News


క్రూడ్‌ ధరలో పతనమా? పరుగులా?

Saturday 29th June 2019
news_main1561810181.png-26690

రెండు సమావేశాలు నిర్ధారిస్తాయి
గత రెండు వారాలుగా క్రూడాయిల్‌ ధరలు స్వల్పరేంజ్‌లో తిరుగుతున్నాయి.  చైనాతో వాణిజ్య చర్చలు పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా జీ 20 సదస్సులో ప్రకటించింది. ఈ ప్రకటన సక్రమ కార్యరూపం దాల్చకపోతే మిడ్‌టర్మ్‌లో ముడిచమురు ధరలు భారీగా పతనమైతాయని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. జపాన్‌ మీటింగ్‌లో ట్రంప్‌, గ్సిపింగ్‌ మధ్య అర్ధవంతమైన చర్చలు జరగాలని, వాణిజ్య యుద్ధం నిలిపివేసే దిశగా కచ్చితమైన చర్యలు ప్రకటించాలని ఇన్వెస్టర్లు కోరుకుంఉటన్నారు. కేవలం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగిస్తామని ప్రకటించినంత మాత్రాన ఉపయోగం ఉండదని, గట్టి చర్యలు ప్రకటిస్తేనే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ప్రస్తుతం 67 డాలర్లకు అటుఇటుగా ఉన్న బ్రెంట్‌ ధర తిరిగి 60 డాలర్ల దిగువకు పతనమైతుందని అంచనా వేస్తున్నారు.

జీ 20 సమావేశం అనంతరం ఇరువురు నాయకులు చేసే ప్రకటన వచ్చేవారం జరిగే ఒపెక్‌ సమావేశానికి దిశానిర్ధేశం చేయనుంది. ట్రేడ్‌ డీల్‌కు అనుగుణంగా ఇరువురి ప్రకటనలుంటే ఒపెక్‌ గ్రూప్‌ చమురు ఉత్పత్తి కోతను కేవలం కొనసాగించేందుకు నిర్ణయించవచ్చు. సరైన ప్రకటన రాకుంటే ఉత్పత్తి కోతలను మరింత పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు మీటింగ్‌లతో ముడిచమురు భవితవ్యం ముడిపడిఉంది. మధ్యప్రాచ్యంలో టెన్షన్ల కారణంగా ఇటీవల బ్రెంట్‌ ధర పెరుగుతూ వస్తోంది. కానీ ట్రేడ్‌వార్‌ కొనసాగితే ఈ పెరుగుదల ఆవిరవుతుందని ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారు. బ్రెంట్‌ క్రూడ్‌ గత ఏప్రిల్‌లో తాకిన 75 డాలర్లను మరోమారు చేరాలంటే ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని ఇన్వెస్టర్ల అంచనా. 



You may be interested

తుఫాను ముందు నిశ్శబ్దం?

Saturday 29th June 2019

సూచీల్లో పెరుగుతున్న డౌన్‌సైడ్‌ ఒత్తిడి నిఫ్టీ తన సరాసరి ట్రెండ్‌లైన్‌కు అటుఇటుగా ట్రేడవుతూ వస్తోంది. నిఫ్టీలోని వివిధ రంగాల్లో కొన్ని డౌన్‌ట్రెండ్‌లో, కొన్ని అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. అందువల్ల సూచీలు స్పష్టంగా ఒక ట్రెండ్‌ ఏర్పరుచుకోలేకపోతున్నాయి. అయితే అంతర్లీనంగా సూచీలో డౌన్‌సైడ్‌ ఒత్తిడి పెరిగిపోతోందని, నిఫ్టీ 11600 పాయింట్లను కోల్పోతే డౌన్‌ట్రెండ్‌ బయటపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బడ్జెట్‌ వరకు కొత్తగా పొజిషన్లు తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బడ్జెట్టే

చమురు ఉత్పత్తి కోత కొనసాగింపు!

Saturday 29th June 2019

సౌదీతో రష్యా ఒప్పందం ఒపెక్‌తో కుదుర్చుకున్న చమురు ఉత్పత్తి తగ్గింపు ఒప్పంద కాల పరిమితిని 6 నుంచి 9 నెలల వరకు పెంచాలనే నిర్ణయాన్ని రష్యా-సౌది అరేబియా ఇరుదేశాలు అంగీకరించాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం తెలిపారు. ప్రస్తుత ఒప్పందం ఇప్పుడున్న పద్ధతిలోనే, అంతే పరిమాణంలో కొనసాగుతుందని పుతిన్‌ సౌది అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటి అనంతరం ప్రకటించారు.  రోజుకు 12 లక్షల బ్యారెల్‌ చమురు ఉత్పత్తి

Most from this category