News


బేర్‌ గుప్పిట్లోనే ముడిచమురు!

Wednesday 7th August 2019
news_main1565170761.png-27612

ఆయిల్‌ మార్కెట్‌ నిపుణురాలు వందనా హరి అంచనా
ప్రపంచ వృద్ధి గతేడాది కన్నా మరింత మందగించవచ్చన్న అంచనాల నేపథ్యంలో క్రూడాయిల్‌లో షార్ట్‌ సైడ్‌ ఉండడమే మంచిదని ప్రముఖ అనలిస్టు వందనా హరి అభిప్రాయపడ్డారు. ట్రేడ్‌వార్‌ కారణంగా డిమాండ్‌ వృద్ధిపై ఏడాదికేడాది ఆందోళనలు పెరిగిపోతున్నాయన్నారు. ముఖ్యంగా గతవారం నుంచి అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు మరింత సంకటంగా తయారయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముడిచమురు డిమాండ్‌లో పెరుగుదల ఆశించలేమని చెప్పారు. అందువల్ల క్రూడ్‌ మార్కెట్లో షార్ట్‌సైడ్‌ ఉండడం మంచిదని సూచించారు. తాజాగా బ్రెంట్‌ క్రూడాయిల్‌ కీలకమైన 60 డాలర్ల దిగువకు చేరింది. దీంతో ఈ ఏడాది క్రూడ్‌ లాభాలన్నీ దాదాపు ఆవిరైనట్లే. అంతర్జాతీయ ఆర్థిక ఇక్కట్లు మంత్రం వేసినట్లు మాయం అయ్యే ఛాన్సుల్లేనందున క్రూడ్‌ డిమాండ్‌ పెరగడం కూడా కలేనని ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఫెడ్‌, ఈసీబీ, ఆర్‌బీఐలాంటి కేంద్రబ్యాంకులు మానిటరీ పాలసీ సడలీకరణకు దిగుతున్నాయి. అయితే ఈ మార్పు ఒక్కసారిగా అంతర్జాతీయ ఆర్థిక కదలికల్లో వేగం పెంచుతుందన్న ఆశలు ఆయిల్‌ మార్కెట్లో కనిపించడంలేదు. అందువల్ల చమురుపై బేరిష్‌ ఒత్తిడి కొనసాగుతుందని, యూఎస్‌, చైనా మధ్య ట్రేడ్‌వార్‌ కొనసాగినంతకాలం ఇంతేనని వందనా హరి విపులీకరించారు.
60 డాలర్ల దిగువకు..
బుధవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌క్రూడ్‌ ధర 60 డాలర్ల దిగువన 58.70 డాలర్ల వద్ద కదలాడుతోంది. ట్రేడ్‌వార్‌ ఆందోళనలతో క్రూడాయిల్‌ ధర సన్నగిల్లింది. యూఎస్‌ ఆయిల్‌ ఇన్వెంటరీల్లో క్షీణత నమోదయిందన్న వార్తలు క్రూడ్‌ ధర పతనాన్ని కొంతమేర అడ్డుకున్నాయి. మరోవైపు డబ్యు‍్లటీఐ క్రూడ్‌ దర 53.43 డాలర్ల వద్ద ఉంది. చైనాపై కొత్త ఆంక్షలు విధిస్తామన్న ట్రంప్‌ ప్రకటనతో గతవారం క్రూడ్‌ ధర దాదాపు 9 శాతం క్షీణించింది.  బుధవారం సాయంత్రానికి ఈఐఏ అధికారిక చమురు గణాంకాలు వెలువడతాయి. 



You may be interested

ఆర్‌బీఐకి ఆందోళన లేదు: అబీక్‌ బారువా

Wednesday 7th August 2019

‘ఆర్థిక వ్యవస్థ మందగమనంలో చిక్కుకుందని, దీనిపై భయాందోళనలతో ఉన్నామనే విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పకనే చెప్పారు. కానీ ఈ మందగమనం లోతుగా లేదనే విషయం, ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్ల రేట్‌ కట్‌ చేయడంతో అర్థమవుతుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ ముఖ్య ఆర్థికవేత్త అభీక్‌ బారువా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..    ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్ అంతర్జాతీయ ఫోరంలో ప్రసంగించిన తర్వాత

ఫలితాల ఎఫెక్ట్‌.. 52 వారాల కనిష్టానికి ఎం అండ్‌ ఎం

Wednesday 7th August 2019

మహీంద్రా అండ్ మహీంద్రా జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో, ఏడాది ప్రాతిపదికన 80 శాతం నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ, ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 లో రూ. 2,260 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అసాధారణ లాభం(ఆస్తులు విక్రయం మొ.) రూ. 1,367 కోట్లు ద్వారా, ఈ కంపెనీ నికర లాభం గణనీయంగా

Most from this category