News


మధ్యప్రాచ్య ఘటనలు.. మనకెంత ప్రమాదకరం?

Saturday 4th January 2020
news_main1578117956.png-30671

ముడిచమురు ధర పెరుగుదలతో పొంచిఉన్న విత్తలోటు ముప్పు
ఇరాన్‌ జనరల్‌ను అమెరికా డ్రోన్‌ సాయంతో హత్య చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. శుక్రవారం ముడిచమురు ధరలు ఒక్కమారుగా దూసుకుపోయాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు అటుతిరిగి ఇటుతిరిగి మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్‌కు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. దాదాపు 80 శాతం మేర ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన ఇండియాకు తాజా సంఘటనలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇరాన్‌ సంక్షోభం క్రమంగా ముడిచమురు ధరకు రెక్కలు తెస్తుందన్న అంచనాలు భారత్‌కు భయాన్ని సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఇండియా వీఐఎక్స్‌ ఒక్కమారుగా నాలుగునెలల గరిష్ట పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా విత్తలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ముడిచమురు ధర పెరగడం ఈ టార్గెట్‌ మిస్సయేందుకు కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. బ్రెంట్‌ క్రూడ్‌ ప్రస్తుతం 68-69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తాజా ఘటనపై ఇరాన్‌ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలని, ఈ స్పందన ఆధారంగా చమురు ధరల కదలికలుంటాయని చమురు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశ చమురు దిగుమతుల్లో 60 శాతం మధ్యప్రాచ్యం నుంచే వస్తున్నాయి. ఇరాన్‌ పరిణితితో స్పందిస్తే చమురు ధరలకు రెక్కలు రావని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. చమురు ధరలు ఇకపై పెరిగిన కొద్దీ భారత్‌కు నెగిటివ్‌ అని, అలాంటప్పుడు ప్రభుత్వం విత్త పరిమితులకు లోబడి వ్యయాలు చేయాల్సిఉంటుందని, ఇది వృద్ధిపై ప్రభావం చూపుతుందని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ చెప్పారు. చమురు ధరల పెరుగుదల రూపాయి బలహీనతకు, విత్తలోటు పెరిగేందుక దోహదం చేస్తుందని డీసీబీ బ్యాంక్ ప్రతినిధి శ్రీశాంత చెప్పారు. వృద్ది మందకొడిగా ఉన్న సమయంలో బాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌పై ప్రభావం పడడం ఎకానమీని దెబ్బతీస్తుందన్నారు. మరోవైపు బాండ్‌ ఈల్స్స్డ్‌ శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఆర్‌బీఐ బాండ్‌ బయింగ్‌ కార్యక్రమం ఉన్నందున బాండ్‌ ఈల్డ్స్‌ దిగిరావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

యూఎస్‌, అమెరికా పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగితే తప్ప ప్రస్తుతానికి మార్కెట్లకు వచ్చిన ప్రమాదం ఏమీ ఉండదని కొందరు నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల ఓఎంసీలకు నెగిటివ్‌ అని, తాజా సంక్షోభంతో ఇన్వెస్టర్లు తిరిగి లార్జ్‌క్యాప్స్‌ వైపే మొగ్గు చూపవచ్చని ప్రభుదాస్‌ లీలాధర్‌ ప్రతినిధి అజయ్‌ బోడ్కే చెప్పారు. మార్కెట్‌పై ఇరాన్‌ ఉద్రికత్తల ప్రభావం తెలుసుకునేందుకు బాండ్‌ ఈల్డ్స్‌ను పరిశీలించాలని, ఈల్డ్స్‌ పెరగడం ఈక్విటీలకు నెగిటివ్‌ అని చెప్పారు. ఇరాన్‌, యూఎస్‌ యుద్ధానికి దిగితే ప్రపంచ జీడీపీపై 0.3 శాతం నెగిటివ్‌ ప్రభావం పడుతుందని, ఇది ట్రేడ్‌వార్‌కు సమానమని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌ వివరించింది. వర్ధమాన దేశాల్లో చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం కట్టుతప్పేందుకు, తద్వారా ఎకానమీలో మందగమనానికి దారితీస్తుందని హెచ్చరించింది. వర్ధమాన మార్కెట్లలో తాజా సంక్షోభంతో ఎక్కువగా టర్కీ ప్రభావితం కావచ్చని, ఇండియాకు కూడా ఇబ్బందులుంటాయని పేర్కొంది. యూఎస్‌, ఇరాన్‌ పూర్తి స్థాయి యుద్ధానికి దిగే ఛాన్సులు చాలా తక్కువని నిపుణులు భావిస్తున్నారు. వచ్చేవారంలో ఇరాన్‌ ప్రతిస్పందనను బట్టి మార్కెట్‌ తదుపరి కదలికలుంటాయని అంచనా. ఈ విషయంలో ఇరాన్‌ స్పందన ప్రమాదకరంగా లేకుంటే, సోమవారం బాండ్‌ బయింగ్‌ కార్యక్రమం నేపథ్యంలో దేశీయ సూచీల్లో బ్యాంకు స్టాకులు మరోమారు మెరిసే అవకాశాలున్నాయి. You may be interested

బుల్స్‌కు 12100 పాయింట్లు కీలకం!

Saturday 4th January 2020

సచ్చిదానంద్‌ అంచనా దేశీయ మార్కెట్లు గురువారం ర్యాలీ అనంతరం శుక్రవారం వెనుకంజ వేశాయి. అంతర్జాతీయ బౌగోళిక రాజకీయాంశాలు వేడక్కడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్‌ కూడా నెగిటివ్‌గా ముగిసింది. నిఫ్టీ శుక్రవారం 12250 పాయింట్లకు దిగువన ముగిసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 12100 పాయింట్లు చాలా కీలకమని, బుల్స్‌ ఈ స్థాయిని కాపాడుకోలేకపోతే కరెక‌్షన్‌ తప్పదని ట్రేడ్‌బుల్స్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు సచ్చిదానంద ఉట్టేకర్‌ అంచనా వేశారు. ఈవారం మార్కెట్‌ పరిమిత

ఇకపై ఐసీఐసీఐ, యాక్సిస్‌ దూకుడు

Saturday 4th January 2020

ప్రయివేట్‌ రంగ బ్యాంకులకు రీరేటింగ్‌ విదేశీ బ్రోకింగ్‌ సంస్థ నోమురా అంచనా ప్రయివేట్‌ రంగ కార్పొరేట్‌ బ్యాంకులకు ఇకపై మరింత రీరేటింగ్‌ లభించనున్నట్లు గ్లోబల్‌ బ్రోకింగ్‌ కంపెనీ నోమురా తాజాగా అభిప్రాయపడింది. దీనిలో భాగంగా ఫైనాన్షియల్‌ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కౌంటర్లకు భవిష్యత్‌లో డిమాండ్‌ పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇతర వివరాలు చూద్దాం.. టార్గెట్‌ ధరల పెంపు ఇటీవల యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లు ర్యాలీ చేసినప్పటికీ ఇకపై మరింత దూకుడు

Most from this category