం మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా చివరకు నష్టాల్లోనే ముగిసింది. అయితే నిఫ్టీ అటు భారీ నష్టాల్లోకి కానీ, ఇటు భారీ లాభాల్లోకి కానీ

Most from this category